పులివెందుల
లింగాల మండలం తాతిరెడ్డి పల్లె గ్రామంలో వెన్నపూస నారాయణరెడ్డి అనే వ్యక్తి ఆకుల లక్ష్మీనారాయణ (52) పై ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వేటకులవలతో దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణ హుటా హుటిన పులివెందుల ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం వెన్నపూస నారాయణరెడ్డి లక్ష్మీనారాయణ ఇంటిలోని మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించడంతో కేసు నమోదు చేయించారు. దీనిని మనసులో పెట్టుకున్న నారాయణరెడ్డి ఆదివారం లక్ష్మీనారాయణ తన ఇంటి బయట కూర్చుండడం చూసి వేట కొడవలితో దాడి చేసి తలకు తీవ్ర గాయం చేశారు దీంతో లక్ష్మీనారాయణ స్పృహ తప్పి పడిపోయాడని పోలీసులు తెలిపారు. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నారాయణరెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు..
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…