ఖానాపూర్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంబెడ్కర్ నగర్ కాలనీకి చెందిన చెట్పల్లి అలేఖ్య అనే యువతిని ప్రేమ పేరిట వెంబడిరచి నడిరోడ్డుపై అత్యంత దారుణంగా నరికి చంపడం చూస్తే హంతకుడిలో క్రూరత్వానికి నిదర్శనమని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం మధ్యాహ్నం అంబేద్కర్ నగర్లోని అలేఖ్య నివాసానికి వచ్చిన కోదండరాం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలేఖ్య హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. హంతకుడు చేసిన విచక్షణ రహిత దాడిలో తీవ్రంగా గాయపడిన మరో యువతీ జయశీల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలేఖ్య హత్య కేసులో నిందితులు శ్రీకాంత్ సహ మరో ఇద్దరిని కఠినంగా శిక్షించాలంటే కచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జయశీల ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆమెకు భవిష్యత్తులో న్యాయం జరిగేలా తన వంతుగా సహకరిస్తానని హావిూ ఇచ్చారు.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…