అమ్రోహా
మొబైల్ ఫోన్‌తో ఆడుకుంటూ ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ కొత్వాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ కొత్వాలిలో హతైఖేడాలో నివాసం ఉంటోన్న ఐదేళ్ల బాలిక కామిని ఆదివారం తల్లి పక్కన బెడ్‌పై పడుకుని మొబైల్ ఫోన్‌లో కార్టూన్లు చూస్తూ ఉంది. ఉన్నట్లుండి ఫోన్ చిన్నారి చేతుల్లోనుంచి జారి పోయింది. చిన్నారి తల్లి వెంటనే చూడగా అప్పటికే బాలిక అపస్మారిక స్థితిలోకి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని హుటాహుటీన సవిూపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.చిన్నారి గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని హసన్‌పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జి డాక్టర్ ధ్రువేంద్ర కుమార్ తెలిపారు. చిన్నారి మృతికి గల కారణాలు తెలుసుకొనేందుకు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అప్పగించాలని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేసామని, కానీ వారు అంగీకరించలేదని అమ్రోహా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యపాల్ సింగ్ అన్నారు. చిన్నారి గుండెపోటుతో చనిపోయిందా లేదా మరేదైనా వ్యాధితో చనిపోయిందా అనే అనే విషయం ఇంకా తలియరాలేదు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇదేం మొదటిసారి కాదు. గత రెండు నెలల్లో అమ్రోహా, బిజ్నోర్ జిల్లాలలో గుండెపోటుతో డజనుకు పైగా పిల్లలు, యువకులు ఇదే విధంగా ఆకస్మికంగా మృతి చెందారు.గతేడాది డిసెంబర్ 31న అమ్రోహాలోని హసన్‌పూర్ ప్రాంతంలో క్రికెట్ ఆడుతుండగా ప్రిన్స్ కుమార్ (16) అనే యువకుడు స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ప్రకటించారు. తన కొడుకు శారీరకంగా దృఢంగా ఉన్నాడని, ఎందుకు చనిపోయాడో అర్ధంకావట్లేదని మృతుడి తండ్రి రాజీవ్ సైనీ విూడియాకు తెలిపాడు. ఇక బిజ్నోర్‌కు చెందిన షిప్రా (12 ఏళ్ల) గతేడాది డిసెంబర్ 9న తరగతి గదిలోనే కుప్పకూలి చనిపోయింది. సీనియర్ వైద్యుడు డాక్టర్ రాహుల్ బిష్ణోయ్ మాట్లాడుతూ.. సాధారణంగా చల్లని వాతావరణం కారణంగా గుండెపోటు సంభవించే అవాశం ఉంది. ఆక్సిజన్ స్థాయిలు, రక్తపోటు పడిపోయి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ చలి నుంచి తమను తాము రక్షించుకోవాలని’ ఆయన అన్నారు.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…