నిజామాబాద్, మార్చి 25
గ్రెస్‌లో నిజామాబాద్ ఎంపీ సీటు హాట్ కేక్‌లా మారింది. ఇక్కడ అభ్యర్థిని ఏఐసీసీ పెండిరగ్‌లో పెట్టడంతో ఆశావహుల చూపు ఈ స్థానంపై పడిరది. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై టీపీసీసీ, ఏఐసీసీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో రెండో విడతలో 5 ఎంపీ సీట్లు ప్రకటించినా.. అందులో నిజామాబాద్ పేరు లేకపోవడం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి ఎంపీ అరవింద్ రెండోసారి టికెట్ దక్కించుకున్నారు. బీఆర్‌ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ఖరారైంది. బీజేపీ జగిత్యాలలో బహిరంగ సభకు ప్రధానిని తీసుకువస్తే? బీఆర్‌ఎస్ పార్లమెంటు ఎన్నికలపై సెగ్మెంటు ఎమ్మెల్యేలతో కలిసి సవిూక్ష నిర్వహించింది.కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. అయితే.. ఆయనకు జిల్లాలో క్యాడర్ ఏ మేరకు సహకరిస్తుందోనన్న చర్చ జోరుగా నడుస్తోంది. బీసీ కోటాలో టికెట్ ఆశించిన మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కు ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మెన్‌గా నియమించింది ప్రభుత్వం. దీంతో ఆయన ఎంపీ టికెట్ ఆశించటం లేదు.బాల్కొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ముత్యాల సునీల్ రెడ్డి నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. జీవన్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి ఇద్దరూ ఓసీలు కావటంతో బీసీలకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తెర పైకి వచ్చింది. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితతో పాటు పలువురు పోటీ పడుతున్నారు.కాంగ్రెస్ రెండో జాబితా కొలిక్కి వచ్చినా.. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది తేలకపొవటంతో కొత్తగా మరికొంత మంది ఆశావహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా ఎంపీ సీటు కోసం ఏఐసీసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వారికే టికెట్ దక్కె అవకాశం ఉండటంతో కొందరు ఆశావహులు రేవంత్ రెడ్డి ఆశీస్సులు తమకే ఉన్నాయంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి నిజామాబాద్ సీటును ఆశిస్తున్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుపు కోసం కష్టపడ్డానని.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే తనకు ఇవ్వాలని కోరుతున్నారు.అలాగే.. జిల్లా కేంద్రంలో డాక్టరుగా పని చేస్తున్న కవితా రెడ్డి తనకు టికెట్ ఇవ్వాలని లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించి కాస్త దూకుడు ప్రదర్శిస్తుంటే.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థి వేటను కొనసాగిస్తోంది.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…