Author: Swara

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను భారత నేవీ రక్షించింది. భారత నేవీ యుద్ధనౌక INS సుమిత్ర సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన మత్స్యకారులను రక్షించినట్లు భారత రక్షణ అధికారులు తెలిపారు. ఇరాన్ ఫిషింగ్ నౌక అల్ కమర్ 786లో దాదాపు 17 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నౌకను 9 మంది సాయుధ సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. INS సుమిత్ర.. నౌకను అడ్డగించి అందులోని పాకిస్థానీ సిబ్బందిని సురక్షితంగా రక్షించింది. ఎర్ర సముద్రంలోని కార్గో నౌకలు, ఇతర కీలకమైన వ్యాపార మార్గాలపై ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారుల వరుస దాడుల మధ్య తాజా ఘటన చోటు చేసుకుంది. ఈ ఆపరేషన్ లో భారత నేవీకి చెందిన రెండు యుద్ధ నౌకలు, స్పెషల్ ట్రైన్డ్ నేవీ కమాండోలు పాల్గొన్నారు. హైజాక్ నుంచి బాధితులను కాపాడటంతో…

Read More

మాడ్రిడ్‌: సిక్కిరెడ్డి జోడీ జోరు కొనసాగిస్తూ స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకుపోయింది. ఇక స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్స్‌లో ఓటమితో టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించగా, డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప ద్వయం కూడా పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సిక్కిరెడ్డి/సుమిత్‌ రెడ్డి జంట 14-21, 21-11, 21-17తో నాలుగో సీడ్‌ ఇండోనేసియా ద్వయం రేహాన్‌ నౌఫల్‌/లిసా కుసుమావతిని చిత్తు చేసింది. ఫైనల్లో చోటు కోసం ఆరోసీడ్‌ ఇండోనేసియా జోడీ రినోవ్‌ రివాల్డీ/పిటా హనింగస్త్యతో సిక్కి ద్వయం అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్లో రెండో సీడ్‌ సింధు 26-24, 17-21, 20-22తో సుపనిద కటెథాంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌ రౌండ్‌-8లో మూడో సీడ్‌ అశ్వినీ పొన్నప్ప/తనీషా క్రాస్టో జంట 13-21, 19-21తో ఆరో సీడ్‌ లీ చియా/టెంగ్‌ చున్‌ (తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. కాగా, పురుషుల డబుల్స్‌లో భారత…

Read More

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 11వ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), పంజాబ్ కింగ్స్‌(Punjab Kings) జట్ల మధ్య లక్నో(Lucknow)లోని ఎకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిన లక్నో కేఎల్ రాహుల్(Kl rahul) నేతృత్వంలో ఈ మ్యాచులో తొలి విజయం సాధించాలని చూస్తున్నారు. లక్నో 194 పరుగుల ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన తొలి మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)పై నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయంతో ప్రారంభించారు. కానీ చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)పై 176 పరుగులను డిఫెండ్ చేయడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్ శిఖర్ ధావన్(shikhar dhawan) ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. పాయింట్ల పట్టికలో చివరి స్థానం(10)లో ఉన్న లక్నో జట్టు(LSG) ఈరోజు ఐదో స్థానంలో…

Read More

వైవిధ్య‌మైన చిత్రాల‌తో న‌టుడిగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేకమైన ఒరవడిని సృష్టించుకున్న క‌థానాయ‌కుడు సుహాస్. చిన్న నిర్మాతలకి, కొత్త దర్శకులకి సుహాస్ ఒక కానుకగా దొరికాడని, అదీకాకుండా సుహాస్ కథానాయకుడిగా నటించిన సినిమాలు మంచి విజయాలు అందుకోవటం, సుహాస్ తో సినిమా తీయాలన్న నిర్మాతల సంఖ్య పెరుగుతోంది. అలాగే సుహాస్ చిత్రాల ద్వారా కొత్త దర్శకులు కూడా పరిచయం అవుతున్నారు. సుహాస్ సినిమాలు కొన్ని విడుదలకి సిద్ధం అవుతున్నాయి, కొన్ని చిత్రీకరణలో వున్నాయి, ఈరోజు ఇంకొక కొత్త సినిమా ‘ఓ భామ అయ్యో రామ’ ప్రారంభం అయింది. ఇదొక వైవిధ్యమైన ప్రేమభరిత సినిమా, ఇందులో వినోదం పాలు కూడా ఎక్కువ ఉంటుందని చెపుతున్నారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు రామ్ గోదాల పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో సుహాస్ పక్కన మాళ‌విక మ‌నోజ్ కథానాయికగా నటిస్తోంది. గత సంవత్సరం విడుదలైన తమిళ సినిమా ‘జో’ లో మాళవిక మనోజ్ కథానాయకురాలిగా చేసి తన…

Read More

తెలుగు చిత్ర పరిశ్రమకి కూడా వేసవి తాపం బాగా ఎక్కువైంది. అందుకే కథానాయకులు అందరూ ఈ వేసవి తాపం తట్టుకోవటానికి విదేశాలు విశ్రాంతి (వెకేషన్) కోసం వెళుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే దారిలో విదేశాలకి తన స్పెషల్ విమానంలో బయలుదేరారు. ఇదే విషయాన్ని అతను తన చిత్రం ద్వారా చెప్పారు. తనకున్న ప్రత్యేక విమానంలో తన సీటుపై తన పెట్ డాగ్ కూర్చుని ఉంటే, రామ్ చరణ్ అదే సీటు అంచున కూర్చొని బయటకి చూస్తున్నారు ఆ చిత్రంలో. మార్చి 27న పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్ ఆరోజు ఎంతో బిజీగా గడిపారు. అదేరోజు తెల్లవారుజామున తిరుపతి వెళ్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కుటుంబంతో సహా దర్శనం చేసుకొని అదే రోజు ఉదయం హైదరాబాదు చేరుకున్నారు. ఇక అక్కడ నుండి అభిమానులు రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి విచ్చేస్తూనే వున్నారు. అంతకు ముందు రామ్ చరణ్,…

Read More

హైదరాబాద్‌, మార్చి 30 లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుండి అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాయి. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమైన మల్కాజిగిరి పైన ప్రధాన పార్టీలన్నీ ఫోకస్‌ పెట్టాయి. ఎలాగైనా మల్కాజిగిరి స్థానాన్ని దక్కించుకోవాలని కసరత్తులు చేస్తున్నాయి.మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి మరోసారి జెండా ఎగురవేయాలని కాంగ్రెస్‌ ఉవ్విల్లూరుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీకే నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. ప్రస్తుత ఎంపీగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం.. గత ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి మల్కాజిగిరి నుంచి ఎట్టి పరిస్థితిలో గెలుపొందాలనే ఆలోచనలో బలమైన అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్‌లో ఉన్న వికారాబాద్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌ రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకుని బరిలో నిలిపారు.మల్కాజిగిరి…

Read More

అదిలాబాద్‌, మార్చి 30 కాంగ్రెస్‌ పార్టీ గేట్లు తెరవడంతో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌ఎస్‌ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగేస్తున్నారు. సిర్పూర్‌, ముథోల్‌ మాజీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పేసుకున్నారు. మరోవైపు నిర్మల్‌, ముథోల్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లోని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలంతా పార్టీ మారారు. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆయన పార్టీలోకి రావడాన్ని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వద్దంటే వద్దంటూ ధర్నాలు చేశారు. మంత్రి సీతక్క సమావేశాల్లో సైతం మాజీ మంత్రిని తీసుకొవద్దని డిమాండ్‌ చేశారు. పార్టీ జెండా మోసిన లీడర్లు…జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు…ఎన్నికల సమాయత్తంపై సమావేశాలు నిర్వహించారు. అక్రమార్కులు, పార్టీని నష్టపర్చే విధంగా పని చేసిన ఇతర నేతలను తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే అదే సమయంలో సీతక్క…చేరికలు వద్దనొద్దని, ఎవరు వస్తే వారిని తీసుకోవాలని కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. నిర్మల్‌లోని కాంగ్రెస్‌…

Read More

హైదరాబాద్‌, మార్చి 30 ఐదేళ్లు.. కేవలం ఐదు సంవత్సరాలు.. పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది.. జేజేలు పలికిన వారు దూరం అవుతున్నారు. మాట్లాడితే చప్పట్లు కొట్టిన వారు మాకెందుకులే అనుకుంటూ వెళ్లిపోతున్నారు. తెలంగాణ బాపు అంటూ, కారణజన్ముడంటూ కితాబిచ్చినవారు వేరే పార్టీని చూసుకుంటున్నారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఒకరు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. సిట్టింగ్‌ ఎంపీ రేవంత్‌ పంచన చేరారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేపో మాపో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. ఆయన కుమార్తె కడియం కావ్య అయితే ఏకంగా పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. వెళ్తూ వెళ్తూ భారత రాష్ట్ర సమితి అక్రమాలను లేఖ రూపంలో బయటపెట్టి సంచలనం సృష్టించారు. కడియం కావ్య ఇచ్చిన షాక్‌ తో ఒక్కసారిగా కేసీఆర్‌ కు ఇబ్బందికర వాతావరణం తలెత్తినట్టు తెలుస్తోంది. వరంగల్‌ స్థానంలో బాబూ మోహన్‌ ద్వారా పోటీ చేయిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కడియం…

Read More

హైదరాబాద్‌, మార్చి 30 తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీస్‌ శాఖ మరో కీలక పరిణామానికి నాంది పలికింది. గత ప్రభుత్వంలో హైదరాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ విభాగానికి డీసీపీగా పనిచేసి, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీ (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ) గా పనిచేసిన రాధా కిషన్‌ రావు ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు.. అంతకుముందు రాధా కిషన్‌ రావును బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో గేట్లు మొత్తం మూసేసి ఆయనను విచారించారు. ఈ విచారణకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా పోలీసులు అత్యంత గోప్యత పాటించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధా కిషన్‌ రావును పోలీసులు పలు విషయాలపై విచారించారు. ఇప్పటికే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం లో ప్రణీత్‌ రావు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు,…

Read More

వరంగల్‌, మార్చి 30 కొన్ని వారాలుగా బీఆర్‌ఎస్‌ నాయకులు న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్నారు. ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో కవితను మార్చి 16న ఈడీ అరెస్టు చేసింది. పది రోజుల కస్టడీ తర్వాత తిహార్‌ జైలుకు తరలించింది. తర్వాత బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కేసీఆర్‌ మేనల్లుడు జోగినపల్లి సంతోష్‌రావుపైనా భూ ఆక్రమణ కేసు నమోదైంది. హైదరాబాద్‌లో అక్రమంగా భూమి కబ్జా చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌పైనా కేసు నమోదైంది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కించపరిచేలా కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారని పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లు మంత్రులు ఎక్కడికి వెళ్లినా విపక్షాలను అరెస్టు చేసేశారు. నిర్భందించేవారు. అక్రమంగా కేసులు పెట్టేవారు. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్‌ అయింది. ఇప్పుడు అవే కేసులను…

Read More