భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యం. భారత పార్లమెంటు ఎన్నికలంటే ప్రపంచం మొత్తం మనవైపే చూస్తుంది. ఇక ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ప్రజలకు ఓ అనే ఆయుధం సంధించే సమయం. అయితే ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండాల్సిన హక్కులు క్రమంగా హరించుకుపోతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న వారికే హక్కులు ఉంటున్నాయి. ఇతరుల స్వేచ్ఛను హరిస్తూ.. వారు హక్కులను అనుభవిస్తారు. ఈ తీరుపై అనేక విమర్శలు వస్తున్నా.. అధికారంలో ఉన్నవారి తీరు మారడం లేదు. తాజాగా అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్‌కు నిధులు అందకుండా ఖాతాలు ఫ్రీజ్ చేయడమే ఇందుకు ఉదాహరణ.బీజేపీ తీరుపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్‌విూట్ పెట్టి మరీ అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టారు. తమ పార్టీకి ఎంత నష్టం కలిగిస్తోంది. ఎంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం అని వివరించింది. ఐటీ శాఖ తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేయడంతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేకపోతున్నామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు ఖాతాల ఫ్రీజ్‌తో నేతలు ప్రచారం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక చోటు నుంచి మరో చోటకు కూడా వెళ్లలేని పరిస్థితి.ఇక పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ తరఫున కూడా ఎలాంటి సాయం అందించలేకపతున్నారు హస్తం నేతలు. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా వెల్లడిరచారు. దేశంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నా.. ప్రతిపక్షాల హక్కులను కాపాడలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయడం కన్నా కుట్ర ఏవిూ ఉండదని అన్నారు.ఇక కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. మోదీ కావాలనే చేయించారా.. లేక వేరే ఏదైనా కారణం ఉందా అని ఆరా తీస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించడంలో జాప్యం చేసిందనే కారణంతో ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. సాధారణంగా ఐటీ రిటర్న్స్ జాప్యం అయితే ఫైన్ వేస్తారు. కానీ ఖాతాలను స్తంభింపజేయడంపై విమర్శలు వస్తున్నాయి. కేంద్రం ఒత్తిడితోనే ఐటీశాఖ ఇలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఫ్రీజ్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్లపై ఒకవైపు దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నా.. మోదీ సర్కార్ కాంగ్రెస్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. వ్యవస్థలు అధికార పార్టీకి సామంతులుగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈడీ, మోడీ అన్న వాదన ఉంది. తాజాగా ఐటీ కూడా మోదీ కనుసన్నల్లో పనిచేస్తుందన్న వాదన బలపడుతోంది. ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నిధులు వాడుకోకుండా కేంద్రం అడ్డుకుంటున్నదని సోనియా మండిపడ్డారు. మోదీ, అమిత్ షాపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్కు 11శాతం ఫండ్స్ మాత్రమే వచ్చాయి. అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రం 56శాతం నిధులు వచ్చాయి. కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వారి ఖాతాల్లో పడ్డాయి. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీం కోర్టు తీర్పును సమర్థిస్తున్నాం. ఈ బాండ్ల ద్వారా బీజేపీ మాత్రమే లాభపడిరది. ఈ వ్యవహారంపై విచారణ జరగాల్సిందే. బీజేపీకి ఎవరెన్ని నిధులు ఇచ్చారో బయటపెట్టాల్సిందే. 2018?19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.210 కోట్ల బకాయిలు, పెనాల్టీలు చెల్లించాలంటూ ఐటీ డిపార్ట్మెంట్ పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ చేసింది. అకౌంట్లో ఉన్న రూ.115 కోట్లు వాడుకోకుండా చేసింది’’అని వివరించారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్లో పిటిషన్పై విచారిస్తున్న టైమ్లోనే మూడు ఖాతాల నుంచి రూ.65 కోట్లు విత్ డ్రా చేశారని ఆరోపించారు. ఓవైపు ఎన్నికల బాండ్ల వ్యవహారం.. మరోవైపు దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఆర్థిక లావాదేవీలపై దాడి జరుగుతున్నదన్నారు. అయినా, ఎన్నికల్లో తాము సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అకౌంట్లను డీ ఫ్రీజ్ చేయాలని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వేల కోట్ల రూపాయలు బీజేపీ వెనకేసుకున్నదని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి ఎన్ని నిధులు అందాయనే విషయం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నంతమాత్రాన.. రాజ్యాంగ సంస్థలను ప్రత్యక్ష లేదా పరోక్షంగా నియంత్రించకూడదని సూచించారు. ఇన్ కమ్ ట్యాక్స్లు, పెనాల్టీలు కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తాయా.. బీజేపీకి వర్తించవా? అని నిలదీశారు. ‘‘బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 56శాతం నిధులు వచ్చాయి. అలాంటప్పుడు ఐటీ శాఖకు ఎన్ని కోట్లు పన్నుల రూపంలో కట్టింది? లోక్‌సభ ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. కానీ.. రూలింగ్ పార్టీ మా అకౌంట్లు ఫ్రీజ్ చేయించి డేంజర్ గేమ్ ఆడుతున్నది. ఇలాంటి వైఖరి దేశ ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరం. అడ్డదారిలో డబ్బులు కలెక్ట్ చేసుకుని.. ఫైవ్ స్టార్ హోటల్స్లో ఆఫీసులు పెడ్తున్నరు. ఎక్కడ విూటింగ్ ఉన్నా బీజేపీ లీడర్లు విమానాల్లో జర్నీలు చేస్తున్నరు. ఒక్క విూటింగ్ కోసం చేసే ఖర్చులో ప్రతిపక్షం 10శాతం కూడా చేయడం లేదు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ విూడియాలపై కేంద్రమే పెత్తనం చేస్తున్నది’’అని ఆరోపించారు.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…