హైదరాబాద్, మార్చి 26
పేరుకు గ్రేటర్ హైదరాబాద్.. కానీ కదిలిస్తే ఎన్నో సమస్యలు కళ్ల ముందుంటాయి. ఏ సిటీకైనా కనీస వసతులతో పాటు మంచినీటి సౌకర్యం ముఖ్యం. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని చోట్లా ఇప్పటికే జనాలు కలుషిత నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ముఖ్యంగా రెండో వార్డులో తాగునీరు కలుషితమవుతుండటంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కాలనీవాసులకు బురద నీరే తాగునీరుగా మారింది. అయితే గత కొన్ని రోజులుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతుంది, దీంతో నీటి ద్వారా వచ్చే వ్యాధులు అనేకం నమోదవుతున్నాయని స్థానికులు చెబుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.నీటి నాణ్యత సరిగా లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని, క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ (క్యూఏఅండ్టీ) విభాగం లేకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు వాపోతున్నారు. ఎస్ సీబీ పంప్ హౌజ్ లకు హెచ్ ఎండబ్ల్యూఎస్ ఎస్ బీ నీటిని సరఫరా చేసిన తర్వాత నీటి నాణ్యత తనిఖీలు నిర్వహించడం లేదు. అయితే సిటీజనం తాగునీటి సమస్యను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గన్ బజార్, రసూల్పురా, కార్ఖానాలోని పలు నివాస కాలనీలు ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. ‘ముఖ్యంగా కంట్మోనెంట్ లో తాగునీటి సమస్య అంతులేని సమస్యగా మారింది. ప్రతి ఐదు రోజులకు ఒకసారి సక్రమంగా నీటి సరఫరా జరగకపోవడమే కాకుండా నీటి నాణ్యత కూడా సరిగ్గా ఉండటం లేదు. కొన్నిసార్లు బురద నీరే వస్తోంది. అది కూడా దుర్వాసనతో ఉంటుంది అని కార్ఖానా నివాసి రమేష్ తన బాధను వ్యక్తం చేశాడు.‘‘చాలా రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుండటం, కాలనీవాసులు అవి తాగుతుండటంతో చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నీరు తాగడానికి సరైంది కాదు అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కలుషిత నీటిని తాగలేక వాటర్ క్యాన్లు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయా కాలనీవాసులు.వేసవికాలం ముందు ఉన్నందున హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు ప్రకటించింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తాగునీటికి డిమాండ్ ఏర్పడుతున్నదని, మార్చి లోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో వాటర్ డిమాండ్ పీక్ స్టేజ్ కి వెళ్తుందని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ వాటర్ సప్లై బోర్డు అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు అందరికీ తాగునీరు సరఫరా చేయాలంటే వృధాను అరికట్టాలని, ఇతర వాణిజ్య అవసరాలకు తాగునీటిని వినియోగించడం నిలుపుదల చేయాలని నిర్ణయించామని వారి పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడిరచారు. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలను గండిపేట, ఉస్మాన్ సాగర్, నాగార్జునసాగర్, గోదావరి జిల్లాలో తీరుస్తున్నాయి. గత ఏడాది ఆశించినత స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో జలాశయాలలో అంతర్దమాత్రంగానే నీరు నిల్వ ఉంది. ఈ నీటిని పొదుపుగా వాడేలా ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.ఇక ప్రస్తుతం మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపు దాల్చింది. బెంగళూరు నగరంలో క్యాన్ నీటి కోసం ప్రజలు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఒకానొక దశలో బెంగళూరులో నెలకొన్న తాగునీటి ఎద్దడి వల్ల ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలా? వద్దా? అనే సందిగ్ధం ఏర్పడిరది. చివరికి బెంగళూరు వాటర్ సప్లై బోర్డు మురుగు నీటి నుంచి శుద్ధి చేసిన జలాన్ని సప్లై చేస్తామని చెప్పడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు మార్గం సుగమమయింది. కాకపోతే బెంగళూరులో నెలకొన్న తాగునీటి ఎద్దడి నేపథ్యంలో అక్కడి పురపాలక అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. తాగునీటిని కమర్షియల్ అవసరాలకు వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చివరికి వాహనాల వాషింగ్ సెంటర్ లపై కూడా నిఘా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో తాగునీటితో వాహనాలను కడగొద్దని, అలా చేస్తే భారీగా అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరు లాగానే హైదరాబాద్ కూడా కాస్మో పాలిటన్ సిటీ కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు అధికారులు పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో భాగం గానే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…