సోషల్ మీడియా(social media)లో గతంలో వెలుగులోకి వచ్చిన క్రౌడ్ ఫండింగ్(crowdfunding) విధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇటివల ఈ అంశంపై టెస్లా వ్యవస్థాపకుడు, ఎలాన్ మస్క్(elon musk) కొనుగోలు చేసిన ట్విట్టర్ స్పందించింది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్(Kulwinder Kaur gill)కు రెండు కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు. అయితే వారు ఎందుకు సాయం చేస్తామని చెప్పారు, ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.
2020 వేసవిలో లాక్‌డౌన్ సమయంలో కెనడాలో ఏర్పడుతున్న ఇబ్బందుల గురించి ఆమె సోషల్ మీడియాలో ధైర్యంగా బహిరంగంగా పోస్టులు చేశారు. కెనడా(canada)లో ఇమ్యునాలజీ, పీడియాట్రిక్స్‌లో నిపుణురాలైన వైద్యురాలైన గిల్ ఆమె కోవిడ్-సంబంధిత ట్వీట్ల కారణంగా న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. ఆ క్రమంలో లీగల్ ఫీజు 300,000 CAD (రూ. 1,83,75,078) కోసం క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా సహాయం చేయాలని కోరారు. ఆ క్రమంలో విషయం తెలుసుకున్న ఎలాన్ మస్క్ స్పందించి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె ట్వీట్‌కు రిప్లై ఇస్తూ వెల్లడించారు.