విజయవాడ, జనవరి 24
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు సోషల్ విూడియాలో ట్రెండ్ అవుతోంది. ఈరోజు ఆయన జన్మదినం కావడంతో టిడిపి శ్రేణులు వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ విూడియాలో ట్రెండ్ చేస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ విూడియాలో హోరెత్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. టిడిపి శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరోవైపు నారా లోకేష్ తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.లోకేష్ కు బర్త్ డే విషెస్ చెబుతూ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున సోషల్ విూడియాలో సందేశాలు పెడుతున్నారు. హ్యాపీ బర్త్డే యంగ్ లీడర్ లోకేష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా రెండో స్థానంలో? హ్యాష్ ట్యాగ్ ట్రెండిరగ్ లో ఉంది. నాడు మంత్రిగా లోకేష్ తీసుకున్న కీలక నిర్ణయాలను గుర్తు చేస్తూ అభిమానులు ట్విట్ చేస్తున్నారు. యువగళం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడాన్ని అభినందిస్తున్నారు. టిడిపికి భావి నాయకుడిగా అభివర్ణిస్తున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సైతం తమ ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు చెప్పారు.గత ఏడాది జన్మదిన వేడుకల సమయంలో సైతం లోకేష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండిరగ్ లో జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచారు. గత ఏడాది జనవరి 27న యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. డిసెంబర్ 20న విశాఖ జిల్లాలో ముగించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. లోకేష్ రాజకీయంగా పరిణితి సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేస్తున్నారు. గతం కంటే తన బలాన్ని పెంచుకుంటూ పార్టీపై పట్టు సాధించారు. అందుకే పార్టీ శ్రేణులు లోకేష్ కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపాయి. సోషల్ విూడియాలో లోకేష్ ట్రెండిరగ్ గా నిలవడం పై టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే స్ఫూర్తిని కొనసాగించి తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించి పెట్టాలని కోరుతున్నాయి.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…