అనంతపురం, జనవరి 23
ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఊళ్లో మగ పిల్లలకు అంటే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదంట.. ఆ ఊళ్ళో యువకులకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వాపోతున్నారు. గ్రామస్తులు ఏకంగా మంత్రికి ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆ ఊళ్ళో యువకులకు పెళ్లిళ్లు ఎందుకు అవ్వడం లేదు????.. ఆడపిల్లను ఇచ్చేవాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు..సత్యసాయి జిల్లా కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాలకు తారు రోడ్డు లేకపోవడంతో యువకులకు పెళ్లిళ్లు అవ్వడం లేదని ఓ మహిళ మంత్రి ఉషశ్రీ కి ఫిర్యాదు చేశారు. దయచేసి తమ గ్రామానికి తారు రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని.. ఆ మహిళతో పాటు గ్రామస్తులు వేడుకున్నారు. కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాల్లో మంత్రి ఉషశ్రీ పర్యటిస్తున్న సందర్భంలో మహిళలు మంత్రి గారికి తమ గోడు చెప్పుకున్నారు. ఆ రెండు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని మంత్రి ఉషశ్రీకి చెప్పారు. తమ సమస్య ఎప్పుడు తీరుస్తారంటూ ప్రశ్నించారు.మిగిలిన సమస్యలు ఎలా ఉన్నా.. మొదట తమ గ్రామానికి తారు రోడ్డు వేయాలని యువకులు కోరారు. రోడ్డు వేయిస్తానని హావిూ ఇవ్వాలంటూ మహిళలు, యువకులు మంత్రి ఉషశ్రీని పట్టబట్టారు. గ్రామానికి తారు రోడ్డు లేకపోవడం వల్ల యువకులకు .. ఆడ పిల్లను ఇచ్చే వాళ్ళ ముందుకు రాకపోవడంతో.. చేసేది ఏం లేక మంత్రి ఉషశ్రీ గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో ఇదే సరైన సమయం అనుకుని.. మంత్రి గారితో రోడ్డు వేయిస్తానని హావిూ తీసుకున్నారు. గ్రామానికి తారు రోడ్డు లేక పెళ్ళి కావడం లేదనడంతో మంత్రి ఉషశ్రీ తో పాటు అక్కడున్న గ్రామస్థులు అందరూ ఒక్కసారిగా నవ్వులు పువ్వులై పూశాయి.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…