తిరుమల, మార్చి 25
ఏపీ సీఎం జగన్ కు అత్యంత ఇష్టుడైన అధికారి ధర్మారెడ్డి. అందుకే కేంద్ర ప్రభుత్వం విభాగంలోని డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారిగా ఉన్న ధర్మారెడ్డిని టీటీడీలో కీలక బాధ్యతలు అప్పగించారు. డిప్యూటేషన్ అన్న చిన్న నిబంధనతో ఏకంగా ఐదు సంవత్సరాలు పాటు టీటీడీని కట్టపెట్టేశారు. ఆయనకు హోదా లేకపోయినా జేఈవో, తరువాత ఈవో పోస్టింగులు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయనకు సంబంధించి డిప్యూటేషన్ కాలం గడిచిపోయినా.. కేంద్ర పెద్దల కాళ్లా వేళ్లా పడుతూ పొడిగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ గడువు సవిూపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆయన డిప్యూటేషన్ మే 14తో ముగియనుంది. ఆయన రిటైర్మెంట్ తీసుకునే జూన్ 30 వరకు కొనసాగించాలని తాజాగా జగన్ కేంద్రానికి ప్రతిపాదిస్తూ ఒక లేఖ రాశారు.అసలు ధర్మారెడ్డి లేనిదే టీటీడీ వ్యవహారాలు నడవవు అన్నట్టు జగన్ భావిస్తున్నారు. అందుకే కేంద్ర సర్వీసులో ఉన్న ధర్మారెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చారు. టీటీడీ అధ్యక్షులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించగా.. అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మారెడ్డిని కొనసాగిస్తే.. తమ పని ఈజీ అవుతుందని జగన్ భావిస్తున్నట్టు ఉన్నారు. వాస్తవానికి డిప్యూటేషన్ కొనసాగుతూ వస్తోంది. రెండేళ్ల కిందట ధర్మారెడ్డికి లభించిన డిప్యూటేషన్ పొడిగింపు మే 14 తో ముగుస్తుంది. జూన్ 30న ఆయన రిటైర్ అవుతారు.అయితే ఈ 40 రోజులపాటు ధర్మారెడ్డి టీటీడీలో ఉండాలని జగన్ భావిస్తున్నారు. అందుకే కొనసాగించాలని కేంద్రానికి లేఖ రాశారు.అయితే కొద్ది రోజుల కిందట రమణ దీక్షితులు ధర్మారెడ్డిని టార్గెట్ చేసుకుంటూ కొన్ని రకాల ఆరోపణలు చేశారు. జగన్ సర్కార్ పై సైతం విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఎన్నికలకు ముందు సైతం చంద్రబాబు సర్కార్ పై ఇదే రమణదీక్షితులతో జగన్ ఆరోపణలు చేయించారు. అవి ఎంతో నష్టం చేకూర్చాయి. ఇప్పుడు అదే రమణ దీక్షితులు ధర్మారెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఆయనపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే ధర్మారెడ్డి ని ఇప్పుడు కొనసాగించాలని జగన్ కోరుతుండడం విశేషం. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. జూన్ 30తో ధర్మారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. అంటే ఈ లెక్కన కొత్త ప్రభుత్వం వద్ద ఎటువంటి చిక్కులు రాకుండా చూసుకునేందుకే ధర్మారెడ్డిని కొనసాగించాలని జగన్ కోరుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. టీటీడీ చుట్టూ నెలకొన్న వివాదాలు దృష్ట్యా.. ధర్మారెడ్డి స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తవారిని నియమిస్తే అసలు వస్తుందన్న భయం వెంటాడుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ధర్మారెడ్డి కోసం జగన్ ఆరాటపడుతున్నారని విపక్షాలు ఆలోచిస్తున్నాయి.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…