తిరుపతి, మార్చి 25
సత్యనేడు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్` తమిళనాడు సరిహద్దులో ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పడిరది. సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కండ్రిగ, పిచ్చాటూరు, నిండ్ర, నారాయణవనం, నాగలాపురం, కేవీబీ పురం మండలాలు ఉన్నాయి.2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలంపై టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య తారా చంద్రకాంత్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేడీ రాజశేఖర్ పై వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలం గెలిచారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన వైసీపీ పార్టీపై వ్యతిరేక స్వరం వినిపించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆయన ఆ తరువాత టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ పార్టీ నుంచి కొనేటి ఆదిమూలంను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిందినియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి పెనం విూద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని స్థానికంగా వినిపిస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా తాము పార్టీని నమ్ముకుని అనేక ఇబ్బందులు పడ్డామని… వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం టీడీపీ నాయకులు, కార్యకర్తల పై కేసులు ఉంటూ ప్రతి గ్రామంలోని వారిపై ఏదో ఒక కారణంతో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని… వైసీపీ నుంచి గెలిచే అవకాశం లేకపోవడంతో టీడీపీ లో చేరారరన్నారు. నిన్నటి వరకు ఇబ్బంది పెట్టిన వ్యక్తికి ఎలా పని చేస్తామని పార్టీ క్యాడర్ అంటోంది. మరోవైపు కొందరు టీడీపీ నాయకులు ఆదిమూలంకు మద్దతుగా నిలుస్తున్నారు.టీడీపీ పార్టీకి మొదట్నుంచీ నుంచి పని చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ నేత జేడీ రాజశేఖర్ ఈసారి రెబల్ గా మరారు. వైసీపీ పార్టీ ఇబ్బందులు పెట్టిన టీడీపీ పార్టీ తో ఉన్న తనకు కాదని తమపై కేసులు పెట్టిన వ్యక్తికి సీటు ఇవ్వడంతో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నియోజకవర్గంలో జేడీ రాజశేఖర్ ప్రచారం సైతం చేస్తున్నారు. ఆయన వెనకంటీ ఉన్న నాయకులు సైతం ఆయనకే మద్దతుగా నిలుస్తున్నారు. ఇక మరో వైపు మాజీ ఎమ్మెల్యే హేమలత తన కుమార్తె హెలెన్ కు సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హెలెన్ ను గత రెండేళ్లు క్రితం టీడీపీ పార్టీ ఇన్చార్జి గా ప్రకటించింది. ఆమె సైతం నియోజకవర్గంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్తగా ఎన్‌ఆర్‌ఐ రాజేష్ పేరు తెర పైకి వచ్చింది. నియోజకవర్గంలో ఆర్ధిక, సామాజిక వర్గం బలం ఉందని.. ఆయన సైతం పోటీలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ పార్టీ కొనేటి ఆదిమూలంకు సీటు అని ప్రకటించినా.. ఇంతవరకు ఆయన బయటకు రాలేదు. పార్టీ అధిష్టానం సైతం నాయకులతో మాట్లాడలేదు. దీంతో ఏం జరుగుతుందో అని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ కి వెళ్ళడంతో ఆ స్దానాన్ని కొత్త వ్యక్తికి వైసీపీ కేటాయించింది. తిరుపతి ఎంపీ అభ్యర్థికి సన్నిహితంగా ఉండే నూకతోటి రాజేష్ పేరు ప్రకటించింది. ఈయన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండగా అనూహ్యంగా ఆయన పేరు రావడం వైసీపీ నాయకులలో సైతం కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో వైసీపీ నాయకుల మధ్య సఖ్యత కుదిరింది. జిల్లాకు చెందిన వైసీపీ పెద్ద నాయకులతో కలిసి ప్రచారం సైతం ప్రారంభించారు.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…