మాడ్రిడ్: సిక్కిరెడ్డి జోడీ జోరు కొనసాగిస్తూ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకుపోయింది. ఇక స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌లో ఓటమితో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించగా, డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప ద్వయం కూడా పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో సిక్కిరెడ్డి/సుమిత్ రెడ్డి జంట 14-21, 21-11, 21-17తో నాలుగో సీడ్ ఇండోనేసియా ద్వయం రేహాన్ నౌఫల్/లిసా కుసుమావతిని చిత్తు చేసింది. ఫైనల్లో చోటు కోసం ఆరోసీడ్ ఇండోనేసియా జోడీ రినోవ్ రివాల్డీ/పిటా హనింగస్త్యతో సిక్కి ద్వయం అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్లో రెండో సీడ్ సింధు 26-24, 17-21, 20-22తో సుపనిద కటెథాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్ రౌండ్-8లో మూడో సీడ్ అశ్వినీ పొన్నప్ప/తనీషా క్రాస్టో జంట 13-21, 19-21తో ఆరో సీడ్ లీ చియా/టెంగ్ చున్ (తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. కాగా, పురుషుల డబుల్స్‌లో భారత జంట ఎమ్‌ఆర్ అర్జున్/ధ్రువ్ కపిల జోడీకి క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. రెండోసీడ్‌గా బరిలోకి దిగిన అర్జున్ ద్వయంపై 21-19, 21-23, 21-17తో మలేసియా జంట జునైది ఆరిఫ్/రా కింగ్ యాప్ గెలిచింది.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…