చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ కార్ SU7 మోడల్ ధరలను గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతోపాటు కొనుగోళ్ల కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే కార్ ధర 5 లక్షల యువాన్ల (దాదాపు రూ. 58 లక్షలు) లోపే ఉంటుందని కంపెనీ సీఈఓ లీ జున్(CEO Lei Jun) తెలిపారు. ఇది చాలా అందంగా కనిపించడంతోపాటు డ్రైవింగ్ చేయడానికి సులభంగా, స్మార్ట్‌గా ఉంటుందని ఆయన తెలిపారు.
ఇది టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంటే ఎక్కువ యాక్సిలరేషన్ ఇస్తుందని లీ చెప్పారు. అయితే డిసెంబర్‌లో ఈ కారును ప్రకటించినప్పటి నుంచి దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ఇది ప్రపంచంలోని టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులలో ఒకటిగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. చైనా(china)లోని షియోమీ షోరూమ్‌లో ఈ కారు ప్రదర్శన కూడా ప్రారంభమైంది.