హైదరాబాద్, మార్చి 28
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతుంది. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఎండల నేపథ్యంలో మార్చి 15 నుంచే రాష్ట్రంలో స్కూళ్లకు ఒంటి పూట బడులు మొదలయ్యాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు తెలంగాణలో ఒంటి పూట బడులు ఉంటాయి. ఏప్రిల్ 24 పాఠశాలలకు చివరి వర్కింగ్ డే గా తెలుస్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 25 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒండి పూట బడులు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మంచి నీటి సదుపాయం ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులుప్రకటించే అవకాశం ఉంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ ఆదేశాల మేరకు వేసవి సెలవులు అమలుచేయాలి. ప్రైవేట్ స్కూల్స్ లో తొమ్మిది పూర్తి చేసి పదో తరగతి వెళ్లే విద్యార్థులకు స్పెషల్ క్లాస్ ల పేరిట తరగతులు నిర్వహిస్తున్నారు. ఇలా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని విద్యాశాఖ అధికారులు గతంలో తెలిపారు. మార్చి 18 నుంచి పదో విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ పరీక్షలు ముగుస్తాయి. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సెలవులు ఉంటాయి. దీంతో పదోతరగతి విద్యార్థులకు 60కి పైగా రోజులు సెలవులు వస్తుంటాయి.రాష్ట్రంలో ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండే అవకాశం ఉంది. జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెన్‌అవుతాయని అధికారులు అంటున్నారు. వేసవి సెలవులపై ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ తెలిపింది. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయని, విద్యార్థులు మధ్యాహ్నం పూట ఎండలో ఆటలు ఆడకుండా పేరెంట్స్ ఓ కన్నేసి ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తకుండా తరచూ మంచినీరు, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ తాగాలని సూచించారు.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…