హైదరాబాద్: ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా బుధవారం ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై బౌలర్లు నామమాత్రంగా మారిపోయిన వేళ ఫోర్లు, సిక్సర్ల వర్షంతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి 523 పరుగులు బాదాయంటేనే పరుగులు ప్రవాహం ఏ స్థాయిలో పారిందో అర్థం చేసుకోవచ్చు. రెండు జట్లు కలిసి ఏకంగా 31 ఫోర్లు, 38 సిక్సులు బాదాయి. దీంతో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఆనందంతో కేరింతలు కొడుతూ ఆటగాళ్లను ఎంకరేజ్ చేశారు. ఇందులో భాగంగానే ఓ చిన్నారి కూడా ఆనందంలో మునిగితేలింది. మైదానంలో తన తండ్రి సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోతుంటే ఆ పాప ఆనందంతో మురిసిపోయింది. గ్యాలరీల్లో నుంచి తమ జట్టు జెండాను ఊపుతూ తండ్రిని ఎంకరేజ్ చేసింది. ఆ పాప ఎవరో కాదు సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) ముద్దుల కూతురు. తన తండ్రి ముంబై బౌలర్లను ఉతికారేస్తుంటే ఆ పాప జెండా ఊపుతూ ఎంకరేజ్ చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఇంట్లో బెస్ట్ సీట్. తండ్రికి పెద్ద అభిమాని. అని ట్వీట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్‌గా మారింది. దీంతో ఆ చిన్నారిపై నెటిజన్లు, సన్‌రైజర్స్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఆమె అభిమానానికి అంతా ఫిదా అయిపోయితున్నారు. కాగా బుధవారం నాటి మ్యాచ్‌లో క్లాసెన్ రెచ్చిపోయిన సంగతి తెలిసిదే. ముంబై బౌలర్లను ఉతికారేసిన క్లాసెన్ 34 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సులతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 277/3 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(62), అభిషేక్ శర్మ(63), క్లాసెన్(80) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం లక్ష్య చేధనలో ముంబై జట్టు మొదటి 10 ఓవర్లలో చేసిన బ్యాటింగ్ చేస్తే ఒకానొక దశలో వారే గెలుస్తారేమో అనిపించింది. కానీ డెత్ ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 246/5 వద్ద పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(64), టిమ్ డేవిడ్(42), ఇషాన్ కిషన్(34) చెలరేగారు.
The best seat in the house? Right next to dad's biggest fan! 🏟️🧡
HK’s little one was all of us today 😍 pic.twitter.com/aQsSO4D3Js
— SunRisers Hyderabad (@SunRisers) March 27, 2024