సైబర్ మోసాలపై అవేర్‌నెస్ ఎంత పెరుగుతున్నా మోసాల సంఖ్య మాత్రం తగ్గట్లేదని రిపోర్ట్‌లను బట్టి తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మూడేళ్లలో సుమారు 12 వేల సైబర్ మోసాలు జరిగాయట. దాదాపు రూ.461 కోట్ల డబ్బు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లింది. ముఖ్యంగా ఎలాంటి సైబర్ మోసాలు కామన్‌గా జరుగుతున్నాయంటే.. దేశంలో జరుగుతున్న సైబర్ మోసాల్లో క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్‌ల ద్వారా జరుగుతున్న మోసాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సరైన సెక్యూరిటీ, పాస్‌వర్డ్‌లు మెయింటెయిన్ చేయకపోవడం వల్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. దీంతోపాటు మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఏఐ టూల్స్ ద్వారా కూడా పలు రకాల మోసాలు అమలుచేస్తున్నారు సైబర్ నేరగాళ్లురీసెంట్‌గా జరిగిన పలు సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా జరిగిన మోసాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ నిర్వహించిన ‘ది ఆర్టిఫిషియల్ ఇంపోస్టర్’ సర్వేలో సుమారు 47 మంది భారతీయులు ఏఐ వాయిస్ స్కామ్‌లను ఎదుర్కొన్నట్లు తెలిసింది. వీరిలో చాలామంది రూ.50,000 కంటే ఎక్కువ నష్టపోయారని రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది.ఉచితాలు ఎలా వస్తాయని లేదా మనకెందుకు ఇస్తారని ఒక్క క్షణం ఆలోచిస్తే కష్టార్జితం మిగిలేది కదా. ఇలా ఇంటర్‌నెట్ వేదికగా ఎనో రకాల అక్రమాలకు అడ్డగా మారుతున్న సైబర్ మోసలు నగరాల నుంచి పల్లెల వరకు చేరాయి. ఇటీవల అనేక ఇంటర్‌నెట్ మోసాలు పల్లెల్లో కూడా బయటపడుతున్నాయి. పరువుపోతుందనే భయంతో బాధితులు బయటపడడంలేదు, ఫిర్యాదులు చెయ్యడం లేదు. దీని వల్ల మరి కొందరు మోసపోతున్నారు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా మోసాలు జరుగుతున్నా అవగాహన లేని వ్యక్తులు నష్టపోతూనే ఉన్నా రు. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడి మా కంపెనీలో పెట్టుబడి పెట్టుమని కోరడంతో కొందరు దురాశకు వెళ్లి అడిగిందే తడవుగా ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్‌కు డబ్బులు పంపించడం, మొదట కొంత లాభం రావడంతో నమ్మి, అప్పు తెచ్చి, మోసగాడు చెప్పిన అకౌంట్‌కు డబ్బులు పంపిస్తూ లాభం ఆశతో నష్టపోయి మోసగాడి బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.హలో సార్ మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి, విూ డబ్బులు రెట్టింపు అవుతాయి, మా లక్కీ డ్రాలో విూరు కోటి రూపాయలు గెలుచుకున్నారు. కానీ కొంచెం టాక్స్ కట్టాలి డబ్బులు పంపించండి. విూ లక్కీ ప్రైజ్ మనీని విూకు పంపిస్తాం ఛార్జీలు విూరు భరించాలి కొంత రుసుము పంపండి.. ఇలాంటి మాటలు నిజమని నమ్మి నేరగాళ్ల వలలో చిక్కి ఉన్నది పోగొట్టుకుని బంధువులకు, మిత్రులకు చెప్పలేక అప్పుల ఊబిలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయినవారు కొందరైతే.. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు మరి కొందరు. విూరు ఫలానా కంపెనీలో లక్కీ కస్టమర్ హైదరాబాద్ పట్టణంలో విల్లా గెలుసుకున్నారు 10% చెల్లిస్తే మా కంపెనీ ప్రతినిధి వచ్చి విూకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు అనగానే ఎగిరి గంతేసి ఛార్జీలు చెల్లించి చివరకు మోసపోయామని లబోదిబో అన్నవారు ఆలోచించాలి.డబ్బులు పంపించి ఆర్థికంగా నష్టపోయి, ఎంతో శ్రమించి సంపాదించిన ఆస్తిని సైతం పోగొట్టుకుని రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగులు, విద్యార్థులే కాకుండా రాజకీయ నాయకులు కూడా సైబర్ మోసం నుండి తప్పించుకోలేకపోతున్నారు. తక్కువ రోజుల్లో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మి ఇన్వెస్ట్ చేసి మోసపోయిన సంఘటనలు. లక్కీ డ్రా వచ్చిందంటూ మెసేజ్ రావడంతో వాటిని నమ్మి కరీంనగర్, నిజామాబాదు, హైదరాబాద్ పట్టణాలకు వెళ్లి మరో రూ. 50 వేల చొప్పున కట్టి ఆ కంపెనీ బోర్డు తిప్పడంతో భారీగా నష్టపోయిన సంఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి. ఇంటర్‌నెట్ మోసాలకు అంతే లేకుండాపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్క్‌లో ఒకటి ఫేస్‌బుక్. సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా కూడా ఫేస్‌బుక్ నిలుస్తోంది. ఫేస్‌బుక్‌ను అడ్డం పెట్టుకుని చేసే నేరాలలో అకౌంట్లను హ్యాక్ చేయడం, డబ్బును డిమాండ్ చేయడం, వివరాలను దొంగిలించడం, భావోద్వేగాలతో ఆడుకోవడం, షాపింగ్ మోసం, ఫేక్ ఫ్రెండ్ రిక్వెస్ట్, అత్యవసరంగా డబ్బులు అవసరం అనే వాటితో మోసాలు వంటివిఎన్నో జరుగుతున్నాయి. సోషల్ నెట్‌వర్క్ ద్వారా భారీ సంఖ్యలో వ్యక్తులు కనెక్ట్ అయి ఉండడం గమనించిన సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకుందాం అనే రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్ హ్యాకింగ్, నకిలీ ప్రొఫైల్ సృష్టించి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి వివిధ కారణాలతో వేర్వేరు వ్యక్తులను సంప్రదించి, డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ప్రొఫైల్ యజమాని ఈ విషయాన్ని తెలుసుకొని, ఈ వార్తను అందరికీ తెలియజేసే వరకు అతని ప్రొఫైల్ హైజాక్ అయిందని తెలియదు. దీంతో ఫేస్‌బుక్ ఖాతాకు చెందిన తమ స్నేహితుడి నుండి రిక్వెస్ట్ వచ్చిందని మిగతావారు నమ్ముతారు. ఇది ఫేస్‌బుక్ చీటింగ్ స్కామ్ సంబంధించిన కేసు అని ఆలస్యంగా తెలుసుకుంటారు. ఇలా కొంత మంది డబ్బు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. సోషల్ విూడియాలో జరిగే ఆర్థిక మోసలకు అడ్డుకట్టపడడం లేదని, మన దేశంలో సైబర్ నేరాలకు శిక్షలు కఠినంగా లేకపోవడంతో సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని, సైబర్ క్రైమ్ చట్టాలలో మార్పు తీసుకు వచ్చి మరింత ఆధునిత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, పోలీసులు శాఖ ప్రత్యేక నిఘా విభాగాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల ఇలాంటి మోసాలను కట్టడి చేయవచ్చనీ గ్రహించాలి.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…