తిరుపతి, మార్చి 25
తిరుపతి లోక్‌సభ స్థానాన్ని పార్టీలు మారి వచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వడం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. మూడు పార్టీలు మారి బీజేపీలో చేరి టిక్కెట్ ను తెచ్చుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఏ మేరకు సహకరిస్తాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు సీటు మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావుకు బీజేపీ సీటు కేటాయించింది. అయితే ఆయనకు ఏ విధంగా టిక్కెట్ ఇస్తారని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నరసాపురంలో గెలిచే రఘురామ కృష్ణరాజుకు కాదని పార్టీ నేతకు టిక్కెట్ ఇచ్చినప్పుడు తిరుపతిలోనూ అదే ఫార్ములా ఎందుకు పనిచేయదని కమలం పార్టీలో కొందరు నిలదీస్తున్నారు.ఇంటి పేరునే బ్రాండ్ గా మార్చుకున్న లీడర్‌ను జనం ఆదరిస్తారా? ట్రాక్ రికార్డు మాత్రం… తిరుపతి పార్లమెంటు స్థానం ఎప్పుడూ కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీలదే. చివరిసారి 1999లో తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటస్వామి గెలుపొందారు. అదే ఆఖరు. ఆ తర్వాత జరిగిన 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ , వైసీపీలు మాత్రమే గెలిచాయి. 1984లో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో చింతామోహన్ టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీకి ఆ తర్వాత తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు పిలుపు వినిపించలేదు. ఇప్పటి వరకూ అక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. దానికి అనేక కారణాలున్నాయి. తిరుపత నియోజకవర్గం పరిధిలో ఉన్న చంద్రగిరి, గూడూరు, తిరుపతి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేటలు ఉన్నాయి. వీటిలో టీడీపీ బలహీనంగా ఉండటమే కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…