మెదక్, మార్చి 28
తెలంగాణలో అధికారం మారిన వెంటనే రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం అనేక ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్ పై రకరకాల ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా సంతోష్ రావుపైనా కేసు నమోదు అయింది. కేసీఆర్ మరో సవిూప బంధువు కల్వకుంట్ల కన్నారావు పోలీసుల నోటీసులకు స్పందించడం లేదు. అయితే కేసీఆర్ కుటుబంంలో ఒక్క హరీష్ రావుపై మాత్రం చిన్న ఆరోపణ కూడా రావడం లేదు. ఇది తెలంగాణ రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. హరీష్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఔదార్యం చూపిస్తోందా ? బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం వరుస కేసులు, విచారణలతో విలవిలలాడుతున్నది. ఒక రకంగా కేసులు, విచారణల పద్మవ్యూహంలో చిక్కుకుంది. ఒకవైపు ఈ కేసులతోపాటు.. పార్టీ నుంచి వలసలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేసీఆర్ కుమార్తె కవితను ఢల్లీి లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఆమెను ఢల్లీి లిక్కర్ స్కాంలో అత్యంత కీలక పాత్రధారిగా చూపిస్తున్నారు. ఆ హడావుడిలో ఉండగానే కేసీఆర్ అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావును పోలీసులు ఓ భూ వివాదంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బీఆరెస్ మాజీ ఎంపీ, కేసీఆర్ సవిూప బంధువు జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై భూ కబ్జా కేసు నమోదైంది. మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో కవిత భర్త అనిల్‌ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నదన్న చర్చ నడుస్తున్నది. ఆయన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక కేసీఆర్, కేటీఆర్ లపై కేసులంటూ జరుగుతున్న ప్రచారానికి అడ్డూ అదుపూ ఉండటం లేదు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణతో పాటు రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథార్టీ సైతం విచారణ చేస్తున్నది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాల వివాదాలపై కూడా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్, అవుటర్ రింగ్ రోడ్డు ఒప్పందం వంటి వివాదాలు ఉండనే ఉన్నాయి. ఆయా వివాదాల విచారణల ముగింపు క్రమంలో కేసీఆర్, కేటీఆర్, పై కేసులు నమోదయ్యే అవకాశముందని కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. ఇక ఎస్‌ఐబీలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతూ అంతిమంగా బీఆరెస్ పెద్దలకు.. ముఖ్యంగా కేటీఆర్ లేక కేసీఆర్‌కు చుట్టుకునే అవకాశముందన్న ప్రచారం వినిపిస్తున్నది. ఇన్ని చిక్కులు.. కేసుల మధ్య ఒకే ఒక్క పేరు మాత్రం స్వచ్చంగా ఉంది. ఎందులోనూ పేరు బయటకు రావడంలేదు. ఆ పేరే హరీష్ రావు. హరీష్ రావుపై ఒక్క కేసు కూడా నమోదయ్యే సూచనలు కనిపించడం లేదు. కేసీఆర్ ఫ్యామిలీలో .. బీఆర్‌ఎస్ పార్టీలో హరీష్ రావు ఎంత కీలకమైన వ్యక్తో చెప్పాల్సిన పని లేదు. కొద్ది రోజులు తప్ప పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఆయన కీలక శాఖలు నిర్వహించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ జరిగింది హరీష్ రావు భారీ నీటి పారుదల మంత్రిగా ఉన్నప్పుడే. కాళేశ్వరం నిర్మాణం అప్పుడే ప్రారంభమయింది. అయితే రెండో సారి బీఆర్‌ఎస్ గెలిచిన తర్వాత ఆయనకు ఆలస్యంగా మంత్రి పదవి ఇచ్చారు.. కానీ నీటి పారుదల శాఖ ఇవ్వలేదు. అలాగని ఆయన ప్రమేయం లేదని అనలేరు. కానీ.. కాళేశ్వరం విషయంలో కానీ.. మరో అంశంలో కానీ హరీష్ రావు అక్రమాలకు పాల్పడ్డారన్న వార్తలు కానీ.. ఆరోపణలు కానీ.. లీకులు కానీ ప్రభుత్వం నుంచి రావడం లేదు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ.. ఢల్లీిలోని బీజేపీ ప్రభుత్వం నుంచి కానీ ఇలాంటి సమచారం లేదు. హరీష్ రావు మాత్రమే… ఎందుకు సేఫ్ గా ఉంచుతున్నారన్నది రాజకీయవర్గాలకు సస్పెన్స్‌గా మారింది. హరీష్ రావు కు కేసీఆర్ ఎంత చెబితే అంత. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిందన్న భావన వచ్చినప్పుడు కూడా ఆయన ఒక్క మాట కూడా వ్యతిరేకంగా అసంతృప్తిగా మాట్లాడలేదు. కానీ ఆయనపై సోషల్ విూడియాలో ఎన్ని పుకార్లు వచ్చాయో చెప్పడం కష్టం. బీజేపీలో చేరిపోతారని ఓ సారి సొంత పార్టీని చీలుస్తారని చాలా సార్లు ప్రచారం జరిగింది. కానీ హరీష్ ఎప్పుడూ వాటిపై స్పందించి అనవసర రచ్చ చేయలేదు. కానీ హరీష్ రావును బీఆర్‌ఎస్ పార్టీకి దూరం చేయడమో లేకపోతే ఆ పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించేలా చేయడమో చేయాలన్న వ్యూహం ఇతర పార్టీలు అమలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే భాగంగాన ఆయనపై కేసుల నీడ పడకుండా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పరిస్థితి హరీష్ రావుకు కూడా సవాల్ లాంటిదే. ఆయన ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ప్రత్యర్థి పార్టీల వ్యూహం ఫలించే అవకాశం ఉంటుంది.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…