Close Menu
Swara NewsSwara News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

March 30, 2024

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024
Facebook X (Twitter) Instagram
Trending
  • భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
  • సెమీస్‌లో సిక్కి జోడీ
  • నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
  • ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
  • వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
  • మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
  • ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…
  • కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Facebook X (Twitter) Instagram
Swara NewsSwara News
Demo
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్
Swara NewsSwara News
Home » మండుతున్న సూరీడు…
తెలంగాణ

మండుతున్న సూరీడు…

SwaraBy SwaraMarch 26, 2024Updated:March 26, 2024No Comments2 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

హైదరాబాద్‌, మార్చి 26
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం చల్లబడిన వాతావరణం ఇప్పుడు రోజురోజుకూ వేడి పెరిగిపోతుంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే 41 డిగ్రీలు దాటాయి. ఇక రాత్రి పూట పలు ప్రాంతాల్లో 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే నిర్మల్‌ మండలంలోని అక్కాపూర్‌ గ్రామంలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం మధ్యాహ్నం వరకు అక్కాపూర్‌లో దాదాపు 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.ఆ తర్వాత 41 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిజామాబాద్‌ మోర్తాడ్‌ రెండో స్థానంలో నిలిచింది. కుమ్రంభీంలోని ఆసిఫాబాద్‌లో 40.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌లోని చాప్రాలాలో 40.8 డిగ్రీలు, సూర్యాపేటలోని రైనిగూడెంలో 40.7 డిగ్రీలు, నిజామాబాద్‌లోని కోరట్‌పల్లిలో 40.7, మహబూబ్‌నగర్‌లోని వడ్డేమాన్‌లో 40.6 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లాలోని దస్తూరాబాద్‌లో 40.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 40.5 డిగ్రీలు, సిరికొండలో 40.5 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (టీఎస్‌డీపీఎస్‌) వెల్లడిరచింది.ఇక మునుముందు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉదయం సమయంలో చల్లని వాతావరణం దర్శనమిచ్చినా.. మధ్యాహ్నం వేళల్లో మాత్రం ఎండ దంచికొడుతోంది. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు శీతల పానీయాలను సేవిస్తూ.. చల్లని ప్రాంతాల్లో సేద తీరుతున్నారు. ఇక హైదరాబాద్‌లోనూ వచ్చే ఐదురోజులు ఎండ తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా మార్చి 28, 29, 30 తేదీల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, రాత్రిపూట 25 నుంచి 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే నెల రెండో వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరనుంది. ఏప్రిల్‌, మే నెలల్లో వడగాల్పుల తీవ్రత అధికమవనుంది.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
Swara
  • Website

Related Posts

మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం

March 30, 2024

ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…

March 30, 2024

కావ్య బాటలో మరో అభ్యర్ధి…

March 30, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ఇంకా జనసేన మూడు స్థానాలు పెండిరగ్‌

March 30, 202412

వంగవీటి రాధా..దారెటు

March 30, 202411

జగన్మోహన్‌ వర్సెస్‌ సౌమ్య

March 30, 202410

ఏపీ రాజకీయాల్లో …వాళ్లు

March 30, 202410
Don't Miss
అంతర్జాతీయం

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

By SwaraMarch 30, 20244

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను…

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024

‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

March 30, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
© 2025 All Copyrights Reserved By SWARA NEWS.
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • Crime
  • Sports
  • Movies

Type above and press Enter to search. Press Esc to cancel.