హైదరాబాద్, మార్చి 25
ప్రభుత్వం మారింది. పాలకులు మారారు. అయినా గత ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నతాధికారులు అలానే కొనసాగుతున్నారు. వారే ఇప్పుడూ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారా? గతంలో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను ఇంకా అదే స్థానంలో కొనసాగించడం వెనక ఆంతర్యం ఏంటి? ఇంతకీ కాంగ్రెస్ సర్కార్.. ఆ ఉన్నతాధికారులను ఎందుకు అలానే ఉంచుతోంది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులందరిపై వేటు వేసే పని మొదలుపెట్టింది. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన కొంతమంది అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం.. మరికొంతమంది అధికారులకు మాత్రం కీలక పదవుల్లోనే కొనసాగిస్తూ వస్తోంది. ఇదే ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వేటుపడిన అధికారులు మెల్లమెల్లగా పెదవి విప్పుతున్నారు. తమకు పైరవీలతో పనిలేదని.. ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఎలాంటి పని చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, పైరవీలు చేసి పోస్టింగులు తెచ్చుకోబోమని కామెంట్స్ చేస్తున్నారు.అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అలా కొనసాగుతున్న వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణారావు, ఐటీ సెక్రెటరీ జయేశ్ రంజన్, రెవెన్యూ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తదితరులు ఇప్పటికీ కీలక పదవుల్లో ఉన్నారు. ఈ అధికారులపై గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాటు ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క లాంటి వాళ్లు తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు. కానీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. పాతవారిని కొనసాగిస్తున్నారుకేసీఆర్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసిన స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్తో పాటు మున్సిపల్ శాఖ సెక్రెటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ లాంటి అధికారులపై వేటు వేసి ఇతర శాఖలకు బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఇంతవరకు బాగానే ఉన్నా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, ఇప్పుడు ముఖ్యమైన రెవెన్యూ, ఆర్థిక, ఐటి, పరిశ్రమల శాఖల్లో ఉన్న అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారన్న చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో కొనసాగుతోంది.కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఆయా శాఖల్లో పనిచేస్తున్న కొంతమంది అధికారులతో సర్కారుకు అవసరం ఉంటుందని, అందుకే కీలక శాఖల అధికారులను కొంతమందిని ఇంకా కొనసాగిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల వరకు ఇప్పుడున్న అధికారులు కొనసాగుతారని, ఆ తర్వాత.. వీరిపై కూడా వేటుపడే అవకాశం ఉంటుందన్న చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను వరుస పెట్టి ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కలిశారు. అలా కలిసిన అధికారులు అదే పోస్టుల్లో కొనసాగుతున్నారని, సీఎంను కలవని వారిని మాత్రం ప్రాధాన్యత లేని శాఖలకు బదిలీ చేశారన్న వాదన వినిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో లూప్‌లైన్లో ఉన్న అధికారులు కీలక పోస్టింగుల్లోకి వస్తారా, ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్న అధికారులు లూప్‌లైన్లోకి వెళ్తారా అన్నది వేచి చూడాలి.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…