Close Menu
Swara NewsSwara News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

March 30, 2024

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024
Facebook X (Twitter) Instagram
Trending
  • భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
  • సెమీస్‌లో సిక్కి జోడీ
  • నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
  • ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
  • వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
  • మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
  • ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…
  • కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Facebook X (Twitter) Instagram
Swara NewsSwara News
Demo
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్
Swara NewsSwara News
Home » కొనసాగుతున్న నేతల ఎత్తిపోతల పధకం
తెలంగాణ

కొనసాగుతున్న నేతల ఎత్తిపోతల పధకం

SwaraBy SwaraMarch 30, 2024No Comments7 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

హైదరాబాద్‌, మార్చి 30, (న్యూస్‌ పల్స్‌)
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గరి నుంచి గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. తెలంగాణలో నీటి ఎత్తిపోతల పథకాలు ఎండిపోతున్నా.. నేతల ఎత్తిపోతల ప్రాజెక్టు మాత్రం కళకళలాడుతోంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. చేరడమే కాదు దానంకు సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ కూడా కేటాయించింది.కష్టమొచ్చినా నష్టమొచ్చినా కేసీఆర్‌ వెంటే నడుస్తాం.. పార్టీ మారే ప్రసక్తే లేదు.. అసలు ఆ అవసరమే లేదు.. అంటూ పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ పెద్ద పెద్ద సవాళ్లు చేస్తున్న నేతలే.. తెల్లారితే కాంగ్రెస్‌ కండువానో, కాషాయ కండువానో కప్పుకుని కనిపిస్తూ.. షాక్‌లవిూద షాక్‌లు ఇస్తున్నారు. పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ వెంకటేష్‌ నేతతో మొదలైన వలసల ప్రవాహం.. మెల్లమెల్లగా ఊపందుకుని.. ఇప్పుడు జోరుగా నడుస్తోంది. తాజాగా బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్న కే.కేశవరావు కూడా బీఆర్‌ఎస్‌కు బైబై చెప్పారు. ఆయన కూతురు హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి కూడా హస్తం గూటికి చేరనున్నారు. అంతేనా కడియం శ్రీహరి కుటుంబం కూడా కారుదిగింది. బీఆర్‌ఎస్‌ వరంగల్‌ ఎంపీ టికెట్‌ కడియం కూతురు కావ్యకు ఇచ్చినా ఆమె పార్టీకి రాజీనామా చేశారు. కూతురుతోపాటు తండ్రి కూడా గులాబీకి గుడ్‌బై చెప్పేశారు. ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీలు ఇప్పుడు కాంగ్రెస్‌ జట్టులోకి చేరడంతో కాంగ్రెస్‌ మరింత బలంగా తయారవుతోంది. లోక్‌సభ ఎన్నికల వేళ..ఇది కచ్చితంగా బీఆర్‌ఎస్‌ను దెబ్బదీసే తంత్రమే. సామాజిక వర్గాల పరంగానూ చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ పక్కపార్టీ నేతలను తనలో కలుపుకుంటోంది.
ఇప్పటికే చాలా మంది మాజీలు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పేసుకుంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే.. సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలు నిజమవుతున్నట్టే కనిపిస్తున్నాయి. తాను గేట్లు తెరిస్తే.. బీఆర్‌ఎస్‌ మొత్తం ఖాళీ అవుతుందని.. కేవలం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురు మాత్రమే మిగులుతారని.. సంచలన స్టేట్‌ మెంట్‌ ఇచ్చారామధ్య. ఇక్కడ ఇంట్రస్టింగ్‌ పాయింటేంటే ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో.. బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరొచ్చినా తీసుకునేది లేదని?ఆ ఇంటి విూద పిట్ట ఈ ఇంటి విూద వాలితే కాల్చేస్తా అంటూ వార్నింగ్‌ ఇచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు ఏకంగా గేట్లే ఎత్తేసేశారు. మరోవైపు సునీల్‌ కనుగోలు టీం కూడా రంగంలో దిగిందని.. పలువురు కీలక బీఆర్‌ఎస్‌ నేతలతో టచ్‌లోకి వెళ్తూ.. వారితో మంతనాలు జరుపుతోందని టాక్‌ నడుస్తోంది. కొంచెం పాజిటివ్‌ టాక్‌ ఉన్నా.. సోషల్‌ విూడియాలో వాళ్లే లీక్‌ చేసేసి.. వచ్చే వరకు ప్రచారం గట్టిగా నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మెజారిటీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, రేవంత్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్‌ వర్గాల్ల్లో నడుస్తున్న టాక్‌. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్‌రావు తదితరులు కూడా వచ్చే వారంలో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీలోకి మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ఎల్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనతో మరో 24 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. అదే జరిగితే గులాబీ పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. 2024లో ఎలాగైనా మెజార్టీ ఎంపీ సీట్లను దక్కించుకోవాలన్న కసి విూదున్న కాంగ్రెస్‌, ఆపరేషన్‌ ఆకర్ష్‌ను చాలా వ్యూహాత్మకంగా అమలు చేస్తోంది. మెయిన్‌గా కాంగ్రెస్‌ను వదిలివెళ్లిన లీడర్స్‌ను వెనక్కి రప్పించే పనిలో పడిరది. ఆపరేషన్‌ స్వగృహ చేపడుతూ మాజీ నేతలపై గురిపెట్టింది. అందులో భాగంగానే కేశవరావు ఇంటికి స్వయంగా సీఎం రేవంత్‌ వెళ్లి చర్చించారు. పార్టీలో చేరేలా చేశారు.ఇది ఆరంభం మాత్రమే ముందుముందు ఇంకా ఎక్కువ మంది జాయిన్‌ అవుతారంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే తాను బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశానంటున్నారు కేకే. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న రేవంత్‌ మరో 10 రోజుల్లోగా బీఆర్‌ఎస్‌ నుంచి మరికొంత మంది నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నారు. అంతేకాదు మెదక్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేలతో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ చాలా సెలక్టివ్‌గా నేతలను తీసుకుంటోంది. మాదిగ వర్గానికి ఫేస్‌ గా వరంగల్లో ఉన్న కడియం ఫ్యామిలీని రంగంలోకి దింపబోతోంది. కడియంతో పాటు కడియం కూతురు కావ్య ఇప్పుడు అక్కడ కీలకంగా ఉన్నారు. కావ్య చేరడంతో వరంగల్‌ ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా ఇంకా డిసైడ్‌ కాలేదు. అయితే వరంగల్‌ పార్లమెంట్‌ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున కడియం శ్రీహరి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఆ సీటును కావ్యకే కాంగ్రెస్‌ పార్టీ కేటాయించునున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోచేరిన వెంటనే.. అభ్యర్థుల జాబితా ద్వారా కావ్య పేరును అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
Swara
  • Website

Related Posts

మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం

March 30, 2024

ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…

March 30, 2024

కావ్య బాటలో మరో అభ్యర్ధి…

March 30, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ఇంకా జనసేన మూడు స్థానాలు పెండిరగ్‌

March 30, 202412

వంగవీటి రాధా..దారెటు

March 30, 202411

హరీష్‌ రావుపై సాఫ్ట్‌ కార్నర్‌ ఎందుకు…

March 28, 202411

‘ఫ్యామిలీ స్టార్’ నుండి లిరికల్ పాట విడుదల

March 25, 202411
Don't Miss
అంతర్జాతీయం

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

By SwaraMarch 30, 20246

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను…

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024

‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

March 30, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
© 2026 All Copyrights Reserved By SWARA NEWS.
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • Crime
  • Sports
  • Movies

Type above and press Enter to search. Press Esc to cancel.