మంచిర్యాల,మార్చి 26
బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వెల్గటూర్ మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీప్ దాస్ మున్షి,.ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు,ధర్మపురి ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.జగిత్యాల జిల్లాలో ప్రజాబలం కలిగి ఉన్న శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీలో చేయడంతో టిఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.ధర్మపురి నియోజకవర్గ ప్రజలతో చర్చించి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు అప్పటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడుగా ముద్ర ఉంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో? శ్రీనివాసరావుకు రాష్ట్రనామినేటెడ్ పదవి ఇస్తారని కూడా వార్తలు వినిపించాయి. పెద్ద పెళ్లి పార్లమెంటు నుండి ఎంపీగా పోటీ చేసే కొప్పుల ఈశ్వర్ కు శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీలో చేయడంతో షాక్ తగిలినట్టు అయింది.ధర్మపురి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో శ్రీనివాసరావు వర్గీయులు కూడా ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేయడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి కలసచ్చినట్లు అయింది.శ్రీనివాసరావు చేరికతో ధర్మపురి నియోజకవర్గంలో గడ్డం వంశీకి ఓటు బ్యాంకు పెరగనుంది.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…