Close Menu
Swara NewsSwara News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

March 30, 2024

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024
Facebook X (Twitter) Instagram
Trending
  • భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
  • సెమీస్‌లో సిక్కి జోడీ
  • నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
  • ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
  • వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
  • మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
  • ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…
  • కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Facebook X (Twitter) Instagram
Swara NewsSwara News
Demo
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్
Swara NewsSwara News
Home » వంగవీటి రాధా..దారెటు
ఆంధ్రప్రదేశ్

వంగవీటి రాధా..దారెటు

SwaraBy SwaraMarch 30, 2024Updated:March 30, 2024No Comments11 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

విజయవాడ, మార్చి 30
పుట్టింది వంగవీటి కుటుంబంలో.. కానీ తండ్రి పరువును తీసేస్తున్నాడంటూ వంగవీటి రంగా హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ ఆయన కుమారుడు రాధాపై ఫైర్‌ అవుతున్నారు. ఇంటి పేరు వింటేనే చెవుల్లో రీసౌండ్‌ వస్తుంది. అందులోనూ బెజవాడలో ఇప్పటికీ వంగవీటి రంగా అంటే ఎవరూ మర్చిపోరు.. మర్చిపోలేరు కూడా. కేవలం కాపు సామాజికవర్గానికే కాదు పేదలకు కూడా రంగా చేసిన సేవలను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. జనరేషన్‌లు మారినా రేంజ్‌ తగ్గని ఒకే ఒక నేత వంగవీటి రంగా. ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుని అనేక మంది నేతలు రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కానీ ఆయన తనయుడు వంగవీటి రంగా మాత్రం తండ్రి పరువును తీస్తున్నారంటూ రంగా అభిమానులు మండిపడుతున్నారు. ఏపీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. అనేక పార్టీలు దాదాపుగా టిక్కెట్లను ప్రకటించాయి. టీడీపీ, జనసేన, వైసీపీలు ఇటు ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. జనంలోకి కూడా వెళుతున్నాయి. కానీ ఎక్కడా వంగవీటి రాధా ఊసే లేదు. బెజవాడలో ఆయన పేరును పార్టీలు పూర్తిగా చెరిపేసినట్లే అయింది. ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణం రాధా చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణమని చెప్పక తప్పదు. ఇంటి పేరు చూసి పార్టీలు ఇంటికి వచ్చి టిక్కెట్లు ఇవ్వాల్సిన కుటుంబంలో పుట్టిన వంగవీటి రాధా పార్టీ నేతల వద్దకు పరుగులు తీయడం పరువు తీసే విధంగా ఉందంటున్నారు సిట్టింగ్‌ స్థానమూ పాయె ఇంటికి టిక్కెట్‌ నడచి రావాల్సిన… పార్టీలు మారడంలో తప్పు లేదు. కానీ చట్టసభల్లో కాలు మోపడానికి అవసరమైన సత్తాను సొంతం చేసుకోవాలి. వంగవీటి రాధా అంటే అన్ని పార్టీలూ లేచి నిల్చుని సెల్యూట్‌ చేసేలా ఉండాలి. కానీ దానికి రివర్స్‌ లో రాధా రాజకీయం నడుస్తుంది. చివరకు జనసేనలో నాదెండ్ల మనోహర్‌ ను కలసి చర్చించాల్సిన పరిస్థితులు వచ్చాయంటే దీనికి కారణాలేంటన్నది రాధా ఆలోచించుకుంటే మంచిదన్న కామెంట్స్‌ ఆయన అనుచరుల నుంచే వినిపిస్తున్నాయి. ఎవరో ఇచ్చే ఎమ్మెల్సీ టిక్కెట్‌ కోసం పార్టీ కార్యాలయాల చుట్టూ తిరగడం అవసరమా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. తనకు, తన కుటుంబానికి ఉన్న ఇమేజ్‌ ను కాపాడుకోవడంలో రాధా రాజకీయంగా ఫెయిలయ్యాడంటున్నారు. జనంలో తిరగకపోవడం, సొంత అనుచరులను కాపాడుకోక పోవడం వంటి తప్పిదాలు వంగవీటి రాధాను రాజకీయంగా బలహీన పర్చాయని చెబుతున్నారు. టీడీపీలో ఉన్నారన్న మాటే కానీ ఆ పార్టీలోనూ యాక్టివ్‌ గా లేరు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటే టీడీపీలో చేరిన రాధా అందుకు తలాడిరచి వచ్చేశారు. పార్టీ అధికారంలోకి రాలేకపోవడంతో ఆ పదవికి దూరమయ్యారు. పోనీ జనసేనలో చేరారా? అనుకుంటే అందులోకి వెళ్లలేకపోయారు. కారణాలేవైనా రాధా రాజకీయ జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది. పార్టీలు ఇష్టపడి ఏదైనా పదవి ఇస్తే ఇచ్చినట్లు.. లేకపోతే మాత్రం ఇక అంతే. ఇది వంగవీటి అభిమానులకు మాత్రం రుచించడం లేదు. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ఆయన కేవలం ప్రచారానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
Swara
  • Website

Related Posts

క్రాస్‌ రోడ్స్‌ లో రఘురామరాజు

March 30, 2024

జేసీ ఫ్యామిలీకి టీడీపీ షాక్‌

March 30, 2024

జగన్మోహన్‌ వర్సెస్‌ సౌమ్య

March 30, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ఇంకా జనసేన మూడు స్థానాలు పెండిరగ్‌

March 30, 202412

వంగవీటి రాధా..దారెటు

March 30, 202411

హరీష్‌ రావుపై సాఫ్ట్‌ కార్నర్‌ ఎందుకు…

March 28, 202411

‘ఫ్యామిలీ స్టార్’ నుండి లిరికల్ పాట విడుదల

March 25, 202411
Don't Miss
అంతర్జాతీయం

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

By SwaraMarch 30, 20246

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను…

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024

‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

March 30, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
© 2026 All Copyrights Reserved By SWARA NEWS.
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • Crime
  • Sports
  • Movies

Type above and press Enter to search. Press Esc to cancel.