Close Menu
Swara NewsSwara News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

March 30, 2024

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024
Facebook X (Twitter) Instagram
Trending
  • భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
  • సెమీస్‌లో సిక్కి జోడీ
  • నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
  • ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
  • వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
  • మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
  • ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…
  • కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Facebook X (Twitter) Instagram
Swara NewsSwara News
Demo
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్
Swara NewsSwara News
Home » ఉచితానుచితాలపై చర్చ
వెబ్ స్టోరీస్

ఉచితానుచితాలపై చర్చ

SwaraBy SwaraMarch 30, 2024No Comments6 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

దేశంలో ఉచితాల అంశం మరోసారి తెరవిూదకు వచ్చింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కొంతకాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలపై ఇచ్చే హావిూలను నియంత్రించాలంటూ కొంతమంది న్యాయస్థానాల గడప కూడా తొక్కారు. ఆర్థికశాస్త్రంలో సంపద సృష్టి, సంపద పంపిణీ మధ్య నిరంతర చర్చ జరుగుతూనే ఉంది. ఇరవయ్యవ శతాబ్దం తొలిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వలస పాలన వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమాలు పెల్లుబికి ముందుకు వచ్చాయి. ఈ ఉద్యమాలు అన్ని దేశాల్లోనూ సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చి ప్రజల మద్దతు సవిూకరించాయి. ఏ దేశ స్వాతంత్య్ర ఉద్యమం కూడా తాము పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిస్తాం అని కనీసం మాట వరసకు కూడా అనలేదు. ఇక్కడో విషయం ప్రస్తావించుకుని తీరాలి. 1971?72 ప్రాంతంలో పేదరిక నిర్మూలన గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఇందిరా గాంధీ ఓ రోజు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. అప్పుడు సంపద పెరగకుండా సంక్షేమాన్ని ఎలా సాధిస్తారని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు చెందిన ఓ ప్రముఖుడు ఇందిరా గాంధీని ప్రశ్నించారు. దీనికి ఇందిర జవాబు చెబుతూ ఉచితాలను బలపరిచారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కొన్ని దశాబ్దాల పాటు తమ జీవితాలు మారతాయని ప్రజలు ఆశించారని ఆమె చెప్పారు. అయితే అనేకానేక కారణాలతో ప్రజల బతుకుల్లో వెలుగులు రాలేదన్న వాస్తవాన్ని ఇందిర అంగీకరించారు. ఈ నేపథ్యంలో పేదల బతుకులు బాగు చేయడం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. ఉన్న సంపదలోనే పేదలకు కొంత వాటా ఇవ్వడం తప్పనిసరి అంటూ ఉచితాలను ఇందిరా గాంధీ అప్పట్లోనే బలపరిచారు.ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను తాయిలాల సంస్కృతిగా వ్యతిరేకులు పేర్కొంటున్నారు. తాయిలాల సంస్కృతి దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్న విమర్శలు వస్తున్నాయి. సంక్షేమం పేరుతో అడ్డూ అదుపు లేకుండా ఉచిత పథకాలు అమలు చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఉచితాలతో రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారుతున్నాయంటున్నారు కొందరు ఆర్థిక వేత్తలు.ప్రజల నుంచి వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజల నుంచి సేకరించిన సొమ్ములను రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం పందారం చేయడం ఎంతవరకు సమంజసమని వీరు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మన దేశంలో ఉచిత పథకాలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు. కొన్ని దశాబ్దాల నుంచి ఉచిత పథకాలు అమలవుతున్నాయి. ఉచిత పథకాలు అనగానే వెంటనే గుర్తుకువచ్చేది తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు ఉచిత పథకాలకు పెట్టింది పేరు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ను ఉచితాలకు ఆద్యుడిగా చెప్పవచ్చు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాతే ఉచితాలు ఎక్కువయ్యాయి. అయితే ఆయన ఉచితాలు ప్రారంభించడం వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. 70ల్లో తమిళనాట పేదరికం బాగా ఉండేది. మూడు పూటలా తిండి సంపాదించుకోవడానికే పేదలు నానా ఇబ్బందులు పడేవారు. చిన్నారులను బడులు మానిపించి సంపాదన కోసం కార్ఖానాలకు పంపేవారు. ఈ స్థితిని చూసి ఆయన పేదలను ఆదుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనం అనే వినూత్న పథకాన్నిప్రారంభించారు.దాదాపుగా అన్ని పార్టీలు ఉచిత మంత్రం జపిస్తున్నాయి. అయితే దీనిపై,పన్నుల రూపాల్లో ప్రజలు కట్టిన సొమ్మును ఉచితాల పేరుతో పంచి పెడుతున్నారన్న వాదన వ్యతిరేక వర్గం నుంచి వినిపిస్తోంది. మరోవైపు ఉచితాలు కొనసాగించాల్సిందేనన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.ప్రభుత్వానికి సంపద సృష్టించడం ముఖ్యమే కావచ్చు. దీనికోసం రకరకాల మార్గాలున్నాయి.కానీ పేద వర్గాలకు బతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం కావాలి. అందుకే ఉన్న సంపదలో పేదవర్గాలకు కాస్తంత వాటా ఇవ్వాల్సిందేనంటున్నారు జనం పక్షాన నిలబడే ఆర్థిక వేత్తలు. పరిమితికి మించకుండా కొంతమేర ఉచితాలు ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఏది ఏమైనా కాలే కడుపునకు పట్టెడన్నం పెట్టడమే ప్రభుత్వాల విధి కావాలి. సంక్షేమం పేరుతో కొంతవరకు ఉచితాలను ప్రకటించినా, వాటిని స్వాగతించాల్సిందే. సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం కావాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసి ఎంచక్కా విదేశాల్లో విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్న కార్పొరేట్‌ దిగ్గజాల గురించి పల్లెత్తు మాట అనని ఆర్థికవేత్తలు పేదవారి కోసం అమలు చేస్తున్న ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరం. ఏమైనా సమాజంలోని మెజారిటీ ప్రజలు కోరుకునేది సంక్షేమ రాజ్యమే. సంక్షేమమే పాలకులకు తారకమంత్రం కావాలంటున్నారు ప్రజల పక్షాన నిలబడే ఆర్థిక వేత్తలు. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను తాయిలాల సంస్కృతిగా పేర్కొనడం కూడా సమంజసం కాదు. ఇది ఉచితాల వల్ల ప్రయోజనం పొందే పేదలను అవమానించడమే. పేదల బతుకుల్లో వెలుగుల్లో నింపడానికి అప్పట్లో ఇందిర చెప్పినట్లు ఉన్న సంపదలో కొంత వాటా ఇవ్వాల్సిందే. పేదల కోసం ఉచితాలను స్వాగతించాల్సిందే.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
Swara
  • Website

Related Posts

మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి. నేడు వారి జయంతి

March 30, 2024

ప్రతి ముగ్గురిలో ఒకరికి సీట్‌ కట్‌

March 28, 2024

సైబర్‌ నేరాల విలువ రూ.461 కోట్లపైనే

March 26, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

జగన్మోహన్‌ వర్సెస్‌ సౌమ్య

March 30, 202423

వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా

March 30, 202421

వంగవీటి రాధా..దారెటు

March 30, 202420

హరీష్‌ రావుపై సాఫ్ట్‌ కార్నర్‌ ఎందుకు…

March 28, 202418
Don't Miss
అంతర్జాతీయం

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

By SwaraMarch 30, 202411

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను…

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024

‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

March 30, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
© 2026 All Copyrights Reserved By SWARA NEWS.
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • Crime
  • Sports
  • Movies

Type above and press Enter to search. Press Esc to cancel.