విజయవాడ
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, గుణదల 1వ డివిజన్ నందు స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ పర్యటనలో గడప గడపకు తిరిగి ప్రచార కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి , ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గోన్నారు.
ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ 2014 ,19 లో సెంట్రల్ నియోజకవర్గంలో ఒక అరాచక వ్యక్తి పాలన సాగింది. రౌడీ, గుండా, బ్లాక్ మెయిలర్, షాపుల నుండి మామూలు వసూలు చేసే వ్యక్తి బోండా ఉమా. బోండా ఉమా ఒక వీధి రౌడీ లా ప్రవర్తించేవాడు. బోండా ఉమా ప్రజా సేవకు పనికి వచ్చే వ్యక్తి కాదు. వెల్లంపల్లి శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు. 2014, 19 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నగరానికి 100 కోట్లు ఇచ్చిన దాఖలాలు లేవు నేను కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఫ్లైఓవర్లు నిర్మాణానికి నిధులు మళ్ళించాము. 25 వేల మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుస్తారు. చంద్రబాబు సన్నిహితులతోనే 25వేల కిలోల గంజాయి తెప్పించారు. ఆంధ్రప్రదేశ్ పేరుని చెడగొట్టేందుకే చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి చంద్రబాబు గ్లోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాడు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. గ్లోబేల్స్ ప్రచారంలో చంద్రబాబు దిట్టా. సీఎం జగన్ విద్యా వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు సోషల్ విూడియాని ప్రజలు ఎవరు నమ్మద్దు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని పగటి కలలు కంటున్నాడని అన్నారు.
ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందించారు. డివిజన్ పర్యటనలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తుంది. సీఎం జగన్ ప్రభుత్వంలో ఒకటో డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఎంపీ కేశినేని నాని కేంద్రం నుండి అనేక నిధులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడ నగర అభివృద్ధిపై కేశినేని నానికి ప్రత్యేక దృష్టి ఉంది. గతంలో నగర అభివృద్ధికి చంద్రబాబు సహకరించిపోయిన కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేశారు. సీఎం జగన్ కేశినేని నాని జోడితో విజయవాడ నగర అభివృద్ధి శరవేగంగా వెళ్తుంది. కృష్ణలంక రిటైనింగ్ వాల్ 500 కోట్లు పెట్టి సీఎం జగన్ ప్రభుత్వం నిర్మించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకు సిగ్గు వచ్చేలా సీఎం జగన్ పాలన సాగింది. విజయవాడ నగరంలో మూడు సీట్లు గెలుస్తామని అన్నారు.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…