Close Menu
Swara NewsSwara News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

March 30, 2024

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024
Facebook X (Twitter) Instagram
Trending
  • భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
  • సెమీస్‌లో సిక్కి జోడీ
  • నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
  • ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
  • వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
  • మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
  • ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…
  • కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Facebook X (Twitter) Instagram
Swara NewsSwara News
Demo
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్
Swara NewsSwara News
Home » అక్రమార్కుల తాట తీస్తున్న కరీంనగర్‌ ఖాకీలు
క్రైమ్

అక్రమార్కుల తాట తీస్తున్న కరీంనగర్‌ ఖాకీలు

SwaraBy SwaraMarch 28, 2024No Comments5 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

కరీంనగర్‌, మార్చి 28
కరీంనగర్‌ జిల్లా నేతలకు కొత్త చిక్కులు వెంటాడుతున్నాయి. పోలీసుల నుండి తప్పించుకోవాలంటే అధికార పార్టీలో చేరితే సేఫ్‌ అవుతామని భావించినప్పటికీ లాభం మాత్రం ఉండడం లేదు. నేరం చేశారని డాక్యూమెంట్ల ద్వారా తేలితే చాలు క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి వెనకాడేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిందితులను అరెస్ట్‌ చేయగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.కరీంనగర్‌ సవిూపంలోని చింతకుంటలో పామ్‌ రాజ్‌ దేవరాజ్‌ కు 106 ఎకరాల 8 గంటల వ్యవసాయ భూమి ఉండేది. ఈ భూమిని విక్రయించుకోగా 20 గుంటల స్థలం మిగిలి ఉంది. అయితే ఈ భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు పేరు మారిపోయి న్యాలమడుగు చిన వీరయ్య పేరు చేరింది. అయితే చింతకుంట సర్పంచ్‌ గా వ్యవహరించిన పిట్టల రవిందర్‌ వీరయ్య అనే పేరుగల మరో వ్యక్తి కొడుకు రాజయ్య పేరిట తప్పుడు విరాసత్‌ చేయించారు. ఇందుకు అప్పుడు ఎమ్మార్వోగా ఉన్న మోహన్‌ రెడ్డి కూడా పిట్టల రవిందర్‌ కు సహకరించారు. రెవెన్యూ రికార్డుల్లోకి రాజయ్య పేరిట భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తికాగానే 2009లో ఆదిరెడ్డి పేరిట మార్చి 2010లో పిట్టల రవిందర్‌ తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. బాధితుడు దేవిదాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు పిట్టల రవిందర్‌ ను కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.తిమ్మాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మొగిలిపాలెం గ్రామంలోని ఓ భూమిని పలువురికి విక్రయించిన కేసులో కార్పోరేటర్‌ భర్త ఆకుల ప్రకాష్‌ ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. తొమ్ముడ్రు నర్సింహారావు వద్ద 1998 లో ప్లాటును కొనుగోలు చేశాడు. నర్సింహారావు 1998 లో సర్వే నంబర్‌ 159/ఈ లో 10 గుంటలు , 161/ఈ లో 09 గుంటలు . 162/ఈ లో 14 గుంటలు మొత్తం 33 గుంటలు కరీంనగర్‌ జిల్లా వల్లంపహాడ్‌ లో గల భూమిని ఖరీదు చేసి ప్లాట్‌ లుగా విభజించి పలువురికి విక్రయించగా సంపత్‌ కొనుగోలు చేశాడు. ఈ భూమికి పంబంధించిన తప్పుడు ‘విక్రయ దస్తావేజు రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, కరీంనగర్‌ గోదాం గడ్డకు చెందిన అబ్దుల్‌ హఫీజ్‌ కు 33 గుంటలు గుత్తాగా విక్రయించారు. అందులో సర్వే నెంబర్‌ 159/ఈ లో గల 10 గుంటల భూమిని కరీంనగర్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన 7వ డివిజన్‌ కార్పోరేటర్‌ భర్త ఆకుల ప్రకాష్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేశాడు. ఈ భూమిలో 3 గుంటలు , కరీంనగర్‌ కట్టరాంపూర్‌ కు చెందిన ఉప్పు సురేష్‌ కు, కరీంనగర్‌ వావిలాలపల్లికి చెందిన కట్ట రమ్యలు తక్కువ ధరకు కొనుగోలు చేసి అసలు విక్రయదారులను భూమిలో?కి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్‌ రూరల్‌ ఇన్స్పెక్టర్‌ ఏ ప్రదీప్‌ కుమార్‌ కేసు నమోదు చేసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి దుర్బుద్ధితో భూమిని కాజేయాలని ప్రయత్నించిన, అందుకు సహకరించిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కార్పోరేటర్‌ భర్త ఆకుల ప్రకాష్‌ ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. కాంగ్రెస్‌ లో చేరుతే.. కేసుల నుంచి బయట పడుతారని పలువురు నేతల భావిస్తున్నారట. కానీ.. కండువా మార్చుకున్న.. చట్టం పని.. చట్టం చేస్తుందని పోలీసులు చెబుతున్నారు. భూ మాఫియా పై పోలిసుల చర్యలు తీసుకోవడంతో నగర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
Swara
  • Website

Related Posts

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపెద్ద చేపల కోసం వల…

March 30, 2024

కేటీఆర్‌ పై కేసు

March 30, 2024

టెలిగ్రాఫ్‌ యాక్టుకు అటాచ్డ్‌…

March 30, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

జగన్మోహన్‌ వర్సెస్‌ సౌమ్య

March 30, 202427

వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా

March 30, 202421

వంగవీటి రాధా..దారెటు

March 30, 202420

51 మందితో అనర్హుల జాబితా

March 25, 202420
Don't Miss
అంతర్జాతీయం

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

By SwaraMarch 30, 202414

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను…

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024

‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

March 30, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
© 2026 All Copyrights Reserved By SWARA NEWS.
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • Crime
  • Sports
  • Movies

Type above and press Enter to search. Press Esc to cancel.