Close Menu
Swara NewsSwara News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

March 30, 2024

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024
Facebook X (Twitter) Instagram
Trending
  • భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
  • సెమీస్‌లో సిక్కి జోడీ
  • నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
  • ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
  • వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
  • మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
  • ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…
  • కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Facebook X (Twitter) Instagram
Swara NewsSwara News
Demo
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్
Swara NewsSwara News
Home » కమలంలో పాత నీరే పాయో
పాలిటిక్స్

కమలంలో పాత నీరే పాయో

SwaraBy SwaraMarch 28, 2024No Comments3 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

రాజమండ్రి, మార్చి 28
దగ్గుబాటి పురంద్రీశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టనంత వరకూ పార్టీలో ఒక సీన్‌ ఉండేది. కొందరిదే ఆధిపత్యం. వారి నిర్ణయాలే అంతిమం. అధినాయకత్వానికి వారు ఇచ్చే నివేదికలను బట్టి కేంద్ర నాయకత్వం నిర్ణయాలు జరిగేవి. అందుకే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 2019 ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకున్నా రాష్ట్రంలో ఆ పార్టీతో కలసి ఎక్కడా పనిచేసిన దాఖలాలు లేవు. చివరకు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక మినహా బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పవన్‌ అడుగుపెట్టలేదు కూడా. నాటి రాష్ట్ర నాయకత్వం వైసీపీకి అండగా ఉంటూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందన్నది బీజేపీలో కొందరి వాదన.అయితే పురంద్రీశ్వరి అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆ బ్యాచ్‌ మొత్తం మౌనముద్ర దాల్చింది. ఎక్కడా కనిపించడమూ లేదు. చిన్నమ్మ అంతా తానే అయి పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపట్టారు. అధికార వైసీపీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు. పొత్తుల అంశాన్ని పార్టీ చూసుకుంటుందని, తాము పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. పురంద్రీశ్వరికి పాత నాయకులు ఎవరూ సహకరించలేదన్నది కాదనలేని వాస్తవం. అయినా ఆమె దేనినీ లెక్క చేయకుండా తన పని తాను చేసుకుని వెళుతున్నారు. కేంద్ర నాయకత్వం సూచనలతో ఆమె అడుగులు వేశారు.తాజాగా అభ్యర్థుల ఎంపిక చూసినా పాత బ్యాచ్‌ కు పురంద్రేశ్వరి చెక్‌ పెట్టినట్లుగానే కనపడుతుంది. సోము వీర్రాజు కు పోటీ చేసేందుకు స్థానం లేదు. రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలని భావించిన సోము వీర్రాజును తానే అభ్యర్థిగా పురంద్రీశ్వరి బరిలోకి దిగడంతో అవాక్కయ్యారు. అనపర్తి స్థానం ఖాళీగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని నాయకత్వం చెప్పిందన్న వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడి నుంచి పోటీ చేయడానికి సోము వీర్రాజు సుముఖత చూపడం లేదు. దీంతో ఆయనకు ఎక్కడ టిక్కెట్‌ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజమండ్రి రూరల్‌, అర్బన్‌ స్థానాలకు ఇప్పటికే టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించింది.అదే సమయంలో జీవీఎల్‌ నరసింహారావు మూడేళ్ల నుంచి విశాఖలో ఎంపీగా పోటీ చేయడానికి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నారు. కానీ అది కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. జీవీఎల్‌ కు ఇప్పుడు పోటీ చేయడానికి ఎక్కడా స్థానమే లేదు. మొన్న ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో ఆయన ఊసే కనిపించ లేదు. ఇక పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌ రెడ్డి హిందూపురం లోక్‌సభ నుంచి పోటీ చేయాలనుకున్నారు. లేదంటే కదిరి అసెంబ్లీ స్థానంలో బరిలోకి దిగాలనుకున్నారు. కానీ ఆ రెండు టీడీపీ ఖాతాలోకే వెళ్లాయి. దీంతో విష్ణు కూడా ఈ ఎన్నికల్లో చేతులూపుకుంటూ తిరగాల్సిందే తప్ప పోటీ చేసే అవకాశమే లేదు. మొత్తం విూద చిన్నమ్మ పాత బ్యాచ్‌ కు చెక్‌ తన దైన రీతిలో పెట్టేశారన్న టాక్‌ మాత్రం పార్టీలో వినిపిస్తుంది.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
Swara
  • Website

Related Posts

హైదరాబాద్‌ లో ఏపీ ఆఫీసుల లెక్కేంటీ

March 30, 2024

గ్లోబేల్స్‌ ప్రచారంలో చంద్రబాబు దిట్టా

March 28, 2024

కాంగీరేస్‌ లో తీన్మార్‌ మల్లన్న

March 26, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ఇంకా జనసేన మూడు స్థానాలు పెండిరగ్‌

March 30, 202412

వంగవీటి రాధా..దారెటు

March 30, 202411

హరీష్‌ రావుపై సాఫ్ట్‌ కార్నర్‌ ఎందుకు…

March 28, 202411

‘ఫ్యామిలీ స్టార్’ నుండి లిరికల్ పాట విడుదల

March 25, 202411
Don't Miss
అంతర్జాతీయం

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

By SwaraMarch 30, 20246

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను…

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024

‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

March 30, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
© 2026 All Copyrights Reserved By SWARA NEWS.
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • Crime
  • Sports
  • Movies

Type above and press Enter to search. Press Esc to cancel.