Close Menu
Swara NewsSwara News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

March 30, 2024

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024
Facebook X (Twitter) Instagram
Trending
  • భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
  • సెమీస్‌లో సిక్కి జోడీ
  • నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
  • ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
  • వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
  • మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
  • ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…
  • కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Facebook X (Twitter) Instagram
Swara NewsSwara News
Demo
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్
Swara NewsSwara News
Home » నెల్లూరు లో మాటల మంటలు
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు లో మాటల మంటలు

SwaraBy SwaraMarch 25, 2024Updated:March 25, 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

నెల్లూరు, మార్చి 25
నెల్లూరులో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. నిన్న మొన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారు నేడు శత్రువులుగా మారిపోయారు.
డ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డిపై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రశాంతి రెడ్డి తన రెండో భర్తను వెనకేసుకు రావద్దని అన్నారు ప్రసన్న. అదే సమయంలో వేమిరెడ్డికి కాంతం, కనకం, జూదం అంటే ఇష్టమని.. పర్సనల్‌ అటాక్‌ కి దిగారు. ప్రసన్న ప్రాతినిథ్యం వహిస్తున్న కోవూరులో ఈసారి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ అభ్యర్థి కావడంతో.. వేమిరెడ్డి దంపతులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.నెల్లూరులో గత ఎన్నికలకు ఇప్పటికి పొలిటికల్‌ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ 10కి 10 స్థానాలు సాధించి నెల్లూరు జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈసారి అలాంటి పరిస్థితులు కనపడటం లేదు. పోరు హోరాహోరీగా ఉండే అవకాశముంది. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి టీడీపీలో చేరడంతో పరిస్థితిలో మార్పులు వచ్చాయి. ఆయనకు నెల్లూరు ఎంపీ స్థానం ఇచ్చిన టీడీపీ, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కోవూరు ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసే అవకాశమిచ్చింది. దీంతో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డికి గట్టి పోటీ ఎదురైనట్టయింది. వేమిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ప్రసన్న కుమార్‌ రెడ్డి, ఆయనకు సన్నిహితంగా మెలిగేవారు. తన నియోజకవర్గంలో వీపీఆర్‌ ఫౌండేషన్‌ సాయంతో ఎన్నో కార్యక్రమాలు చేయించుకున్నారు. ఆ తర్వాత వేమిరెడ్డి పార్టీ మారినా కూడా ప్రసన్న పెద్దగా పట్టించుకోలేదు. తీరా వేమిరెడ్డి సతీమణికి టీడీపీ కోవూరు సీటు ఇవ్వడంతో ప్రసన్నలో ఆందోళన పెరిగింది. వేమిరెడ్డి రాకతో కోవూరు ఫలితం తారుమారయ్యే అవకాశముందని ఆయన కాస్త టెన్షన్‌ పడుతున్నారు. అందుకే వేమిరెడ్డిపై మాటల దాడి మొదలు పెట్టారు.ప్రసన్న కుమార్‌ రెడ్డి ఇక్కడ వేమిరెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం సంచలనంగా మారింది. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతుల గురించి గతాన్ని ఎవరూ పెద్దగా బహిరంగ పరచిన దాఖలాలు లేవు. వేమిరెడ్డి కూడా ఎక్కడా పొలిటికల్‌ విమర్శలు కూడా చేయరు. అందుకే ఆయన కుటుంబ వ్యవహారాల జోలికి ఎవరూ వెళ్లరు. కానీ ప్రసన్న కుమార్‌ రెడ్డి తొలిసారిగా ఆయన్ను పర్సనల్‌ గా టార్గెట్‌ చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని టార్గెట్‌ చేస్తూ ప్రభాకర్‌ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి వరకూ కోవూరులో టీడీపీ తరపున పోలంరెడ్డి దినేషన్‌ రెడ్డి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. ఆయన్ను పక్కనపెట్టి, పార్టీలోకి కొత్తగా వచ్చిన ప్రశాంతి రెడ్డికి చంద్రబాబు అవకాశమిచ్చారు. దీంతో ఇక్కడ టీడీపీలో కూడా రెండు వర్గాలయ్యాయి. అయితే వేమిరెడ్డి రాజకీయ చతురతతో దినేషన్‌ రెడ్డి కూడా ఈవైపే వచ్చారు. దీంతో గ్రామస్థాయిలో వైసీపీ నాయకులు చాలామంది టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. ఓ దశలో ప్రసన్న కుమార్‌ రెడ్డి సహనం కోల్పోయి గ్రామ సర్పంచ్‌ లు, ఇతర నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నేరుగా వేమిరెడ్డినే టార్గెట్‌ చేశారు. నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి వేమిరెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటు కోవూరులో కూడా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డికి పోటీగా దూసుకెళ్తున్నారు. దీంతో కోవూరు రాజకీయం వేడెక్కింది. ఈసారి వైసీపీ గెలిస్తే.. ప్రసన్న కుమార్‌ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. జిల్లాలో సీనియర్‌ నాయకుడిగా తనకు మంత్రి పదవి వస్తుందనేది ఆయన అంచనా. అదే సమయంలో ప్రశాంతి రెడ్డి వల్ల ఆ ఛాన్స్‌ మిస్‌ అవుతుందేమోననే ఆందోళన కూడా ఆయనలో ఉంది. అందుకే ప్రసన్న మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. పర్సనల్‌ అటాక్‌ కి దిగారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
Swara
  • Website

Related Posts

వంగవీటి రాధా..దారెటు

March 30, 2024

క్రాస్‌ రోడ్స్‌ లో రఘురామరాజు

March 30, 2024

జేసీ ఫ్యామిలీకి టీడీపీ షాక్‌

March 30, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ఇంకా జనసేన మూడు స్థానాలు పెండిరగ్‌

March 30, 202412

వంగవీటి రాధా..దారెటు

March 30, 202411

జగన్మోహన్‌ వర్సెస్‌ సౌమ్య

March 30, 202410

ఏపీ రాజకీయాల్లో …వాళ్లు

March 30, 202410
Don't Miss
అంతర్జాతీయం

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

By SwaraMarch 30, 20246

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను…

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024

‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

March 30, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
© 2025 All Copyrights Reserved By SWARA NEWS.
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • Crime
  • Sports
  • Movies

Type above and press Enter to search. Press Esc to cancel.