Author: Swara

అనంతపురం, జనవరి 23 ఆంధ్రప్రదేశ్‌ లోని ఓ ఊళ్లో మగ పిల్లలకు అంటే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదంట.. ఆ ఊళ్ళో యువకులకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వాపోతున్నారు. గ్రామస్తులు ఏకంగా మంత్రికి ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆ ఊళ్ళో యువకులకు పెళ్లిళ్లు ఎందుకు అవ్వడం లేదు????.. ఆడపిల్లను ఇచ్చేవాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు..సత్యసాయి జిల్లా కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాలకు తారు రోడ్డు లేకపోవడంతో యువకులకు పెళ్లిళ్లు అవ్వడం లేదని ఓ మహిళ మంత్రి ఉషశ్రీ కి ఫిర్యాదు చేశారు. దయచేసి తమ గ్రామానికి తారు రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని.. ఆ మహిళతో పాటు గ్రామస్తులు వేడుకున్నారు. కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాల్లో మంత్రి ఉషశ్రీ పర్యటిస్తున్న సందర్భంలో మహిళలు మంత్రి గారికి తమ గోడు చెప్పుకున్నారు. ఆ రెండు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని మంత్రి ఉషశ్రీకి చెప్పారు. తమ…

Read More

నెల్లూరు, జనవరి 23 ఏపీలో సీఎం జగన్‌ ఎలక్షన్‌ 2024 కి సిద్దమవుతున్నారు. వైనాట్‌ 175 అంటూ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా సగానికపైగా అభ్యర్థులను మారుస్తూ జాబితా సిద్దం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రాచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టికెట్‌ విషయంలో భంగపడ్డ అభ్యర్థులు ఇలా తమ అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. అన్నయ్యకు టికెట్‌ ఇవ్వొద్దని ఓ తమ్ముడు.. కుట్ర చేశారంటూ ఓ ఎమ్మెల్యే ఆవేదన. నాన్‌ లోకల్‌కు వద్దంటూ మరో నేత మండిపాటు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సీటు ? హీటు పెరిగిపోతోంది. వైసీపీలో టికెట్లు రానివాళ్ల ఆవేదన ఆగ్రహంగా మారి నిరసనల స్వరం వినిపిస్తోంది.వైసీపీలో.. అసెంబ్లీ, ఎంపీ సీట్లలో ఇన్‌ఛార్జీల మార్పులు చేర్పుల కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు లిస్టులు వచ్చాయి. 68 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో మార్పులు జరిగాయి. టికెట్లు రానివాళ్లు, ఈ మార్పులపై మండిపడుతున్నారు.…

Read More

విజయవాడ, జనవరి 23 ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు వైసీపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాస్త్రాలు ఎక్కుపెడుతోంది. ఈ తరుణంలో టీడీపీ కూడా పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో రా.. కదలిరా అంటూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పై విమర్శలు సంధిస్తున్నారు. ఇదంతా బాగున్నప్పటికీ టీడీపీ ? జనసేన మధ్య సీట్ల పంపకాలపై క్లారిటీ రానే లేదు.. ఏ పార్టీకి ఏ సీటు వస్తుందనేదానిపై ఇంకా నిర్ణయం జరగలేదు. కానీ సీటు మాదే.. గెలుపు మాదే.. అంటున్నారు తిరుపతి జనసేన కార్యకర్తలు. ఇంతకీ వాళ్లకున్న నమ్మకమేంటి? సీటు తమకే వస్తుందన్న గ్యారంటీ ఏంటి? తిరుపతి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. మిత్రపక్షమైన టీడీపీకి సైతం అందని రీతిలో జనసేన వ్యూహాలు రచిస్తోంది. ఈ టికెట్‌ కోసం టీడీపీలో అరడజను మంది నేతలు పోటీ పడుతుంటే.. జనసేన కార్యకర్తలు మాత్రం తమకే సీటు వస్తుందనే ధీమాలో ఉన్నారు.గతంలో చిరంజీవి గెలిచిన చరిత్ర.. నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఎక్కువగా…

Read More