Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Author: Swara
హైదరాబాద్,జనవరి23 ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం మరో ముందడుగు వేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో ఐదురుగు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను కమిటీలో సభ్యులుగా నియమించింది.గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్సీ స్టేడియంలో నిర్వహించిన మాదిగల విశ్వరూ సభకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విన్నపాన్ని తెలుసుకున్న మోదీ.. తర్వాత తన ప్రసంగంలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, ఎస్సీల్లోని వెనుకబడిన వర్గాల ఆవేదనను అర్థం చేసుకున్నామని ప్రకటించారు. ఈ సమయంలో మంద కృష్ణ మాదిగ కంటతడి పెట్టారు. మోదీని ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రకటనతో తెలంగాణలో మాదిగల ఓట్లు బీజేపీకి పోలరైజ్ అవుతాయని విశ్లేషకులు…
హైదరాబాద్,జనవరి23 రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు సూచనలు, ప్రతిపాదనలను ఈ బృందం ఉప ముఖ్యమంత్రికి అందచేసింది.రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే వెల్త్ క్రియేటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టమని, వారు ఎదుర్కుంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. థేమ్స్ నది మాదిరిగా మూసీ నాదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని, దీనితో పాటు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మూసీ నది శుద్దితో సుందరీకరణ జరిగి, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, మరిన్ని…
హైదరాబాద్,జనవరి23 బర్రెలక్క ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలు ఉండరేమో.. ఏపీలో కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఒకే ఒక్క వీడియోతో పాపులర్ అయ్యింది బర్రెలక్క. నిరుద్యోగ సమస్య కారణంగా బర్రెలు కాస్తున్నా అని వీడియో చేసి ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది. దాంతో ఆమెకు సోషల్ విూడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం దొరక్క బర్రెలు కాస్తుంది. ఇక తన వీడియో పాపులర్ అవ్వడంతో ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఎలక్షన్స్ లో కొల్లాపూర్ స్ధానం నుంచి పోటీ చేసింది.బర్రెలక్క కు చాలా మంది మద్దతుగా నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి. ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది. కొల్లాపూర్ స్ధానం నుంచి…
హైదరాబాద్,జనవరి23 వీలయినంత తొందరగానే ధరణి సమస్యలపై మధ్యంతర నివేదిక ఇస్తామని కోదండరెడ్డి నేతృత్వంలోని కమిటీ తెలిపింది. మూడోసారి సీసీఎల్‌ఏలో సమావేశమైన కమిటీ.. అనేక అంశాలపై చర్చించింది. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచే అనేక లోపాలు ఉన్నాయని, బాధితులకు ఉపశమనం కల్పించేందుకు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ధరణి వెబ్ సైట్ లోపభూయిష్టంగా ఉండటంతో…అనేక మంది రైతులు భూ హక్కులు కోల్పోయారని కమిటీ సభ్యులు కోదండరెడ్డి వెల్లడిరచారు. ఈ పోర్టల్‌లో పారదర్శకత లేదన్న ఆయన, భూమి యజమానికి తెలియకుండా లావాదేవీలు జరిగాయన్నారు. అనేక తప్పిదాల కారణంగా అన్నదాతలు… రైతుబంధు, ఇతర ప్రభుత్వ రాయితీలను పొందలేకపోయారని స్పష్టం చేశారు. ధరణి బాధితులకు త్వరితగతిన ఉపశమనం కల్పించేందుకు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించిందన్నారు. మరింత లోతైన అధ్యయనం చేయకుండా ముందుకు వెళ్లలేమని తెలిపారు. పోర్టల్ సమస్యలతో పాటు దానితో ముడిపడి ఉన్న అన్ని శాఖలతో చర్చించి సమగ్రమైన నివేదిక సిద్ధం చేయాల్సి ఉందని…
హైదరాబాద్,జనవరి23 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలను చాలెంజింగ్ గా తీసుకుంది. ఆషామాషీగా కాకుండా పూర్తి స్థాయిలో విజయం కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. అందుకే అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ అభ్యర్థుల్లో బలంగా ఉన్న ఒకరిద్దర్ని తప్ప అందర్నీ మార్చేయాలనుకుంటున్నారు. దాదాపుగా అందర్నీ కొత్త వారిని దించి ప్రయోగం చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం తటస్థులైన ప్రముఖుల్ని సంప్రదిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సారి కొన్ని చోట్ల ఊహించని అభ్యర్థులు ఉండే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్‌ఎస్ టిక్కెట్ కోసం ఒక్కో నియోజకవర్గానికి ఐదు నుంచి పది మంది పోటీ పడతారు. కానీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఆసక్తి చూపని వాళ్లను అసలు లెక్కలోకి తీసుకోవడంలేదు. అభ్యర్థులపై ఎలాంటి సూచనలు కూడా ఇవ్వడంలేదు. లోక్‌సభ ఎన్నికల్లో…
హైదరాబాద్,జనవరి23 మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో…సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం…దేశంలోనే భారీ స్కాం జరిగినట్లు గుర్తించింది. 3వేల కోట్లకుపైగా ప్రజాధానం వృథా అయినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో వెల్లడిరచింది. 3వేల 200కోట్ల ప్రజాధనాన్ని బ్యారేజ్ నిర్మాణం పేరుతో వృథా చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో తేలింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అక్రమాలపై మధ్యంతర నివేదికను సిద్ధం చేసింది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్. వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించేందుకు రెడీ అవుతోంది. ప్రజాధనం పేరుతో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించి…ఆటలు ఆడుకున్నారని విజిలెన్స్ నివేదికలో పొందుపర్చింది. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు దోషులేనని…ఎన్ని పిల్లర్లు ఎంత బలంగా ఉన్నాయన్నది తేల్చాల్సి ఉందని అభిప్రాయపడిరది.మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బ్యారేజ్‌లో ప్రస్తుతం ఉన్నపియర్స్‌లో…11 పియర్స్ బాగా దెబ్బతిన్నట్లు విజిలెన్స్ తేల్చింది. దెబ్బతిన్న పియర్స్ మరమ్మతులు చేసినంత మాత్రాన…బ్యారేజీకి…
హైదరాబాద్,జనవరి23 (న్యూస్ పల్స్) తెలంగాణ రాజకీయాల్లో పూలే విగ్రహ అంశంపై కొత్త వివాదం ప్రారంభమయింది. మొదట కవిత అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారు. తర్వాత సోషల్ విూడియాలో డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంత్రి పొన్నం కవితపై విమర్శలు చేయడంతో రాజకీయం ప్రారంభమయింది. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ను కలిసి ఎమ్మెల్సీ కవిత వినతిపత్రం అందజేశారు. జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేసి అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుకున్నామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో పూలే విగ్రహం కోసం ఉద్యమిస్తామని చెప్పారు. ఏప్రిల్ 11న పూలే జయంతి లోపు స్పీకర్, ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఇతర…
ఖమ్మం ఖమ్మం జిల్లా వైరాలోని రాష్ట్ర సాంఫీుక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో రాత్రి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థినీ కొంగల ప్రసన్న పాము కాటుకు గురైంది. డైనింగ్ హాల్లో భోజనం చేసి వసతి భవనం వద్దకు వెళ్తున్న సమయంలో ప్రసన్నను పాము కాటు వేసింది. వెంటనే అక్కడ ఉన్న ఉపాధ్యాయినీలకు పాటు కాటు వేసిన విషయాన్ని తెలిపింది. హుటాహుటిన వైరాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఆనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లాడ 108 వాహనంలో ఖమ్మం తరలించారు. ప్రస్తుతం ప్రసన్న ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
ఖమ్మం రోడ్డు భద్రతా మాసోత్సవల్లో భాగంగా ఖమ్మం నగరంలో ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా ఆటోలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి అన్నారు. ఆటో డ్రైవర్లు, సంఘాలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండు, వైరా రోడ్డు ప్రాంతాల్లో నిత్యం ప్రయాణికులు, ఆటోలతో రద్దీగా ఉంటుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, మితివిూరిన వేగంతో నడపవద్దన్నారు. కార్యక్రమంలో సీఐ అశోక్, ఆర్‌ఎస్‌ఐ సాగర్, ఎస్‌ఐ రవి పాల్గొన్నారు.
ములుగు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేటలో దారుణం జరిగింది. దివ్యాంగురాలు అయిన చెల్లిపై అన్న గొడ్డలితో దాడి చేసాడు. ఆస్తి విషయంలో గొడవ పడి తోబుట్టిన చెల్లి పొన్నం సారక్కను హతమార్చే యత్నం అన్న పొన్నం సమ్మయ్య చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సారక్కని పోలీస్ వెహికల్ లో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం తరలించారు. ఆస్తి తగాదా విషయంలో కొద్ది రోజులుగా అన్న, చెల్లెలు మధ్య గొడవలు జరగుతున్నట్లు సమాచారం. నిందితుడు సమ్మయ్య పోలీసులు అదుపులో వున్నాడు.
