Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Author: Swara
అమ్రోహా మొబైల్ ఫోన్‌తో ఆడుకుంటూ ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ కొత్వాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ కొత్వాలిలో హతైఖేడాలో నివాసం ఉంటోన్న ఐదేళ్ల బాలిక కామిని ఆదివారం తల్లి పక్కన బెడ్‌పై పడుకుని మొబైల్ ఫోన్‌లో కార్టూన్లు చూస్తూ ఉంది. ఉన్నట్లుండి ఫోన్ చిన్నారి చేతుల్లోనుంచి జారి పోయింది. చిన్నారి తల్లి వెంటనే చూడగా అప్పటికే బాలిక అపస్మారిక స్థితిలోకి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని హుటాహుటీన సవిూపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.చిన్నారి గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని హసన్‌పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జి డాక్టర్ ధ్రువేంద్ర కుమార్ తెలిపారు. చిన్నారి మృతికి గల కారణాలు తెలుసుకొనేందుకు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అప్పగించాలని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేసామని, కానీ వారు అంగీకరించలేదని…
అయోధ్య అయోధ్య రామ మందిరం ఆలయ నిర్మాణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం వెయ్యేళ్ల పాటు నిలిచి ఉండేలా నిర్మాణం చేపట్టారు. ఇసుక నేల అయినా భూకంపాలను తట్టుకొని నిలబడే విధంగా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణంగా నేటి కాలంలో ఆలయంలో సిమెంట్, ఉక్కు వాడడం సహజం. కానీ అయోధ్య ఆలయ నిర్మాణంలో మాత్రం ఎక్కడా ఇనుమును వాడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ మందిరం నిర్మాణానికి మొత్తం నాపరాయి, పటిష్టమైన రాతినే ఉపయోగించారు. ఈ రాళ్లను వరుస క్రమంలో పేర్చి నిర్మించారు.ఇంతటి గొప్ప కట్టడాన్ని సందర్శించేందుకు ఇక్కడి ప్రభుత్వం మంగళవారం నుంచి సాధారణ భక్తులను అనుమతి ఇవ్వనుంది. కానీ ఇంతలోనే ఆలయం లోపలి దృశ్యాలు బయటకు వచ్చేశాయి. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. పూలతో అలంకరించారు. అక్కడక్కడా ఓంకారం, స్వస్తిక్ గుర్తులను పూలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఈ ఆలయంలోపలి…
అటు జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా ఏపీలో మరోసారి జగన్ గెలుస్తాడని చెబుతున్నాయి. టైమ్స్ నౌ నుంచి మొదలుపెడితే జాతీయ పలు సర్వే సంస్థలు జగన్ కు మెజార్టీ ఎంపీ సీట్లు వస్తాయని.. వచ్చేసారి జగన్ దే గెలుపు అంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జగన్ కు అంత అనుకూల వాతావరణం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే..ఇక కొన్ని లోకల్ సంస్థలు మాత్రం వచ్చేసారి ఏపీలో టీడీపీ గెలుస్తాయని చెబుతున్నాయి.. కొన్ని జాతీయ సంస్థలు సైతం టీడీపీ, జనసేన కలిస్తే ఆ రెండు పార్టీలదే ఏపీ అంటున్నాయి. ఇటీవల జన్మత్ పోల్స్ అనే సర్వే ఏజెన్సీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రజల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నం చేసింది. వచ్చే ఎన్నికల్లో 116 నుంచి 118 స్థానాల్లో వైసిపి గెలవనుందని ప్రకటించింది. తెలుగుదేశం కూటమి 46 నుంచి 48 స్థానాలకే పడిపోనుందని స్పష్టం చేసింది.ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలపై ఈ సంస్థ…
దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని గత వారం నీతిఆయోగ్ తాజా నివేదికలో ప్రకటించింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత తొమ్మిది సంవత్సరాల్లో ఏకంగా 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. 2022`23తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో పేదరికాన్ని తగ్గించామని నివేదికలో వివరించింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం కుట్ర అంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడిరది. కేంద్రంలోని మోడీ సర్కార్ సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికి, ఉచిత రేషన్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఇలాంటి గిమ్మిక్కులు చేస్తోందని విమర్శలు గుప్పించింది. 2022`23 నాటికి గత తొమ్మిది సంవత్సరాల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లో పేదరికం విశేషంగా తగ్గిందని నితీఆయోగ్ తాజాగా విడుదల చేసిననివేదికలో వివరించింది.దేశవ్యాప్తంగా పేదరికం 2013`14 నాటికి 29.17% ఉంటే 2022`23 నాటికి 11.28 శాతానికి దిగి వచ్చింది. 17.89 శాతానికి పేదరికం తగ్గింది. దీనిపై కాంగ్రెస్ అధికార…
విజయవాడ, జనవరి 23 రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలను ప్రకటించారు. దాదాపు 60 మంది వరకు సిట్టింగ్ లను మార్చారు. కొందరికి స్థానచలనం కల్పించారు. మరి కొందరిని ఏకంగా పక్కన పడేశారు. అయితే కొంతమంది విషయంలో మరి ఏకపక్షంగా వ్యవహరించారు. వారి గ్రాఫ్ బాగున్నా రకరకాల కారణాలు చూపి ఉద్వాసన పలకడం విశేషం. టికెట్ దక్కని చాలా మంది నేతలు ఒకే తరహా ఆరోపణలు చేస్తున్నారు.మొన్న ఆ మధ్యన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో జగన్ చేసిన కామెంట్స్ అంటూ ఒక రకమైన ప్రచారం జరుగుతోంది. టికెట్ కావాలంటే రూ.180 కోట్లు డిమాండ్ చేశారని టాక్ నడిచింది. పైగా ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు, పవన్, లోకేష్ లను ఆశించిన స్థాయిలో తిట్టలేదని.. దూకుడు కనబరచలేదని జగన్ ముఖం విూద చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఒక్క మాగుంట విషయంలోనే…
విజయవాడ, జనవరి 23 ఈసారి ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. అధికార వైసిపి దూకుడు విూద ఉంది. తెలంగాణలో కెసిఆర్ కు ఎదురైన పరాభవాన్ని.. గుణపాఠం గా తీసుకుని జగన్ వ్యూహాలు రూపొందిస్తున్నారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలను ప్రకటించి 60 మందిని మార్పు చేశారు. మరో 20 మంది వరకు మార్చుతారని ప్రచారం జరుగుతోంది. కేవలం తెలంగాణలో సిట్టింగులపై వ్యతిరేకతతోనే కెసిఆర్ ఓడిపోయారని గ్రహించి జగన్ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు సైతం తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఫార్ములాను అనుసరిస్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే రేవంత్ రెడ్డి కేసిఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. కేవలం కెసిఆర్ సర్కార్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని సైతం ప్రస్తావించారు. వీటికి సంబంధించి వీడియోలను విడుదల చేశారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేయాలని భావిస్తున్నారు.…
గుంటూరు, జనవరి 23 గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రతిపక్ష పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. అధికార పార్టీ మైనార్టీ అభ్యర్థి నూరి ఫాతిమా ప్రచారంలో ముందున్నారు. కాగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ టికెట్ ఎవరికి? అన్నది మాత్రం ఇంతవరకు తేలలేదు.గుంటూరు జిల్లాలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గాలలో గుంటూరు తూర్పు ఒకటి. ఎప్పటి నుంచో ఇక్కడ ముస్లిం మైనార్టీలు పోటీ పడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి ముస్తఫా గెలిచారు. ఈసారి ఆయన తప్పుకుని తన కూతురు నూరి ఫాతిమాకు టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో పార్టీలోని అసమ్మతి వర్గం కూడా వెనుకడుగు వేసింది. దీంతో ఫాతిమా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. అందరినీ కలుపుకుని ప్రచారానికి నడుంకట్టారు. ఇది ఇలా ఉంటే.. ఫాతిమాపై ఎవరిని పోటీకి దింపాలి అనేదానిపై ప్రతిపక్ష టీడీపీలో ఇంకా స్పష్టత రాలేదు.1994, 1999 ఎన్నికల్లో ఇక్కడి నుంచి…
నెల్లూరు, జనవరి 23 చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో వైసీపీ సీటు పంచాయితీ రచ్చకెక్కింది. ఉమ్మడి జిల్లాలో ఆరు సెగ్మెంట్లతోపాటు తిరుపతి ఎంపీ స్థానంలో అభ్యర్థులను మార్చేసింది అధిష్టానం. మిగిలిన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిస్థితి అయోమయంగా మారింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామికి టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఆయనకే టికెట్ ఇవ్వాలని కొందరు.. వద్దని మరికొందరు ఏకంగా బల ప్రదర్శనకు దిగడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రాజకీయం రసకందాయంలో పడిరది. డిప్యూటీ సీఎంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణస్వామి.. ఈసారి తన కూతురు కృపాలక్ష్మికి టికెట్ ఇప్పించాలని చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. దీంతో మరోసారి పోటీచేసి.. హ్యాట్రిక్ కొట్టాలని నారాయణస్వామి భావిస్తున్నారు. అయితే.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని మరో వర్గం ఆందోళనకు దిగడంతో అయోమయ పరిస్థితి నెలకొంది.గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొంతకాలంగా డిప్యూటీ…
ఏలూరు, జనవరి 23 అది టీడీపీకి కంచుకోట నియోజకవర్గం. అలాంటి చోట ఇప్పుడు సీటు నీకా నాకా అంటూ వర్గపోరు సాగుతోంది. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే టికెట్ నాదే అంటే నాదే అంటూ పోటీపడుతున్నారు. సీటు తమకే వస్తుందన్న ధీమాతో ఎవరికి వారు ప్రచారం సైతం ప్రారంభించారు. దీంతో ఎవరి వైపు ఉండాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇద్దరు నేతల మధ్య ఈ కోల్డ్ వార్‌ను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది ? అక్కడ పోటీపడుతున్నా నాయకులెవరు ? తెలుసుకుందాం రండి.ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం. 2019 వైసీపీ హవాలోనూ ఈ జిల్లాలో గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఇది ఒకటి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మంతెన రామరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు పార్టీ…
విజయవాడ, జనవరి 23 వైసీపీ నేతలకు లిస్టుల టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే నాలుగు జాబితాలు వచ్చేశాయి. నాలుగోదే ఫైనల్ లిస్టా? లేదంటే ఇంకెన్ని వస్తాయి? ఒకవేళ వస్తే తమ పేరు ఉంటుందా? ఊడుతుందా? ఇలా వైసీపీ ప్రజా ప్రతినిధులకు జాబితా గుబులు పట్టుకుంది. ఏ లిస్ట్ ఏ సీట్లకు ఎసరు పెడుతుందో తెలియడం లేదు.ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎక్కడైతే ప్రక్షాళన అవసరమో అక్కడ నిర్మొహటంగా చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే నాలుగు లిస్టులు ప్రకటించిన పార్టీ హైకమాండ్. ఇదే ఫైనల్ లిస్ట్ అని అంతా భావించారు. కానీ, 5వ జాబితాపై ఫోకస్ పెట్టారు వైసీపీ పెద్దలు.వైసీపీ హైకమాండ్ లిస్టుల విూద లిస్టులు రిలీజ్ చేస్తుంటే.. కొందరు ఎమ్మెల్యేలు ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటివరకు 68 చోట్ల మార్పులు చేర్పులు చేపట్టారు. 58 స్థానాల్లో అసెంబ్లీ ఇంఛార్జ్ లను, 10…
