Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Author: Swara
కరీంనగర్, మార్చి 30 కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం కసరత్తు పూర్తి చేయకముందే.. మరొక వ్యక్తి పేరు తెరవిూదకు వచ్చింది. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్ రావు లు టికెట్టు కోసం పోటి పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్టు వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో మరొక వ్యక్తి తీన్మార్ మల్లన్న కూడా రీంనగర్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తున్నారు. ఇదివరకు దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికి కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ఎంపికలో నెలకొన్న పీటముడి మాత్రం వీడటం లేదు. దీంతో టికెట్లు ఆశిస్తూ పోటీ పడుతున్న ఆశావాహుల్లో రోజు రోజుకు టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు నేతలు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.బీజేపీ పార్టీ నుండి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్…
వరంగల్, మార్చి 30 వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్య తిరస్కరించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో పలువురు సీనియర్ నేతలు ఆ స్థానం ను?ంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో కీలక నేత ఇటీవల ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయిన ప్రముఖ సినీ నటుడు బాబూ మోహన్‌ను వరంగల్ బరిలో ఉంచాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. అందరి కంటే ఎక్కువగా తాటికొండ రాజయ్య పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బీఆర్‌ఎస్ కు రాజీనామా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేర్చుకోలేదు. టిక్కెట్ కోసం పరిశీలన చేయలేదు. దీంతో అటూ ఇటూ కాకుండా అయిపోయారరు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు టిక్కెట్ నిరాకరించి కడియం శ్రీహరికి కేసీఆర్…
హైదరాబాద్, మార్చి 30 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. నేడు ఆదిలాబాద్ లో 43.3 డిగ్రీలు నమోదు అవ్వగా?నల్లగొండ జిల్లా నాంపల్లిలో 43, గద్వాల్ 42.8, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దనోరాలో 42.7, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు రాష్ట్ర అభివ్రుద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. కాగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో వడగాల్పలు వీస్తాయని..హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒకటవ తేదీన ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట తోపాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడిరచింది. 2వ తేదీన ఆదిలాబాద్ కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సూర్యపేట జిల్లాల్లో అక్కడక్కడ…
పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీ గోపాల్ జోషి లేదా ఆనందీబాయి జోషి. (కాదంబిని గంగూలీ కూడా అదే సంవత్సరం అనగా 1886 లో ఆనందీబాయి తర్వాత పట్టాపొందారు.) ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే. అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది. ఈమె జన్మదినాన్ని పురస్కరించుకొని 2018 లో గూగుల్ తన డూడుల్ ని పెట్టింది . ఆనందీబాయి పూణే (మహారాష్ట్ర) లోని సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో మార్చ్ 31, 1865 లోజన్మించారు. ఈమెకు తల్లితండ్రులు యమున అని పేరు పెట్టారు. 9 సంవత్సరాల వయసులో దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దయిన గోపాల్ రావు జోషిని వివాహం చేసుకుంది. వివాహం తరువాత, ఆమె భర్త ఆమెకు ఆనందీబాయి అని పేరు పెట్టాడు. ’’ సెరంపోర్ కాలేజ్’’ హాలులో ఆనందీబాయి ఉపన్యసించిన సమయంలో తాను వైద్యవిద్యను అభ్యసించడానికి…
న్యూఢల్లీి, మార్చి 30 మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కాంగ్రెస్ కూటమి.. మొత్తానికి ఈ దఫా పార్లమెంట్ ఎన్నికలు రచ్చరచ్చలాగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల నిమిషంలో ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూటముల నుంచి దాదాపు 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీ చేయబోతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీఏ కూటమి నుంచి పోటీలో ఉన్నారు. మరో ముగ్గురు ఇండియా కూటమి నుంచి బరిలో నిలిచారు. ఈ ముఖ్యమంత్రుల జాబితాలో శివరాజ్ సింగ్ చౌహన్, సర్బానంద సోనోవాల్, జగదాంబికా పాల్ వంటి వారు ఉన్నారు.పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోయే మాజీ ముఖ్యమంత్రుల జాబితాలో.. అత్యంత సీనియర్ గా నేతగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్…
హైదరాబాద్, మార్చి 30, (న్యూస్ పల్స్) అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గరి నుంచి గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. తెలంగాణలో నీటి ఎత్తిపోతల పథకాలు ఎండిపోతున్నా.. నేతల ఎత్తిపోతల ప్రాజెక్టు మాత్రం కళకళలాడుతోంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. చేరడమే కాదు దానంకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా కేటాయించింది.కష్టమొచ్చినా నష్టమొచ్చినా కేసీఆర్ వెంటే నడుస్తాం.. పార్టీ మారే ప్రసక్తే లేదు.. అసలు ఆ అవసరమే లేదు.. అంటూ పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ పెద్ద పెద్ద సవాళ్లు చేస్తున్న నేతలే.. తెల్లారితే కాంగ్రెస్ కండువానో, కాషాయ కండువానో కప్పుకుని కనిపిస్తూ.. షాక్‌లవిూద షాక్‌లు ఇస్తున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైన వలసల ప్రవాహం.. మెల్లమెల్లగా ఊపందుకుని.. ఇప్పుడు జోరుగా నడుస్తోంది. తాజాగా బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్న కే.కేశవరావు కూడా బీఆర్‌ఎస్‌కు బైబై చెప్పారు. ఆయన కూతురు…
హైదరాబాద్, మార్చి 30 రోజుకో ట్విస్ట్‌తో తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎట్టకేలకు అధికారికంగా కేసు నమోదయ్యింది. టెలిగ్రాఫ్ యాక్ట్‌కు అటాచ్ చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.కొత్త కొత్త కోణాలు, పెను సంచలనాలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. దొరికిన ఏ ఒక్క ఆధారాన్ని వదలిపెట్టకుండా విచారణ కొనసాగిస్తున్నారు అధికారులు. అయితే లేటెస్ట్‌గా ఫోన్ ట్యాపింగ్‌పై అధికారికంగా కేసు నమోదవ్వడం.. దేశంలోనే టెలిగ్రాఫ్ యాక్ట్‌కు అటాచ్ చేసిన తొలి కేసు ఇదే అవ్వడంతో ట్యాపింగ్ వ్యవహారం మరింత సీరియస్ టర్న్ తీసుకుంది. ఈ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం రియాక్ట్ అయ్యారు. నిందితులకు జైలులో చిప్ప కూడు తప్పదన్నారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు.ఇక కేసు దర్యాప్తులో ప్రణీత్‌రావుతో పాటు తీవ్ర…
దేశంలో ఉచితాల అంశం మరోసారి తెరవిూదకు వచ్చింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కొంతకాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలపై ఇచ్చే హావిూలను నియంత్రించాలంటూ కొంతమంది న్యాయస్థానాల గడప కూడా తొక్కారు. ఆర్థికశాస్త్రంలో సంపద సృష్టి, సంపద పంపిణీ మధ్య నిరంతర చర్చ జరుగుతూనే ఉంది. ఇరవయ్యవ శతాబ్దం తొలిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వలస పాలన వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమాలు పెల్లుబికి ముందుకు వచ్చాయి. ఈ ఉద్యమాలు అన్ని దేశాల్లోనూ సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చి ప్రజల మద్దతు సవిూకరించాయి. ఏ దేశ స్వాతంత్య్ర ఉద్యమం కూడా తాము పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిస్తాం అని కనీసం మాట వరసకు కూడా అనలేదు. ఇక్కడో విషయం ప్రస్తావించుకుని తీరాలి. 1971?72 ప్రాంతంలో పేదరిక నిర్మూలన గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఇందిరా గాంధీ ఓ రోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు.…
విజయవాడ, మార్చి 30 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అయితే ఆ గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగిసిపోతుంది. అంటే ఆ తేదీ నాటికి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలన్నిటినీ ఖాళీ చేసి ఏపీకి తరలించేయాలి. అయితే ఏపీకి రాజధానే లేని పరిస్థితి. కార్యాలయాలను ఎక్కడికి తరలించాలో అర్ధంకాని అయోమయ స్థితి. అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిపోతుండటంతో ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తెలంగాణకు అప్పగించేసి అక్కడి ఫర్నీచర్, సిబ్బందిని ఏపీకి తరలించేసి తీరాలి. అలా చేయలేకపోతే.. ఆ భవనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ జూన్ రెండు వరకూ మాత్రమే. ఆ తరువాత…
విజయవాడ, మార్చి 30 పుట్టింది వంగవీటి కుటుంబంలో.. కానీ తండ్రి పరువును తీసేస్తున్నాడంటూ వంగవీటి రంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయన కుమారుడు రాధాపై ఫైర్ అవుతున్నారు. ఇంటి పేరు వింటేనే చెవుల్లో రీసౌండ్ వస్తుంది. అందులోనూ బెజవాడలో ఇప్పటికీ వంగవీటి రంగా అంటే ఎవరూ మర్చిపోరు.. మర్చిపోలేరు కూడా. కేవలం కాపు సామాజికవర్గానికే కాదు పేదలకు కూడా రంగా చేసిన సేవలను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. జనరేషన్‌లు మారినా రేంజ్ తగ్గని ఒకే ఒక నేత వంగవీటి రంగా. ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుని అనేక మంది నేతలు రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కానీ ఆయన తనయుడు వంగవీటి రంగా మాత్రం తండ్రి పరువును తీస్తున్నారంటూ రంగా అభిమానులు మండిపడుతున్నారు. ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అనేక పార్టీలు దాదాపుగా టిక్కెట్లను ప్రకటించాయి. టీడీపీ, జనసేన, వైసీపీలు ఇటు ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి.…
