Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Author: Swara
ఏలూరు, మార్చి 30 నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందటారు.. ఇగోకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తానే తోపునని భావిస్తే… రాజకీయాల్లో తోసి పడేస్తారు. ఈ ఉదాహరణలకు, సామెతకు ఒకే ఒక్కడు కనిపిస్తాడు రఘురామ కృష్ణరాజు. డబ్బుందని.. తన ఇమేజ్ వల్లనే గెలిచాడని ఆయన ఇన్నాళ్లు భ్రమలో ఉన్నాడు. టిక్కెట్ ఇచ్చి ఎంపీ చేసిన పార్టీ అధినేతపైనే విమర్శలకు దిగాడు. ప్రత్యర్థులతో చేతులు కలిపాడు. చివరకు ఆయన టిక్కెట్ కే ఎసరు వచ్చింది. పార్టీలు పెద్దగా పట్టించుకోక పోవడంతో నరసాపురం నుంచి ఐదేళ్ల పాటు రఘురామ కృష్ణరాజు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయి. ఇది స్వయంకృతాపరాధమని చెప్పక తప్పదు. 2019 ఎన్నికల్లో నరసాపుంర పార్లమెంటు నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. ఆ విజయం తనవల్లనేనని ఆయన భావించాడు. జగన్ బొమ్మతో గెలవలేదని, తన ఇమేజ్ తోనే గెలిచానని ఆయన చెప్పుకొచ్చారు. గెలిచిన ఏడాది తర్వాత వైసీపీ అధినాయకత్వానికి…
అనంతపురం, మార్చి 30 జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి టీడీపీ అధినేత చంద్రబాబు షాకిచ్చారు. వారికి కేవలం ఒక టికెట్ మాత్రమే కేటాయించారు. అనంతపురం ఎంపీ టికెట్ ను జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్‌కుమార్ రెడ్డి ఆశించారు. అయితే.. తాజాగా విడుదల చేసిన లిస్ట్ లో ఆ టికెట్ ను అంబికా లక్ష్మీనారాయణకు కేటాయించారు. అయితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి టికెట్ దక్కింది. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. 2019లో అనంత ఎంపీగా పవన్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆయన తండ్రి దివాకర్ రెడ్డి అక్కడి నుంచి విజయం సాధించారు. అయితే.. ఎంపీ టికెట్ కుదరకపోతే గుంతకల్, కల్యాణదుర్గంలో ఏదో ఒక టికెట్ ఇవ్వాలని పవన్ కోరారు. అయితే.. గుంతకల్ టికెట్ గుమ్మనూరు జయరాంకు ఇచ్చారు చంద్రబాబు. కల్యాణదుర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబుకు అవకాశం కల్పించారు.…
విజయవాడ, మార్చి 30 ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నందిగామ.విజయవాడ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఒకటి. ప్రస్తుతం వైసీపీ తరపున మొండితోక జగన్మోహన్‌రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1955లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో నందిగామలో కొంతభాగంతోపాటు చందర్లపాడు, వీరులపాడు, కంచికచర్ల మండలాలు ఉన్నాయి. దాదాపు లక్షా 80 వేల ఓటర్లు ఉన్నారు. ఎక్కువగా గ్రావిూణ ప్రాంతం కలిగిన నందిగామ నియోజవర్గం మొత్తం విజయవాడ` హైదరాబాద్ జాతీయ రహదారిగి ఇరువైపులా ఉంటుంది. విజయవాడకు కేవలం 50 కిలోవిూటర్ల దూరంలోనే నందిగామ పట్టణం ఉంది.నందిగామ నియోజవర్గం మొదటి నుంచి వామపక్షాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. 1955లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ నుంచి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించి నందిగామ తొలి ఎమ్మెల్యేగా చరిత్రకెక్కారు. ఆ తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లోనూ సీపీఐ ఈ సీటును నిలబెట్టుకుంది. సవిూప కాంగ్రెస్ అభ్యర్థి బండి తిరుపతయ్యపై మరోసారి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు…
విజయవాడ, మార్చి 30 ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ? జనసేన పార్టీ ? భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులను ప్రకటించాయి. జనసేన తరపున ప్రకటించాల్సిన మూడు స్థానాలు మాత్రమే పెండిరగ్ ?న్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించారు.. అయితే, జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. కానీ, విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండిరగ్‌లో పెట్టింది. ఇదే సమయంలో జనసేన పోటీ చేసే బందరు పార్లమెంటు స్థానాన్ని కూడా పెండిరగులో పెట్టింది.పెండిరగ్‌లో ఉన్న సీట్లల్లో అభ్యర్థుల ఖరారుపై ఇప్పటి వరకు ఏటూ తేల్చుకోలేకపోతోంది జనసేన పార్టీ.. మూడు అసెంబ్లీ, ఓ లోక్ సభ సీటుపై ఇంకా క్లారిటీకి రాలేదు.. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ కసరత్తు చేశారు.. అయినా ఇప్పటి వరకు అభ్యర్థుల…
అనంతపురం, మార్చి 30 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు రాజకీయ పార్టీల భవిష్యత్‌నేకాదు చాలా మంది సామాన్యుల తలరాత కూడా మార్చేయనున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, హోరాహోరీ పోరాటంలో కొందరు అతి సామాన్యులు కూడా టికెట్ దక్కించుకొని బరిలో నిల్చున్నారు. రాజకీయం అంటే చేతి నిండా డబ్బులు, పేరు వెనకాల రాతలు ఉండాల్సిన అవసరం లేదని పార్టీకి సిన్సియర్‌గా కష్టపడితే చాలు అంటు చాటి చెబుతున్నారు. అలాంటి వారిలో ఈరలక్కప్ప. ఇప్పుడు ఈయన వైసీపీ తరఫున అసెంబ్లీ టికెట్ దక్కించుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ స్థానం. జగన్ మోహన్ రెడ్డిపై అభిమానంతో వైసిపిలో ఒక కార్యకర్తగా వీరలకప్ప ప్రస్థానం ప్రారంభమైంది. గుడిబండ మండలం పలారం గ్రామానికి చెందిన ఈరలక్కప్పప్రైవేట్ టీచర్. వైఎస్ హయాంలో ఇందిరమ్మ గృహం మంజూరైంది. ఈయన ఫ్యామిలీ ఉపాధి కూలీకి వెళ్తే డబ్బులు వచ్చేవి. మిగతా టైంలో చింతపండు అమ్ముకుంటున్నారు.…
విజయవాడ, మార్చి 30 ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు 16 డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇందులో 13 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెలువడగా.. తెలంగాణ విడిపోయాక 3 పర్యాయాలు నోటిఫికేషన్లు జారీచేశారు. అయితే అంతకు ముందు 1977, 1978, 1982 డీఎస్సీలు నిర్వహించినప్పటికీ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్, 1982 అమల్లోకి వచ్చాక మొదటి డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్టీఆర్ హయాంలో 1984లో వెలువడిరది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయ భాస్కర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలలో నోటిఫికేషన్లు వెలువడగా.. చివరగా కిరణ్ కుమార్ రెడ్డి 2012లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014, 2018లలో డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఎన్టీఆర్‌తో ప్రారంభం..ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మొదటిసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. ఎన్టీఆర్ తన పదవీకాలంలో 1984, 1986, 1989 సంవత్సరాల్లో మొత్తం 3…
శ్రీకాకుళం, మార్చి 30 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురికి అధికార పార్టీ అవకాశం కల్పించగా టీడీపీ కూటమి మాత్రం ఒక్కస్థానానికే పరిమితం చేసింది. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించగా కూటమిలో మాత్రం ఒక్క స్థానానితో సరిపెట్టుకుంది. జిల్లా నుంచి ఎప్పటిలాగానే మహిళా ఓటర్లు శాతం అధికం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు అగ్రతాంబులాం ఇచ్చినట్టే. సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఆ ప్రాధాన్యత కల్పించింది. గతేడాది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, పాలకొండ నియోజకవర్గంలో విశ్వాసరాయి కళావతి వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగగా, ఈ రెండు స్థానాలు ఆయా నియోజకవర్గ ప్రజలు వారిద్దరికి పట్టం కట్టారు. అదే టీడీపీ నుంచి పరిశీలిస్తే శ్రీకాకుళం నుంచి గతసారి ఎన్నికల్లో జిల్లా నుంచి పలాస, శ్రీకాకుళం నియోజక వర్గాల నుంచి గౌతు శీరిష, గుండ లక్ష్మీదేవి బరిలో దిగగా వారిద్దరు ఓటమి పాలయ్యారు. ఈసారి…
న్యూఢల్లీి, మార్చి 28 ఢల్లీి మద్యం స్కామ్ కేసులో అరెస్ట్‌తో ఈడీ కస్టడీలో ఉన్న ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం గ్లోబల్ టాక్‌లా మారింది. ఈ కేసుపై మొన్న జర్మనీ, నిన్న అమెరికా స్పందించడం కలకలం రేపుతోంది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ భారత్ కన్నెర్ర చేసింది.ఢల్లీి మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అంతర్జాతీయ స్పందనలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. మొన్నామధ్య జర్మనీ దీనిపై ప్రకటన విడుదల చేయగా, తాజాగా అమెరికా కూడా స్పందించింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దీనిపై సీరియస్ అయిన భారత్ ఢల్లీిలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ…
కరీంనగర్, మార్చి 28 కరీంనగర్ జిల్లా నేతలకు కొత్త చిక్కులు వెంటాడుతున్నాయి. పోలీసుల నుండి తప్పించుకోవాలంటే అధికార పార్టీలో చేరితే సేఫ్ అవుతామని భావించినప్పటికీ లాభం మాత్రం ఉండడం లేదు. నేరం చేశారని డాక్యూమెంట్ల ద్వారా తేలితే చాలు క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వెనకాడేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వివిధ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.కరీంనగర్ సవిూపంలోని చింతకుంటలో పామ్ రాజ్ దేవరాజ్ కు 106 ఎకరాల 8 గంటల వ్యవసాయ భూమి ఉండేది. ఈ భూమిని విక్రయించుకోగా 20 గుంటల స్థలం మిగిలి ఉంది. అయితే ఈ భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు పేరు మారిపోయి న్యాలమడుగు చిన వీరయ్య పేరు చేరింది. అయితే చింతకుంట సర్పంచ్ గా వ్యవహరించిన పిట్టల రవిందర్ వీరయ్య అనే పేరుగల…
హైదరాబాద్: ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా బుధవారం ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై బౌలర్లు నామమాత్రంగా మారిపోయిన వేళ ఫోర్లు, సిక్సర్ల వర్షంతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి 523 పరుగులు బాదాయంటేనే పరుగులు ప్రవాహం ఏ స్థాయిలో పారిందో అర్థం చేసుకోవచ్చు. రెండు జట్లు కలిసి ఏకంగా 31 ఫోర్లు, 38 సిక్సులు బాదాయి. దీంతో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఆనందంతో కేరింతలు కొడుతూ ఆటగాళ్లను ఎంకరేజ్ చేశారు. ఇందులో భాగంగానే ఓ చిన్నారి కూడా ఆనందంలో మునిగితేలింది. మైదానంలో తన తండ్రి సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోతుంటే ఆ పాప ఆనందంతో మురిసిపోయింది. గ్యాలరీల్లో నుంచి తమ జట్టు జెండాను ఊపుతూ…