Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Author: Swara
సోషల్ మీడియా(social media)లో గతంలో వెలుగులోకి వచ్చిన క్రౌడ్ ఫండింగ్(crowdfunding) విధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇటివల ఈ అంశంపై టెస్లా వ్యవస్థాపకుడు, ఎలాన్ మస్క్(elon musk) కొనుగోలు చేసిన ట్విట్టర్ స్పందించింది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్(Kulwinder Kaur gill)కు రెండు కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు. అయితే వారు ఎందుకు సాయం చేస్తామని చెప్పారు, ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం. 2020 వేసవిలో లాక్‌డౌన్ సమయంలో కెనడాలో ఏర్పడుతున్న ఇబ్బందుల గురించి ఆమె సోషల్ మీడియాలో ధైర్యంగా బహిరంగంగా పోస్టులు చేశారు. కెనడా(canada)లో ఇమ్యునాలజీ, పీడియాట్రిక్స్‌లో నిపుణురాలైన వైద్యురాలైన గిల్ ఆమె కోవిడ్-సంబంధిత ట్వీట్ల కారణంగా న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. ఆ క్రమంలో లీగల్ ఫీజు 300,000 CAD (రూ. 1,83,75,078) కోసం క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా సహాయం చేయాలని కోరారు. ఆ క్రమంలో విషయం…
హైదరాబాద్: ఐపీఎల్‌లో (IPL 2024) చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే తమ కెరీర్ మొత్తంలో ఒకటి రెండు జట్లకే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎక్కువ మంది ఆటగాళ్లు అనేక జట్లకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ (Jaydev Unadkat) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బుధవారం ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) ఆడిన మ్యాచ్‌లో ఉనద్కత్ బరిలోకి దిగాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక జట్లకు ఆడిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 7 జట్లకు ఆడిన మనీష్ పాండే(Manish Pandey) రికార్డును అధిగమించాడు. ఈ సీజన్‌లో జయదేవ్ ఉనద్కత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఉనద్కత్ ప్రాతినిధ్యం వహిస్తోన్న 8వ జట్టు సన్‌రైజర్స్. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక జట్లకు ప్రాతినిధ్యం వహించిన భారత ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా రెండో…
హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)కి అమెరికా (USA)లో బైక్ యాక్సిడెంట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన తదుపరి సినిమా నిమిత్తం అమెరికాలో ఉన్న నవీన్ పోలిశెట్టి.. అక్కడ బైక్‌పై వెళుతుండగా.. బైక్ స్కిడ్ అవడంతో పడిపోయాడని, చేతికి బలమైన దెబ్బ తగిలినట్లుగా సమాచారం. ఆయనను రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారని తెలుస్తోంది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగి రెండు మూడు రోజులు అవుతున్నా.. ఇంత వరకు బయటికి రాలేదు. నవీన్ పోలిశెట్టి (Hero Naveen Polishetty) తన టీమ్‌కి ఈ విషయం తెలియజేయడంతో.. అతనికి యాక్సిడెంట్ అయినట్లుగా వార్తలు బయటికి వచ్చాయి. ఈ యాక్సిడెంట్‌కి సంబంధించి నవీన్ పోలిశెట్టి మాత్రం ఎక్కడా స్పందించలేదు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mister Polishetty) సినిమాలతో నవీన్ పోలిశెట్టి హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ…
హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఫ్యామిలీ స్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో గురువారం మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. https://youtu.be/xB7b3RzicUUhttps://youtu.be/xB7b3RzicUU
హైదరాబాద్, మార్చి 28 బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి తీహార్ జైలులో ఉన్నారు. ఆమెకు పదిహేను రోజులు న్యాయస్థానం రిమాండ్ విధించింది. కల్వకుంట్ల కుటుంబంలో తొలి సారి కవిత అవినీతి కేసులో జైలుకెళ్లారు. ఉద్యమం సమయంలో వెళ్లడం వేరు. అవినీతి కేసులో జైలు ఊచలు లెక్కపెట్టడం వేరు. అందుకే కవిత అరెస్ట్ పై ప్రజల్లో అభిప్రాయం ఏ మేరకు ఉందన్నది బీఆర్‌ఎస్ నేతలకు అర్థం కాకుండా ఉంది. మార్చి 15వ తేదీన కవితను బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసి ఢల్లీికి తరలించారు. ఆ మరుసటి రోజు బీఆర్‌ఎస్ శ్రేణులు కొంత ఆందోళన చేశాయి. కానీ ఆ తర్వత కవిత అరెస్ట్ పై ఎలాంటి ఆందోళనలు బీఆర్‌ఎస్ చేయలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత అరెస్టయింది ఢల్లీి లిక్కర్ స్కామ్ కేసులో. మహిళ అయి ఉండి ఆమె లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడంపై తెలంగాణ…
హైదరాబాద్, మార్చి 28 లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దాంతో కవితను తీహార్ జైలుకి తరలించారు. కాగా, ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఏప్రిల్ 9న జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. మరి, కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? అసలేం జరగనుంది?బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ చేయనుంది కోర్టు. మరి కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? లేక ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా? అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, అభిషేక్ బోయినపల్లి సహా పలువురికి బెయిల్ మంజూరైంది. అనారోగ్యం, కుటంబ కారణాలతో కొందరు.. అప్రూవర్ గా మారి మరికొందరు బెయిల్ తెచ్చుకున్నారు.కవిత మాత్రం తాను అప్రూవర్ గా మారను…
హైదరాబాద్, మార్చి 28 తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతుంది. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఎండల నేపథ్యంలో మార్చి 15 నుంచే రాష్ట్రంలో స్కూళ్లకు ఒంటి పూట బడులు మొదలయ్యాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు తెలంగాణలో ఒంటి పూట బడులు ఉంటాయి. ఏప్రిల్ 24 పాఠశాలలకు చివరి వర్కింగ్ డే గా తెలుస్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 25 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒండి పూట బడులు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మంచి నీటి సదుపాయం ఏర్పాటుచేశారు.…
మెదక్, మార్చి 28 తెలంగాణలో అధికారం మారిన వెంటనే రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం అనేక ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్ పై రకరకాల ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా సంతోష్ రావుపైనా కేసు నమోదు అయింది. కేసీఆర్ మరో సవిూప బంధువు కల్వకుంట్ల కన్నారావు పోలీసుల నోటీసులకు స్పందించడం లేదు. అయితే కేసీఆర్ కుటుబంంలో ఒక్క హరీష్ రావుపై మాత్రం చిన్న ఆరోపణ కూడా రావడం లేదు. ఇది తెలంగాణ రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. హరీష్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఔదార్యం చూపిస్తోందా ? బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం వరుస కేసులు, విచారణలతో విలవిలలాడుతున్నది. ఒక రకంగా కేసులు, విచారణల పద్మవ్యూహంలో చిక్కుకుంది. ఒకవైపు ఈ కేసులతోపాటు.. పార్టీ నుంచి వలసలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేసీఆర్ కుమార్తె కవితను…
కరీంనగర్, మార్చి 28 తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలలో దాదాపు ఆయా పార్టీల సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్లమెంట్ బీఆర్‌ఎస్ పార్టీ నుండి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బరిలో దిగుతున్నారు. బీజేపీ నుంచి ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. దాంతో వీరిని ఢీకొట్టేందుకు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి ఎవరు దిగనున్నారు అన్న విషయం కరీంనగర్‌లో ఉత్కంఠ రేపుతోంది.పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానంలో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థిపై ఎటు తేల్చుకోలేకపోతుంది. ఈ క్రమంలో ముగ్గురు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు కుమారుడు రాజేందర్ రావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఐతే…
అదిలాబాద్, మార్చి 28 ఎడారిగా ఎల్లంపల్లి మారుతోంది. వెరసి గోదారి తీర ప్రాంత రైతాంగం సాగునీరో రామచంద్రా అంటోంది. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఎండలకు ఎండి.. నీరంతా ఆవిరవుతుండటంతో గోదారి తీరమంతా రాళ్లు తేలి ఎడారిలా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు జలకళతో కళకళాలాడిన కడెం ప్రాజెక్ట్ మరమ్మత్తుల కోసం ఖాళీ కాగా.. దిగువకు నీళ్లొచ్చే దారి లేక నిర్మల్ జిల్లా కడెం మండలం నుండి మంచిర్యాల జిల్లా గూడెం వరకు గోదావరి తీరమంతా ఇదిగోఇలా రాళ్లు తేలి కనిపిస్తోంది. ప్రస్తుతానికి గూడెం ఎత్తిపోతల ద్వారా మంచిర్యాల జిల్లా దండెపల్లి , లక్షేట్టిపేట మండలాల రైతాంగానికి నీళ్లందతున్నా.. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ గణనీయంగా పడిపోతుండటంతో చివరి పంట వరకు సాగు నీళ్లు అందడం గగనంగా మారుతోంది. సాగునీళ్లే కాదు తాగునీళ్లకు కరువు ఛాయలను మోసుకొస్తోంది ఎల్లంపల్లి.ఇప్పటికే కడెం ప్రాజెక్ట్ సాగునీళ్లు ఇవ్వలేనంటూ చేతులెత్తేయడంతో దిగువ ప్రాంతం గోదావరిలో నీటి చుక్క కనిపించక..…
