Author: Swara

ఒంగోలు, మార్చి 25 వాలంటీర్లు.. స్థానిక సంస్థల ప్రతినిధుల కంటే పవర్‌ ఫుల్‌. అంతలా వారికి హక్కులు, విధులు కల్పించారు. సూపర్‌ పవర్స్‌ ఇచ్చారు. అయితే అవి అంతవరకే పరిమితం. ఆ పవర్స్‌ ఏవీ వాలంటీర్ల భవిష్యత్తుకు అక్కరకు రాలేదు. ఎన్ని రకాల పవర్స్‌ ఇచ్చినా.. హక్కులు కల్పించినా వాలంటీర్లకు ఎటువంటి భరోసా లేకుండా పోయింది. ఎన్నికల్లో వారి సేవలను వినియోగించుకోవాలని అధికార పార్టీ భావిస్తుంది. అయితే వారి సేవలను తప్పుపడుతూ విపక్షాలు ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వాలంటీర్లు తొలగించబడుతున్నారు.వాలంటీర్లకు నెలకు సగటు జీతం ఐదు వేల రూపాయలు. గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకంటే, ప్రభుత్వం కంటే వారు వైసీపీకి ఎక్కువగా పని చేశారు. వైసీపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాటుపడ్డారు.వైసిపి భావజాలం ఉన్నవారు ఎక్కువగా వాలంటీర్లుగా ఉన్నారు. అందుకే అటువంటివారు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులోత్తారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో…

Read More

గుంటూరు, మార్చి 25 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ శాఖల్లో గత కొన్నేళ్లుగా సమాచార గోప్యతను పక్కాగా అమలు చేస్తున్నారు. ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వకూడదనే ముఖ్యమైన వ్యక్తుల ఆదేశాలతో అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు నాలుగేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు. గడువు తీరిన దరఖాస్తులకు ఏదొక సాకును చూపి పక్కన పెడుతున్నట్లు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం సమాచారాన్ని ఎలాంటి షరతులు లేకుండా అందించేవారు. కోవిడ్‌ ఆంక్షలతోపాటు ఆర్టీఐ దరఖాస్తుల్లో గోప్యత కూడా మొదలైంది.ప్రభుత్వ పథకాలు అమలు,ఆర్ధిక అంశాలు,నిధుల కేటాయింపులు, రెవిన్యూ వసూళ్లు వంటి వివరాల కోసం ఆర్టీఐ దరఖాస్తులు అందుతుండటంతో అన్ని శాఖలకు సమాచారం ఇవ్వొద్దని మౌఖిక ఆదేశాలు అందాయి. 2021 నుంచి ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టడం కూడా నిలిపేశారు. కొద్ది నెలల క్రితం హైకోర్టు ఆదేశాలతో తిరిగి కొన్ని ఉూలను అప్టేడ్‌…

Read More

విశాఖపట్టణం, మార్చి 25 ఏపీలో ఎన్నికల వేళ డ్రగ్స్‌ వ్యవహారం కాకరేపుతోంది. తాజాగా విశాఖ తీరంలో ఓ కంటైనర్‌ లో 25 వేల కేజీల డ్రగ్స్‌ దొరకటంసంచలనంగా మారింది. ఇది దొరికిన క్షణాల వ్యవధిలోనే రాజకీయ రంగును పులుముకుంది. ఓవైపు ఈ డ్రగ్స్‌ అంతా వైసీపీదేనంటూ తెలుగుదేశం పార్టీ నేతలు?. స్పందించారు. మరోవైపు ఈ వ్యవహారమంతా తెలుగుదేశం పార్టీకి చెందిన బ్యాచ్‌ వాళ్లదే అంటూ వైసీపీ అంటోంది. ఇరు పార్టీలు కూడా పలువురి పేర్లను ప్రస్తావిస్తూ?. సోషల్‌ విూడియాలో పోస్టింగ్‌ లు చేస్తున్నాయి. ఫలితంగా ఎన్నికల వేళ డ్రగ్స్‌ వ్యవహారం టాక్‌ ఆఫ్‌ ది ఆంధ్రాగా మారిపోయింది.ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ దొరికిన కేసులో వైసీపీ నేతల ప్రమేయం ఉందంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌ కూడా స్పందించారు. విశాఖలోని ఓ ప్రైవేట్‌ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్‌ దిగుమతి…

Read More

నర్సరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌ సీటు ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీకి గుడ్‌ బై చెప్పారు. లావు శ్రీకృష్ణదేవరాయలు బయటకు వెళ్లిపోవడంతో… మరో యువనేతకు నర్సరావుపేట సీటు కన్ఫామ్‌ అయిందా ? నమ్మినబంటుగా ఉన్న ఆ నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నర్సరావుపేట పార్లమెంట్‌ నుంచి వచ్చే ఎన్నికల్లో యనమల సాయి నాగార్జున యాదవ్‌ పోటీ చేస్తారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నాడు`నేడు తీరును పర్యవేక్షించడానికి… ఏపీ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యా శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. గతేడాది యనమల సాయి నాగార్జున యాదవ్‌ ను ఈ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా నియమించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నర్సరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం చాలా కీలకం. ఈ…

Read More

మైదుకూరు, జనవరి 24 మరో 3 మాసాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రతి విషయాన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని రెండోసారి అధికారంలోకి రావాలని పరితపిస్తున్న వైసీపీ.. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఐప్యాక్‌ సర్వే సహా.. వలంటీర్లు, ఇతర మాధ్యమాల్లో అభ్యర్థుల పనితీరు, ప్రజల నాడిని పసిగడుతున్న విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదికల ఆధారంగా.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కీలకమైన నాయకులకు కూడా వైసీపీ అధిష్టానం స్థానాంతరం కల్పించింది. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు దూరంగా మరో నియోజకవర్గాలను వారికి కేటాయించింది. మరికొందరిని అసలు ఎలాంటిఅవకాశం లేకుండా పక్కన కూడా పెట్టేసింది. దీనికి ఇష్టపడి వారు.. పార్టీ నుంచి వెళ్లిపోతున్నా.. వైసీపీ మాత్రం తన పనితాను చేసుకుని పోతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌…

Read More

విజయవాడ, జనవరి 24 ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే జిల్లాల పర్యటన ప్రారంభించారు. ఇచ్చాపురం నుంచి ఆమె యాత్ర ప్రారంభించారు. ఇడుపులపాయ వరకూ సాగుతుంది. ఎన్నికలకు పెద్దగా సమయం లేనందున వెంటనే రంగంలోకి దిగారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కనీసం వంద స్థానాల్లో అయినా బలమైన అభ్యర్థులను పెట్టే లక్ష్యంతో షర్మిల పార్టీకి ఉత్సాహం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది.షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరగానే ఆమె కండువా కప్పించుకున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరపున మంగళగిరి నుంచి పోటీ చేయడం ఖాయమే అనుకోవచ్చు. కాంగ్రెస్‌ లోకి రావాలని వైసీపీలో పెద్దగా ప్రాధాన్యత లభించని కీలక నేతలతో ఆళ్ల…

Read More

విజయవాడ, జనవరి 24 టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేరు సోషల్‌ విూడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఈరోజు ఆయన జన్మదినం కావడంతో టిడిపి శ్రేణులు వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్‌ విూడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ విూడియాలో హోరెత్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో లోకేష్‌ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. టిడిపి శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరోవైపు నారా లోకేష్‌ తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.లోకేష్‌ కు బర్త్‌ డే విషెస్‌ చెబుతూ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున సోషల్‌ విూడియాలో సందేశాలు పెడుతున్నారు. హ్యాపీ బర్త్డే యంగ్‌ లీడర్‌ లోకేష్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. దేశవ్యాప్తంగా రెండో స్థానంలో? హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండిరగ్‌ లో ఉంది. నాడు మంత్రిగా లోకేష్‌ తీసుకున్న కీలక నిర్ణయాలను గుర్తు…

Read More

విజయవాడ, జనవరి 24 వైసీపీలో మంత్రి రోజాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. ఆమెను సొంత పార్టీ శ్రేణులు టార్గెట్‌ చేసుకుంటున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట తమ స్వరం వినిపిస్తున్నారు. ఏకకాలంలో ముప్పేట దాడి చేస్తుండడంతో.. రోజా వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఆమెకు టికెట్‌ లేదన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కానీ తనకు టికెట్‌ తప్పకుండా లభిస్తుంది అన్న ధీమాతో రోజా ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రోజాను టార్గెట్‌ చేసుకొని నగిరి నియోజకవర్గ వైసిపి ప్రజాప్రతినిధులు తీవ్ర ఆరోపణలు చేస్తుండడం సంచలనం కలిగిస్తోంది. ఇదంతా రోజాకు టిక్కెట్‌ ఎగ్గొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నమని ప్రచారం జరుగుతోంది.పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళా దళిత కౌన్సిలర్‌ తిరుపతిలో రోజాకు వ్యతిరేకంగా ప్రెస్‌ విూట్‌ పెట్టారు. మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఇస్తామని డబ్బులు తీసుకున్నారని.. కానీ రోజా ఇవ్వలేకపోయారని ఆరోపణలు చేశారు. కనీసం తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వలేదని…

Read More

విజయవాడ, జనవరి 24 ఏపీలో అంగన్వాడీలు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటి ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 42 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. ఒకానొక దశలో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. నిన్న సాయంత్రం లోపు విధుల్లో చేరాలని డెడ్‌ లైన్‌ విధించింది. లేకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఈ తొలగింపునకు సంబంధించి కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలపై ఒత్తిడి పెరిగింది. ఒక్క రూపాయి వేతనం పెంచకుండానే అంగన్వాడీలతో ప్రభుత్వం సమ్మె విరమింపజేసింది. సోమవారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడి సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇవి సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు.అయితే జూలైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం లిఖితపూర్వక హావిూ ఇవ్వడం విశేషం.…

Read More

విజయవాడ, జనవరి 24 ఏపీలో కొత్తగా వివాహం చేసుకునే వారికి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వివాహాల నమోదుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచింది. వివాహ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.200 ఉండగా.. దానిని ఇప్పుడు రూ.500కు పెంచారు. దంపతుల అభ్యర్థనతో కార్యాలయం బయట జరిగే వివాహ వేదిక దగ్గరకు సబ్‌ రిజిస్టార్‌ వస్తే.. ఇప్పటివరకు ఉన్న రూ.210 ఫీజును రూ. 5 వేలకు పెంచారు. వివాహాల రికార్డు పరిశీలనకు రూపాయి గా ఉన్న ఫీజును రూ.100కు పెంచారు. సెలవు రోజుల్లో వివాహాల నమోదుకు రూ.5 వేలకు పెంచారు.1955 హిందూ వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టానికి సంబంధించి 1965 మార్చిలో జారీచేసిన ఫీజులను.. ఇటీవల సవరించిన వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజుల విషయంలో కఠినంగా వ్యవహరించిన సర్కార్‌.. వివాహ రిజిస్ట్రేషన్‌ ను మరింత సులభతరం చేయనుంది. ఆన్‌ లైన్‌ నమోదు ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆన్‌…

Read More