Author: Swara

ఖానాపూర్‌ నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ పట్టణంలోని అంబెడ్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన చెట్పల్లి అలేఖ్య అనే యువతిని ప్రేమ పేరిట వెంబడిరచి నడిరోడ్డుపై అత్యంత దారుణంగా నరికి చంపడం చూస్తే హంతకుడిలో క్రూరత్వానికి నిదర్శనమని టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఆదివారం మధ్యాహ్నం అంబేద్కర్‌ నగర్లోని అలేఖ్య నివాసానికి వచ్చిన కోదండరాం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలేఖ్య హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. హంతకుడు చేసిన విచక్షణ రహిత దాడిలో తీవ్రంగా గాయపడిన మరో యువతీ జయశీల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలేఖ్య హత్య కేసులో నిందితులు శ్రీకాంత్‌ సహ మరో ఇద్దరిని కఠినంగా శిక్షించాలంటే కచ్చితంగా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జయశీల ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆమెకు భవిష్యత్తులో న్యాయం జరిగేలా తన వంతుగా సహకరిస్తానని హావిూ ఇచ్చారు.

Read More

న్యూఢల్లీి, మార్చి 25 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదవ జాబితాను బీజేపీ నేడు విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నటి కంగనా రనౌత్‌కి కూడా బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది.హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్‌ పోటీ చేస్తున్నారు. పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ను హర్యానాలోని కురుక్షేత్ర నుంచి పోటీకి దింపినట్లు పార్టీ ప్రకటించింది. చంద్రాపూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుధీర్‌ ముంగుంటివార్‌పై మాజీ ఎంపీ సురేశ్‌ ధనోర్కర్‌ భార్య ప్రతిభా ధనోర్కర్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలిపింది. పిలిభిత్‌ నుంచి వరుణ్‌ గాంధీ టికెట్‌ రద్దు కాగా, ఇక్కడి నుంచి జితిన్‌ ప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చారు. బక్సర్‌ నుంచి అశ్విని చౌబే టికెట్‌ రద్దు చేయగా, పశ్చిమ చంపారన్‌ నుంచి సంజయ్‌ జైస్వాల్‌కు టికెట్‌ ఇచ్చారు. పూరీ నుంచి సంబిత్‌ పాత్రకు టికెట్‌ దక్కింది. వయనాడ్‌ నుంచి రాహుల్‌…

Read More

హైదరాబాద్‌, మార్చి 25 తెలంగాణలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్స్‌లో యువతీ, యువకులు రంగులు పూసుకుని సంతోషంగా గడిపారు. కేరింతలు కొడుతూ డ్యాన్స్‌లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తూ హోలీ వేడుకలు సందడిగా సాగాయి. హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్స్‌లు నిర్వహించారు. విద్యార్థులు, స్నేహితులంతా ఒక చోట చేరి సంబరాలు జరుపుకున్నారుహైదరాబాద్‌ మోడల్స్‌ ఆధ్వర్యంలో గడ్చిబౌలి సంధ్యా ఫుడ్‌ కోర్టులో ఘనంగాతో వేడుకలు నిర్వహించారు. సేంద్రీయ రంగులతో ఐదు గంటల పాటు సాగిన ‘కంట్రీ క్లబ్‌ హోలీ’ సంబరాల్లో యువత పెద్ద సంఖ్యల్లో పాల్గొని జోష్‌గా రెయిన్‌ డాన్స్‌లు చేశారు. మ్యూజిక్‌ మస్తీలో ఉర్రూతలూగారు. ఆత్మీయులంతా ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు జిల్లాల్లో యువతీ, యువకులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నారు.హోలీ అంటే చాలు పిల్లలు, పెద్దలు ఎగిరి గంతేస్తారు. రంగులతో ఆడుకోవడం అంటే అందరికీ సరదానే. రంగులను…

Read More

భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్యం. భారత పార్లమెంటు ఎన్నికలంటే ప్రపంచం మొత్తం మనవైపే చూస్తుంది. ఇక ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ప్రజలకు ఓ అనే ఆయుధం సంధించే సమయం. అయితే ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండాల్సిన హక్కులు క్రమంగా హరించుకుపోతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న వారికే హక్కులు ఉంటున్నాయి. ఇతరుల స్వేచ్ఛను హరిస్తూ.. వారు హక్కులను అనుభవిస్తారు. ఈ తీరుపై అనేక విమర్శలు వస్తున్నా.. అధికారంలో ఉన్నవారి తీరు మారడం లేదు. తాజాగా అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్‌కు నిధులు అందకుండా ఖాతాలు ఫ్రీజ్‌ చేయడమే ఇందుకు ఉదాహరణ.బీజేపీ తీరుపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్‌విూట్‌ పెట్టి మరీ అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టారు. తమ పార్టీకి ఎంత నష్టం కలిగిస్తోంది. ఎంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం అని వివరించింది. ఐటీ శాఖ తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేయడంతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేకపోతున్నామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు…

Read More

విజయవాడ, మార్చి 25 ఎన్నికలు అంటే ఆ హడావుడే వేరబ్బ? ప్రచారం, పాదయాత్ర, ర్యాలీలు, బహిరంగ సభలు అబ్బో ఒకటేంటి నేతల హంగామా అంతా ఇంతా కాదు.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వ్యూహాలు, ప్రతివ్యూహాలతో నేతలు క్షణం ఖాళీ లేకుండా గడపుతారు. ఇక ఎన్నికల తేదీ విడుదలైందంటే.. ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసే వారికి అసలు సమయమే సరిపోదు.కానీ, ఈ ఎన్నికల ట్రెండ్‌ చూస్తే ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటోంది. బిజీబిజీగా ఉండాల్సిన నేతలు.. బిందాస్‌గా గడపుతున్నారు. సమయం చాలా ఉంది.. ప్రచారానికి కాస్త విరామం ఇచ్చేద్దామంటూ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్నారుఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికలకు డేట్‌ ఫిక్స్‌ అయింది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఎన్నికల యుద్ధానికి సర్వం సిద్ధమైంది. కానీ, ఎక్కడ వారు అక్కడే.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు దక్కించుకున్న వారు.. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉందంటూ రెస్ట్‌ మోడ్‌లోకి…

Read More

విజయవాడ, మార్చి 25 మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్‌ షెడ్యూల్‌ విడుదల చేయడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దాంతో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు అప్రమత్తం అయ్యారు. నగదు బదిలీలు, నగదు తరలింపు, బంగారం సహా పెద్ద ఎత్తున చీరలు సహా ఇతరత్రా సామాగ్రి ఓటర్లకు పంపిణీపై ఎన్నికల అధికారులు ఫోకస్‌ చేశారు. ఏపీలో ఇదివరకే పలుచోట్ల నగదు, మద్యం పట్టుబడగా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రభుత్వ అధికారులు, వాలంటీర్లపై ఈసీ చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.ఏపీలో ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను ఎన్నికల సంఘం రిటర్నింగ్‌ అధికారులకు పంపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో మొత్తంగా 51 మంది త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 10ఏ ప్రకారం జాబితాలోని 51…

Read More

తిరుపతి, మార్చి 25 సత్యనేడు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్‌` తమిళనాడు సరిహద్దులో ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పడిరది. సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కండ్రిగ, పిచ్చాటూరు, నిండ్ర, నారాయణవనం, నాగలాపురం, కేవీబీ పురం మండలాలు ఉన్నాయి.2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలంపై టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య తారా చంద్రకాంత్‌ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేడీ రాజశేఖర్‌ పై వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలం గెలిచారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన వైసీపీ పార్టీపై వ్యతిరేక స్వరం వినిపించారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆయన ఆ తరువాత టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ పార్టీ నుంచి కొనేటి ఆదిమూలంను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిందినియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి పెనం విూద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని…

Read More

విజయవాడ, మార్చి 25 విజయవాడలో శాంతి భద్రతల వ్యవహారం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఓ పెద్ద ఉదాహరణ. అదేవిూ మారుమూల ప్రాంతం కాదు, నగరానికి కిలోవిూటర్ల దూరంలో ఏవిూ లేదు, పోనీ జనసంచారం లేని ప్రాంతమా అంటే అదీ కాదు. అన్నీ ఉన్నాయి, నిఘా కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంది. కానీ అక్కడ బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగానికి పోలీసులు కూడా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. విజయవాడ నడిబొడ్డున పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ లో జరిగిందీ వ్యవహారం. బెజవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ ఏపీలోనే అత్యంత రద్దీగా కనిపించే ప్రాంగణం. ఇలాంటి ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ, శాంతిభద్రతల నిర్వహణ ఎంతో పగడ్బందీగా ఉంటుంది. ఉంటుందని అనుకుంటాం కానీ, అలా లేదని ఈరోజు తెల్లవారు రaామున జరిగిన సంఘటన రుజువు చేసింది. బెజవాడ బస్టాండ్‌ లో నిత్యం బ్లేడ్‌ బ్యాచ్‌ లు, యాచకులు మకాం వేసి ఉంటారు. యాచకులు డబ్బులివ్వనిదే ప్రయాణికులను…

Read More

నెల్లూరు, మార్చి 25 నెల్లూరులో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. నిన్న మొన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారు నేడు శత్రువులుగా మారిపోయారు. డ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డిపై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రశాంతి రెడ్డి తన రెండో భర్తను వెనకేసుకు రావద్దని అన్నారు ప్రసన్న. అదే సమయంలో వేమిరెడ్డికి కాంతం, కనకం, జూదం అంటే ఇష్టమని.. పర్సనల్‌ అటాక్‌ కి దిగారు. ప్రసన్న ప్రాతినిథ్యం వహిస్తున్న కోవూరులో ఈసారి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ అభ్యర్థి కావడంతో.. వేమిరెడ్డి దంపతులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.నెల్లూరులో గత ఎన్నికలకు ఇప్పటికి పొలిటికల్‌ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ 10కి 10 స్థానాలు సాధించి నెల్లూరు జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈసారి అలాంటి పరిస్థితులు కనపడటం లేదు. పోరు హోరాహోరీగా ఉండే అవకాశముంది. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి టీడీపీలో…

Read More

తిరుమల, మార్చి 25 ఏపీ సీఎం జగన్‌ కు అత్యంత ఇష్టుడైన అధికారి ధర్మారెడ్డి. అందుకే కేంద్ర ప్రభుత్వం విభాగంలోని డిఫెన్స్‌ ఎస్టేట్‌ సర్వీస్‌ అధికారిగా ఉన్న ధర్మారెడ్డిని టీటీడీలో కీలక బాధ్యతలు అప్పగించారు. డిప్యూటేషన్‌ అన్న చిన్న నిబంధనతో ఏకంగా ఐదు సంవత్సరాలు పాటు టీటీడీని కట్టపెట్టేశారు. ఆయనకు హోదా లేకపోయినా జేఈవో, తరువాత ఈవో పోస్టింగులు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయనకు సంబంధించి డిప్యూటేషన్‌ కాలం గడిచిపోయినా.. కేంద్ర పెద్దల కాళ్లా వేళ్లా పడుతూ పొడిగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్‌ గడువు సవిూపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆయన డిప్యూటేషన్‌ మే 14తో ముగియనుంది. ఆయన రిటైర్మెంట్‌ తీసుకునే జూన్‌ 30 వరకు కొనసాగించాలని తాజాగా జగన్‌ కేంద్రానికి ప్రతిపాదిస్తూ ఒక లేఖ రాశారు.అసలు ధర్మారెడ్డి లేనిదే టీటీడీ వ్యవహారాలు నడవవు అన్నట్టు జగన్‌ భావిస్తున్నారు. అందుకే కేంద్ర సర్వీసులో ఉన్న ధర్మారెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చారు. టీటీడీ అధ్యక్షులుగా…

Read More