Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Author: Swara
విజయవాడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, గుణదల 1వ డివిజన్ నందు స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ పర్యటనలో గడప గడపకు తిరిగి ప్రచార కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి , ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గోన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ 2014 ,19 లో సెంట్రల్ నియోజకవర్గంలో ఒక అరాచక వ్యక్తి పాలన సాగింది. రౌడీ, గుండా, బ్లాక్ మెయిలర్, షాపుల నుండి మామూలు వసూలు చేసే వ్యక్తి బోండా ఉమా. బోండా ఉమా ఒక వీధి రౌడీ లా ప్రవర్తించేవాడు. బోండా ఉమా ప్రజా సేవకు పనికి వచ్చే వ్యక్తి కాదు. వెల్లంపల్లి శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు. 2014, 19 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నగరానికి 100 కోట్లు…
రంపచోడవరం డివిజన్ పరిధిలో సుమారు 26 నాటు తుపాకులు స్వాధీనం…. 200 మంది పై బైండోవర్ కేసులు నమోదు చేశామని రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహళ్లి తెలిపారు…… వాయిస్ ఓవర్….. రంపచోడవరం ఏపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంపచోడవరం అలానే ఏ ఎస్ ఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాటు తుపాకులను స్వాధీనం చేయమని గతవారం ఇచ్చిన పత్రిక ప్రకటనకు విశేష స్పందన వచ్చిందని జిల్లా వ్యాప్తంగా 99 నాటు తుపాకులను స్వాధీనం చేశారని దీనిలో సుమారు 26 నాటు తుపాకులు రంపచోడవరం డివిజన్ పరిధిలో స్వాధీనం చేసుకుందామని ఆయన తెలిపారు ఏ స్పెషల్ డ్రైవ్ ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని ఇంకా ఎవరైనా అక్రమ ఆయుధాలు కలిగి స్వాధీనం చేయని వాళ్ళు ఉంటే వెంటనే సవిూపంలోని పోలీస్ స్టేషన్లో వాటిని అప్పగించాలని ఆయన కోరారు మార్చి 31 తర్వాత…
హైదరాబాద్, మార్చి 28 ’టిల్లు ఈజ్ బ్యాక్, సినిమా బ్లాక్ బస్టర్’ అంటున్నారు ఆల్రెడీ ‘టిల్లు స్క్వేర్’ చూసిన సినీ ప్రముఖులు. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ థియేటర్లలో భారీ సక్సెస్ సాధించింది. ఓటీటీల్లో, టీవీల్లోనూ వీక్షకుల్ని అలరించింది. ఆ సినిమాకు సీక్వెల్ గా సిద్ధూ జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ చేశారు. మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. అయితే… కొందరికి ముందుగా సినిమా చూపించారు. వాళ్లంతా బ్లాక్ బస్టర్ అంటున్నారు. ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ రివ్యూలు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే… ‘టిల్లు స్క్వేర్’కు భీమ్స్ సిసిరోలియో రీ రికార్డింగ్ చేశారు. లాస్ట్ ఇయర్ ‘బలగం’, ‘మ్యాడ్’, ఈ ఏడాది ‘రజాకార్’ సినిమాలతో ఆయన విజయాలు అందుకున్నారు. ‘మ్యాడ్’ నిర్మాతలతో ఆయన రెండో సినిమా ‘టిల్లు స్క్వేర్’. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ… ‘’హిట్టు కాదు, నా దృష్టిలో…
హైదరాబాద్, మార్చి 28 తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయనకు అన్ని దారులు మూసుకుపోయాయన్న అభిప్రాయం ఉంది. కానీ రాజకీయాల్లో ఒకే ఒక్క విజయంతో అన్ని దారులూ తెరుచుకుంటాయి. ఒక్క విజయంతో అన్నీ ప్లస్ అవుతాయి. కేసీఆర్ కు కూడా ఇప్పుడు అలాంటి అవకాశం పార్లమెంట్ ఎన్నికల ద్వారా వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన స్వీప్ చేయాల్సిన పని లేదు. నాలుగైదు సీట్లు తెచ్చుకుని గట్టి ప్రభావం చూపించగలగితే చాలు.. పరిస్థితులన్నీ మళ్లీ సానుకూలంగా మారుతాయి. ఇప్పుడు అలాంటి ప్రభావం చూపించేందుకు కేసీఆర్ కు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. 17 ఎంపీ స్థానాలకుగానూ ముగ్గురు సిట్టింగులకు బీఆరెస్ అధినేత అవకాశం కల్పించారు. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ స్థానాలు సిట్టింగ్‌లకు ఇచ్చారు. కరీంనగర్ సీటు గత ఎన్నికల్లో పోటీచేసిన బీ వినోద్‌కుమార్‌కు అభ్యర్థికి కేటాయించారు. ఇక మిగిలిన 13 స్థానాలు కొత్తవారిని బరిలో…
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించక ముందే 195 మందితో తొలి జాబితాను విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు నిన్న విడుదల చేసిన 7వ జాబితాతో కలిపితే మొత్తం 410 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిత్రపక్షాలతో కలిసి ‘మిషన్ 400 ప్లస్’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అందులో తన వాటాగా ‘టార్గెట్ 370’ సాధించాలని చూస్తున్న ఆ పార్టీ.. ఏకంగా సుమారు 108 మంది సిట్టింగ్ ఎంపీలకు ‘నో’ చెప్పింది. అంటే 2019లో గెలుపొందిన 303 మందితో పోల్చితే దాదాపు మూడో వంతు. అంటే ప్రతి ముగ్గురు బీజేపీ ఎంపీల్లో ఒకరిని కట్ చేసింది. తెలంగాణలోని నలుగురు బీజేపీ ఎంపీల్లో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు టికెట్ నిరాకరించిన ఉదాహరణ మన కళ్ల ముందే ఉంది. దేశవ్యాప్తంగా ఇదే తరహా కసరత్తు జరిగిందని సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. సిట్టింగ్ ఎంపీలకు సీట్లు కట్…
నెల్లూరు, మార్చి 28 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఎంతో ప్రత్యేకమైనవి. జిల్లా వ్యాప్తంగా ఎవరు గెలిచినా, ఓడినా.. నగర నియోజకవర్గంలో గెలిచిన పార్టీకే పట్టు ఎక్కువగా ఉంటుంది. 2004 వరకు నెల్లూరు ఒకటే నియోజకవర్గం. 2009 నుంచి నెల్లూరు సిటీ, రూరల్ గా రెండు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. రూరల్ నియోజకవర్గంలో కూడా సిటీలో ఉన్న కొన్ని డివిజన్లు కలుస్తాయి కానీ.. సిటీ నియోజకవర్గమే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. నెల్లూరు నియోజకవర్గం వామపక్షాలు మినహా అన్ని పార్టీలను ఆదరించింది. కాంగ్రెస్, టీడీపీ, భారతీయ జనసంఫ్‌ు, ప్రజారాజ్యం.. అన్ని పార్టీలకు ఇక్కడ ప్రాతినిథ్యం ఉంది. మొదట్లో ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఇక్కడ బోణీ కొట్టింది. మాజీ మంత్రి, ఏసీ సుబ్బారెడ్డిగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం చెంచు సుబ్బారెడ్డి 1955లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం…
రాజమండ్రి, మార్చి 28 దగ్గుబాటి పురంద్రీశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టనంత వరకూ పార్టీలో ఒక సీన్ ఉండేది. కొందరిదే ఆధిపత్యం. వారి నిర్ణయాలే అంతిమం. అధినాయకత్వానికి వారు ఇచ్చే నివేదికలను బట్టి కేంద్ర నాయకత్వం నిర్ణయాలు జరిగేవి. అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకున్నా రాష్ట్రంలో ఆ పార్టీతో కలసి ఎక్కడా పనిచేసిన దాఖలాలు లేవు. చివరకు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక మినహా బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పవన్ అడుగుపెట్టలేదు కూడా. నాటి రాష్ట్ర నాయకత్వం వైసీపీకి అండగా ఉంటూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందన్నది బీజేపీలో కొందరి వాదన.అయితే పురంద్రీశ్వరి అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆ బ్యాచ్ మొత్తం మౌనముద్ర దాల్చింది. ఎక్కడా కనిపించడమూ లేదు. చిన్నమ్మ అంతా తానే అయి పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపట్టారు. అధికార వైసీపీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ…
అనంతపురం, మార్చి 28 ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వచ్చేనెల ప్రకటించనున్నట్టు సమాచారం. సత్యసాయి జిల్లాలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఆశవాహులు అధికమయ్యారు. సత్యసాయి జిల్లాలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ఆశవహులు ఆయా నియోజకవర్గం నుంచి తాము పోటీకి సిద్ధమంటూ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. సత్యసాయి జిల్లావ్యాప్తంగా హిందూపురం అర్బన్, మడకశిర, కదిరి, పుట్టపర్తి, పెనుగొండ, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాలు సత్యసాయి జిల్లాలోకి వస్తాయి. హిందూపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్థి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తరఫున దరఖాస్తు చేసుకోగా అత్యధికంగా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. పదిమందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడలో వైఎస్ షర్మిల అధ్యక్షతన జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ప్రముఖులు సీనియర్ నాయకులు ఇన్చార్జిలు హాజరయ్యారు.…
తిరుపతి, మార్చి 28 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయం చాలా ఆసక్తిగా మారుతోంది. వైసీపీ క్లారిటీతో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి ఎవర్ని పక్కన పెట్టాలనే అంచనాలతో ముందుగానే అందరికీ సంకేతాలు ఇచ్చేసింది. అనుకున్నట్టుగానే ఒకేసారి సీట్లు ప్రకటించేసింది. కానీ కూటమిగా ఏర్పాడిన టీడీపీ, జనసేన, బీజేపీలో మాత్రం సీట్లు కేటాయింపు జరిగిందే తప్ప ఇంకా సర్దుబాట్లు మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా కొన్ని సీట్లపై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. నేతలు కూడా బహిరంగగానే చర్చించుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరును మూడు జిల్లాలుగా విభజించారు. ఇందులో తిరుపతి పార్లమెంటు పరిధిలో వైసీపీ నుంచి డాక్టర్ ఎం.గురుమూర్తి.. కూటమి నుంచి డాక్టర్ వి. వరప్రసాద్ రావు పోటీలో ఉన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో గురుమూర్తి గెలుపొందారు. ఇప్పటికే తిరుపతి ఎంపీగా ఉండగా రెండోసారి వైసీపీ నుంచి ఎంపీ కావాలని కోరుకుంటున్నారు. వరప్రసాద్‌రావు తిరుపతి ఎంపీగా, గూడూరు ఎమ్మెల్యేగా వైసీపీలో పని చేశారు. అక్కడ…
విశాఖపట్టణం, మార్చి 28 ఎట్టకేలకు అనకాపల్లి ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చేసింది వైఎస్‌ఆర్‌సీపీ. ప్రత్యర్థి ఎవరన్నది ప్రకటన వచ్చాక అన్నికోణాల్లో పరిశీలించింది. చివరకు డిప్యూటీ ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేరు ప్రకటించింది. టీడీపీ`బీజేపీ`జనసేన కూటమి అభ్యర్థి సీఎం రమేష్‌ని ఆయన ఢీ కొట్టనున్నారు.వైసీపీ హైకమాండ్ అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించింది. అయితే అనకాపల్లి సీటును మాత్రం పెండిరగ్‌లో పెట్టింది. ఎందుకు పెండిరగ్‌లో పెట్టిందన్న విషయం పార్టీలోని సీనియర్లకు మాత్రమే తెలుసు. మరే నాయకుడికి తెలీకుండా గోప్యంగా ఉంచింది. తొలుత అనకాపల్లి నుంచి జనసేన నుంచి నాగబాబు బరిలోకి దిగే ఛాన్స్ ఉందంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత సీఎం రమేష్ పేరిట ఫెక్సీలు కనిపించడంతో అందరిలోనూ అంచనాలు పెరిగాయి.రీసెంట్‌గా బీజేపీ విడుదల చేసిన జాబితాలో సీఎం రమేష్‌కు కేటాయించింది. వెంటనే ఆలస్యం చేయ కుండా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న బూడి ముత్యాలనాయడు పేరు ప్రకటించింది వైసీపీ. మాడుగుల అసెంబ్లీ సీటును ముత్యాలనాయుడు…
