Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Author: Swara
ఐపీఎల్ 2024 (IPL) ఫస్ట్ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ (MI) ఓటమితో ప్రారంభించింది. కొత్త కెప్టెన్ హర్ధిక్ పాండ్యా (Hardik Pandya) జట్టు సభ్యులను కమాండ్ చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) సైతం ఆదేశాలు జారీ చేశాడు. రోహిత్ శర్మను వెనక్కి వెళ్లు అని ఆదేశించాడు. హర్ధిక్ అలా చెప్పడంతో రోహిత్ శర్మ (Rohit Sharma) ఆశ్చర్య పోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి కెప్టెన్సీ లాక్కున్న పాండ్యా.. ఇప్పుడు తాను చెప్పిన చోట ఫీల్డింగ్ చేయమని చెప్పడంతో అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు రోహిత్ అక్కడికి వెళ్లు చివరి ఓవర్‌లో కొత్త కెప్టెన్ పాండ్యా ఫీల్డింగ్ సెట్ చేశాడు. సాధారణంగా రింగ్ లోపల రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తుంటాడు. స్లిప్, మిడాప్, మిడాన్ మధ్య ఉంటారు. అయితే రోహిత్ శర్మను వెనక్కి వెళ్లు అని…
నిజామాబాద్, మార్చి 25 రైతుబంధు స్కీమ్ ను రైతు భరోసాగామార్చేందుకు ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీనిపై అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్న నేపథ్యంలో?. ఎన్నికల పూర్తి అయిన తర్వాత ఈ స్కీమ్ కు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలను విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో?. గతంలో ఉన్న రైతుబంధు స్కీమ్ మార్గదర్శకాలను మార్చేందుకు కూడా సర్కార్ కసరత్తు చేస్తోంది. నిజానికి ఈ యాసంగి సీజన్ లోనే మార్గదర్శకాలు మారుతాయని అంతా భావించినప్పటికీ? సర్కార్ మాత్రం గతంలోనే ఉన్న మార్గదర్శకాలతోనే నిధులను జమ చేస్తామని ప్రకటించింది. అందుకే తగ్గట్టుగానే నిధుల జమ ప్రక్రియను ప్రారంభించింది. ఇక ఈసారి పంట పెట్టుబడి సాయం నత్తనడకన సాగుతూ వచ్చింది. మొదట గుంటలవారీగా జమ చేస్తూ వచ్చింది ప్రభుత్వం. సంక్రాంతి ముందు వరకు కూడా నిధులు జమ స్పీడ్ గా…
వరంగల్, మార్చి 25 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ గా నిలిచిన పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. ఇక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు హిస్టరీ క్రియేట్చేయగా.. అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ఎలక్షన్స్ సవిూపిస్తున్న వేళ అంతర్గత పోరు నడుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ దేవరుప్పుల మండల అధ్యక్షుడిని తొలగించి, ఆ పదవిని ఇంకో వ్యక్తికి అప్పగించడంతో హస్తం పార్టీలో రచ్చ మొదలైంది. ఎమ్మెల్యే అత్తగారైనా రaాన్సీరెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చుతున్నారంటూ కొందరు నేతలు నాలుగు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనకారులు శనివారం హైదరాబాద్ కు కూడా తరలివెళ్లారు. దీంతో పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం నడుస్తుండగా.. నిరసనలు కారణం అధ్యక్ష పదవి మార్పా.. లేక ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే చర్చ నడుస్తోంది.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మొన్నటి…
హైదరాబాద్, మార్చి 25 డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ ఏమైనా కాల్స్ వచ్చాయా అయితే అప్రమత్తంగా ఉండాలి. స్లీపర్ సెల్స్ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు, ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్‌కు ఏకంగా రూ.30 లక్షల కుచ్చుటోపీ పెట్టాని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మాజీ ఐపీఎస్, టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.‘హాలో.. మేం క్రైం బ్రాంచీ నుంచి మాట్లాడుతున్నాం. విూ పేరుతో లో ఒక పార్శిల్ బుక్ అయింది. అందులో నకిలీ పాస్‌పోర్టులు, డ్రగ్స్ ఉన్నాయి. అంతేకాదు, విూకు ఉగ్రవాద మాస్టర్ మైండ్ అయిన మహ్మద్‌తో పలు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి. విూరు తీవ్రమైన కేసులో ఇరుక్కున్నారు.’’ అంటూ నకిలీ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలకు ఫోన్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పార్శిళ్లలో డ్రగ్స్, తీవ్రవాదులతో బ్యాంక్ లావాదేవీలు చేశారంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారు.…
హైదరాబాద్, మార్చి 25 ఎండలు దంచి కొడుతున్నాయి. వర్షాలకు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ.. అవి ఏదో ఒకచోటకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నీటి అవసరాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదు లాంటి నగరంలో తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడిరది. జంట జలాశయాలు ఉన్నప్పటికీ.. అందులో సరిపడా నీరు లేదు. నాగార్జునసాగర్ ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. గోదావరి లోనూ నీరు అంతంతమాత్రంగానే ఉండడంతో అవి భవిష్యత్తు అవసరాలకు సరిపోని పరిస్థితి. వర్షాలు కురిసే వరకు ఈ తాగునీటికి ఇబ్బంది తప్పదు. దీంతో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.వేసవికాలం ముందు ఉన్నందున హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు ప్రకటించింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తాగునీటికి డిమాండ్ ఏర్పడుతున్నదని, మార్చి లోనే ఇలా ఉంటే ఏప్రిల్,…
నిజామాబాద్, మార్చి 25 గ్రెస్‌లో నిజామాబాద్ ఎంపీ సీటు హాట్ కేక్‌లా మారింది. ఇక్కడ అభ్యర్థిని ఏఐసీసీ పెండిరగ్‌లో పెట్టడంతో ఆశావహుల చూపు ఈ స్థానంపై పడిరది. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై టీపీసీసీ, ఏఐసీసీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో రెండో విడతలో 5 ఎంపీ సీట్లు ప్రకటించినా.. అందులో నిజామాబాద్ పేరు లేకపోవడం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి ఎంపీ అరవింద్ రెండోసారి టికెట్ దక్కించుకున్నారు. బీఆర్‌ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ఖరారైంది. బీజేపీ జగిత్యాలలో బహిరంగ సభకు ప్రధానిని తీసుకువస్తే? బీఆర్‌ఎస్ పార్లమెంటు ఎన్నికలపై సెగ్మెంటు ఎమ్మెల్యేలతో కలిసి సవిూక్ష నిర్వహించింది.కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. అయితే.. ఆయనకు జిల్లాలో క్యాడర్ ఏ మేరకు సహకరిస్తుందోనన్న చర్చ…
హైదరాబాద్, మార్చి 25 గ్రేటర్ ను చేజిక్కించుకునేందుకు గ్రేట్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది కాంగ్రెస్. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలను గెలవలేకపోయినా పార్లమెంటు పోరులో సత్తా చాటేందుకు పక్కా స్కెచ్ వేసింది. ఇప్పటికే గులాబీ పార్టీలోని కీలక నేతలకు గాలం వేస్తూ పావులు కదుపుతున్న కాంగ్రెస్ నేతలు.. ఈసారి జీహెచ్‌ఎంసీ మేయర్ తో టచ్ లోకి వెళ్లారు.ఆపరేషన్ ఆకర్ష్‌ను స్పీడప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రావిూణ ప్రాంతాల్లో మెజార్టీ సీట్లు సాధించిన హస్తం పార్టీ.. హైదరాబాద్ లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఫైట్‌లో పట్టు సాధించి గ్రేటర్ పై జెండా ఎగురవేయాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ పరిధిలో చేరికలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు హస్తం పార్టీ లీడర్లు. గ్రేటర్ పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్‌తో రెండు లాభాలను ఎక్స్ పెక్ట్ చేస్తోంది కాంగ్రెస్. గ్రేటర్ పరిధిలోని లోక్‌సభ సీట్లను గెలవడంతో పాటు.. రాబోయే రోజుల్లో…
హైదరాబాద్, మార్చి 25 ప్రభుత్వం మారింది. పాలకులు మారారు. అయినా గత ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నతాధికారులు అలానే కొనసాగుతున్నారు. వారే ఇప్పుడూ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారా? గతంలో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను ఇంకా అదే స్థానంలో కొనసాగించడం వెనక ఆంతర్యం ఏంటి? ఇంతకీ కాంగ్రెస్ సర్కార్.. ఆ ఉన్నతాధికారులను ఎందుకు అలానే ఉంచుతోంది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులందరిపై వేటు వేసే పని మొదలుపెట్టింది. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన కొంతమంది అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం.. మరికొంతమంది అధికారులకు మాత్రం కీలక పదవుల్లోనే కొనసాగిస్తూ వస్తోంది. ఇదే ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వేటుపడిన అధికారులు మెల్లమెల్లగా పెదవి విప్పుతున్నారు. తమకు పైరవీలతో పనిలేదని.. ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఎలాంటి పని చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, పైరవీలు చేసి పోస్టింగులు తెచ్చుకోబోమని కామెంట్స్ చేస్తున్నారు.అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలకంగా…
హైదరాబాద్, మార్చి 25 జోగినపల్లి సంతోష్‌రావు.. ఇలా అంటే చాలా మందికి తెలియదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సడ్డకుని కొడుకు? కేసీఆర్‌కు మందులు ఇచ్చే వ్యక్తి అంటే చాలా మందికి తెలుసు. ఇక హ్యాపీరావు అనే పేరుతో కూడా ఫేమస్ అయ్యాడు. మందులు ఇస్తున్నాడన్న భావనతో కేసీఆర్ ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చాడన్న విమర్శలూ ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు అయినా.. ఆయన కేసీఆర్ పక్కన తప్ప ఎక్కడా కనిపించరు. రాజ్యసభలో కనిపించిన సందర్భాలు తక్కవ. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ వెంట ఉండి ఆయన వ్యవహారాలు చక్కబెట్టిడంతోపాటు బీఆర్‌ఎస్ ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారని ప్రచారంలో ఉంది. ఇక గ్రీన్ చాలెంజ్ పేరుతో విూడియాలో ప్రచారం చేయించుకునే సంతోష్‌రావు.. ఆ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ రాజ్యసభ ఎంపీ పై తాజాగా కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు…
పులివెందుల లింగాల మండలం తాతిరెడ్డి పల్లె గ్రామంలో వెన్నపూస నారాయణరెడ్డి అనే వ్యక్తి ఆకుల లక్ష్మీనారాయణ (52) పై ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వేటకులవలతో దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణ హుటా హుటిన పులివెందుల ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం వెన్నపూస నారాయణరెడ్డి లక్ష్మీనారాయణ ఇంటిలోని మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించడంతో కేసు నమోదు చేయించారు. దీనిని మనసులో పెట్టుకున్న నారాయణరెడ్డి ఆదివారం లక్ష్మీనారాయణ తన ఇంటి బయట కూర్చుండడం చూసి వేట కొడవలితో దాడి చేసి తలకు తీవ్ర గాయం చేశారు దీంతో లక్ష్మీనారాయణ స్పృహ తప్పి పడిపోయాడని పోలీసులు తెలిపారు. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నారాయణరెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు..
