Author: Swara

విజయవాడ, మార్చి 28 (న్యూస్‌ పల్స్‌) ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు మే 13న జరగనున్నాయి. ఏప్రిల్‌ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈసారి ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రాజకీయ పార్టీలు. ఈసారి గెలుపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదా..? టీడీపీ`జనసేన`బీజేపీ కూటమిదా..? అన్నది ఓటర్ల చేతిలో ఉంది. మరి ఎన్నికల్లో… ఓట్లు వేసేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారా..? ఓటు ఉన్నవారంతా… పోలింగ్‌లో పాల్గొంటారా…? గత ఎన్నికల కంటే ఈసారి మెరుగైన పోలింగ్‌ శాతం నమోదవుతుందా…? అన్నది చూడాలి. 2019లో జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం వివరాలు… 2019 ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 79 శాతం పోలింగ్‌ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో 69.5శాతం, పలాసలో 72.8శాతం, టెక్కలిలో 78.5శాతం, పాతపట్నంలో 70శాతం, శ్రీకాకుళంలో 69శాతం, ఆమదాలవలసలో 79శాతం, ఎచ్చెర్లలో 84శాతం, నరసన్నపేటలో 79.6శాతం, రాజాంలో 73.8శాతం, పాలకొండలో 73.9శాతం ఓటింగ్‌ నమోదైంది. విజయనగరం జిల్లాలోని కురుపాంలో 77.7శాతం,…

Read More

విజయవాడ, మార్చి 28 డ్రగ్స్‌ కంటెయినర్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గానే ఉండగానే.. మరో కంటెయినర్‌పై ఏపీ రాజకీయాల్లో చర్చ ప్రారంభమయింది. మంగళవారం సీఎం జగన్‌ క్యాంప్‌ ఆఫీసు దగ్గరకు ఓ కంటెయినర్‌ వచ్చింది. పోలీస్‌ స్టిక్కర్‌ తో ఆ కంటెయినర్‌ ఉంది. కానీ పోలీసు వాహనం కాదు. రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ను బట్టి ఆర్టీసీ వాహనంగా భావిస్తున్నారు. ఆ కంటెయినర్‌ .. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ గేట్‌ వద్ద కాస్త లోపలికి వెళ్లి వస్తువుల్ని దింపడమో.. లేకపోతే ఏదో లోడ్‌ చేసుకుని వెళ్లడమో జరిగింది. ఈ దశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విమర్శలు ప్రారంభించింది. అ కంటెయినర్‌లో ఏం తెచ్చారు.. ఏం తీసుకెళ్లారన్నదానిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఆ పార్టీ సోషల్‌ విూడియా ఈ విషయంలో అనేక ప్రశ్నలు సంధిస్తోంది. అయితే ఈ అంశంపై వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ విూడియాలో స్పందించింది. ఆ కంటెయినర్‌.. వంట సామాన్లను తీసుకెళ్లిందని..…

Read More

కడప, మార్చి 28 కడప జిల్లా పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబమే. దశాబ్దాలుగా జిల్లాను ఏకచత్రాధిపత్యంతో ఏలిన వైఎస్‌ కుటుంబంలో…ఇప్పుడు ఆయన వారసుడు జగన్‌ సైతం ఆ పట్టుకోల్పోకుండా రాజకీయం నెరుపుతున్నారు. వివిధ వ్యాపారాలు చేసిన జగన్‌ వందల కోట్లు కూడబెట్టారు. గత ఎన్నికల(2019) సమయంలో ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం జగన్‌ ఆస్తుల విలువ 510 కోట్లు కాగా…అప్పులు 74 కోట్లు పైగానే ఉన్నట్లు తెలిపారు. వివిధ బ్యాంకుల్లో జగన్‌ పేరిట ఉన్న బాండ్లు విలువ నాలుగుకోట్లపైనే ఉండగా….వివిధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు, షేర్ల విలువు 381 కోట్లుగా ఉంది. మూడున్నర కోట్ల పర్సనల్‌ లోను అడ్వాన్స్‌ రూపంలో తీసుకోగా…దాదాపు పదికోట్లు విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇతర మార్గాల్లో ఆదాయం మరో 42 కోట్లు ఉంది. జగన్‌ మొత్తం చరాస్తుల విలువ 443 కోట్లు ఉంది. 70లక్షల…

Read More

అనంతపురం, మార్చి 28 నా ఎస్సీ, నాఎస్టీ, నా మైనార్టీ అని ఒకరంటే….మా పార్టీయే బలహీన వర్గాల పార్టీ అని మరొకరు అంటారు. ఇలా ఎవరికి వారు మే ఉద్దరించామంటే…మే ఉద్దరించామంటూ ప్రసంగాలు దంచి కొడుతున్నారు. సీట్ల కేటాయింపుల్లో కూడా లెక్కలు వేసుకొని బరిలోకి దిగారు. గత ఎన్నికల లెక్కలు పరిశీలిస్తే ఎంత మంది ఎన్నికల పరీక్షలో విజయం సాధించి అసెంబ్లీలో అధ్యక్షా అన్నారో పరిళీస్తే… గత ఎన్నికల్లో రిజర్వ్‌డు స్థానాలు పోనూ జనరల్‌ స్థానాల్లో అత్యధికంగా గెలిచింది రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 48 మంది రెడ్లు గెలుపొందారు. జగన్‌ హవా నడిచిన గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున రెడ్లకు ఇచ్చిన సీట్లలో ఒక్క ఉరవకొండనుంచి పోటీ చేసిన విశ్వేశ్వర్‌రెడ్డి తప్ప అందరూ విజయం సాధించారు. గెలిచిన మొత్తం వైసీపీ నుంచి గెలిచిన వారే. తెలుగుదేశం నుంచి ఒక్క రెడ్డి సామాజికవర్గం నేత…

Read More

మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ముయిజ్జు భారత వ్యతిరేకత వైఖరి వల్లే ఇరు దేశాల మధ్య ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. తన మొండి వైఖరిని మార్చుకోవాల్సిందిగా మాల్దీవుల ప్రతిపక్షాలు కోరుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ అదే డిమాండ్ చేశారు. మొండిగా ఉండటం మానేసి.. మాల్దీవులు ఎదుర్కుంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు, పొరుగు దేశాలతో సంబంధాల్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాలని కోరారు. ఇటీవల రుణమాఫీ కోసం ముయిజ్జు భారత్‌కు చేసిన విజ్ఞప్తి అనంతరం సోలిహ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (MDP) పార్లమెంటరీ అభ్యర్థులకు మద్దతుగా ‘మేల్’లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో సోలిహ్ మాట్లాడుతూ.. పొరుగు దేశాలతో ముఖ్యంగా భారత్‌తో ఉండాల్సిన సహకార ఒప్పందాల అవసరాన్ని నొక్కి చెప్పారు. చైనాకు ఎక్కువ రుణాలు ఉన్నప్పటికీ..…

Read More

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మా ర్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తే మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. ఈ ఏడాది మూడుసార్లు వడ్డీరేట్లు తగ్గించనున్నట్లు అమెరిక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ చేసిన ప్రకటన సూచీలకు దన్నుగా మారింది. అంతకుముందుతో పోల్చితే మార్కెట్‌ బ్రెడ్త్‌ క్రమంగా మెరుగుపడుతోంది. ఫియర్‌ ఇండెక్స్‌ సైతం తగ్గుతోంది. నిఫ్టీ మార్చి ఫ్యూచర్స్‌ మద్దతు 22,050 వద్ద, నిరోధం 22,300 వద్ద ఉన్నాయి. సోమవారం హోలీ సందర్భంగా స్టాక్‌ మార్కెట్లు పనిచేయలేదు. కాగా శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా మార్కెట్లకు సెలవు. మొత్తంగా ఈ వారం మార్కెట్‌ మూడు రోజులు మాత్రమే పనిచేయనుంది. స్టాక్‌ రికమండేషన్స్‌ హిందాల్కో: కొన్నాళ్ల క్రితం గ్యాప్‌డౌన్‌ అయిన ఈ కౌంటర్‌ ప్రస్తుతం నిలదొక్కుకుంటోంది. రూ.520 స్థాయిలో మంచి బేస్‌ ఏర్పడింది. నిఫ్టీతో పోలిస్తే మెరుగైన పనితీరును కనబరుస్తోంది. గత శుక్రవారంఈ షేరు రూ.547 వద్ద…

Read More

ముంబై: గడిచిన పదేళ్లలో స్టాక్‌ మా ర్కెట్‌ సూచీలు భారీ వృద్ధిని కనబరిచాయి. 2014 హోలీ నాటికి 6,494 పాయింట్ల వద్దనున్న నిఫ్టీ-50 సూచీ.. 2024 హోలీ నాటికి 240 శాతం వృద్ధితో 22,096 పాయింట్ల స్థాయికి చేరుకుంది. అలాగే, సెన్సెక్స్‌ కూడా 22,096 పాయింట్ల స్థాయి నుంచి 230 శాతం పెరుగుదలతో 72,831 వద్దకు చేరుకుంది. 2015 మినహా మిగతా అన్ని సంవత్సరాల్లో నిఫ్టీ పాజిటివ్‌ వృద్ధిని నమోదు చేసింది. 2021లో అత్యధికంగా 24 శాతం రిటర్న్‌లు పంచింది. 2023 లో సూచీ 20 శాతం పుంజుకుంది. గత ఏడాదిలో నిఫ్టీ తొలిసారిగా 19, 20, 21 వేల కీలక మైలురాళ్లను అధిగమించింది. కాగా, ఈ పదేళ్లలో నిఫ్టీ-50లోని 47 కంపెనీలు మల్టీ బ్యాగర్‌ రిటర్నులు పంచాయి. అందులో 14 కంపెనీల షేర్ల ధరలు 500 నుంచి 3,900 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఐదో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా…

Read More

బెంగళూరు: విరాట్‌ కోహ్లీ (49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) అర్ధ శతకంతో అదరగొట్టడంతో.. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు ఖాతా తెరిచింది. సోమవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై నెగ్గింది. తొలుత పంజాబ్‌ 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. ధవన్‌ (45), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (25), జితేష్‌ (27) రాణించారు. సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. దినేశ్‌ కార్తీక్‌ (10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రబాడ, హర్‌ప్రీత్‌ బ్రార్‌ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు. విరాట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. ఆఖర్లో అదరగొట్టారు..: కోహ్లీ ఎడాపెడా షాట్లతో విరుచుకుపడడంతో.. ఛేదనను బెంగళూరు ధాటిగా ఆరంభించింది.…

Read More

న్యూఢిల్లీ: మెగా లీగ్‌ ఐపీఎల్‌ ఫైనల్‌ మే 26న చెన్నై వేదికగా జరుగనుంది. ఈ మేరకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ రెండోదశను యూఏఈకి తరలిస్తారన్న ఊహాగానాలకు చెక్‌ పెడుతూ.. భారత్‌లోనే మిగిలిన మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసింది. 2011, 2012 తర్వాత చెన్నైలో ఫైనల్‌ను షెడ్యూల్‌ చేయడం ఇదే తొలిసారి. డిఫెండింగ్‌ చాంప్‌ హోదాలో టైటిల్‌ ఫైట్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం చెన్నైకు దక్కింది. ఒకవేళ సీఎ్‌సకే ఫైనల్‌కు చేరితే సొంత ప్రేక్షకుల ముందు ధోనీ ఘనంగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. అంతేకాకుండా మే 24న రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు కూడా చెపాక్‌ వేదిక కానుంది. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో మే 21న క్వాలిఫయర్‌-1, 22న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. తొలి దశలో 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేయగా.. వచ్చే నెల…

Read More

పుష్ప-2’ (Pushpa-2) షూటింగ్‌తో బిజీగా ఉన్న ఐకాన స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu arjun) కుటుంబంతో కలిసి దుబాయ్‌లో అడుగుపెట్టారు. అయితే షూటింగ్‌ కోసం కాదు. దుబాయ్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ (madame tussauds )మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ (Wax statue) కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తర్వాత మరో విశేష గౌరవాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మార్చి 28వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీని కోసం అల్లు అర్జున్‌ కుటుంబంతో దుబాయ్‌ చేరుకున్నారు. మార్చి 28 రాత్రి 8 గంటలకి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రభాస్‌, మహేష్‌ బాబు మైనపు విగ్రహాలు ఉన్న సంగతి తెలిసిందే! కానీ ఇవి లండన్…

Read More