Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Author: Swara
‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రామ్‌చరణ్9Ram Charan), సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా రావాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పలు సందర్భాల్లో రామ్‌చరణ్, సుకుమార్(Sukumar), కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’, సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్‌సీ 16 చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే! సోమవారం రామ్‌చరణ్ -సుకుమార్ తమ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీంతో ఎప్పటినుంచో అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్న కోరిక తీర్చినట్లయింది. అయితే సుకుమార్-చరణ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి రాజమౌళి (Rajamouli comments on RC17) ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్ లో చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘రామ్ చరణ్‌తో సుకుమార్ తీయనున్న సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్ సీన్ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్‌కు వచ్చేస్తారని నమ్మకంగా చెప్పగలను’’…
ఏలూరు, మార్చి 26 నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందటారు.. ఇగోకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తానే తోపునని భావిస్తే… రాజకీయాల్లో తోసి పడేస్తారు. ఈ ఉదాహరణలకు, సామెతకు ఒకే ఒక్కడు కనిపిస్తాడు రఘురామ కృష్ణరాజు. డబ్బుందని.. తన ఇమేజ్ వల్లనే గెలిచాడని ఆయన ఇన్నాళ్లు భ్రమలో ఉన్నాడు. టిక్కెట్ ఇచ్చి ఎంపీ చేసిన పార్టీ అధినేతపైనే విమర్శలకు దిగాడు. ప్రత్యర్థులతో చేతులు కలిపాడు. చివరకు ఆయన టిక్కెట్ కే ఎసరు వచ్చింది. పార్టీలు పెద్దగా పట్టించుకోక పోవడంతో నరసాపురం నుంచి ఐదేళ్ల పాటు రఘురామ కృష్ణరాజు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయి. ఇది స్వయంకృతాపరాధమని చెప్పక తప్పదు… 2019 ఎన్నికల్లో నరసాపుంర పార్లమెంటు నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. ఆ విజయం తనవల్లనేనని ఆయన భావించాడు. జగన్ బొమ్మతో గెలవలేదని, తన ఇమేజ్ తోనే గెలిచానని ఆయన చెప్పుకొచ్చారు. గెలిచిన ఏడాది తర్వాత వైసీపీ అధినాయకత్వానికి…
కరీంనగర్, మార్చి 26 ఉద్యోగాల కల్లా పోలీసు ఉద్యోగం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల వారు తమ సమస్యలను పరిష్కరించమని కోరేది పోలీసులనే. వారికేదైనా సమస్య ఎదురైతే ముందుగా తొక్కేది పోలీస్ స్టేషన్ గడపే. అయితే అటువంటి పోలీసు శాఖకు కొంతమంది అధికారులు మచ్చ తెస్తున్నారు. సమస్య విూద తమను కలిసిన వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి ఏఎస్‌ఐ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల ఓ యువతి భర్త తాగుడుకు బానిస అయ్యాడు. ప్రతిరోజు రాత్రి మద్యం తాగి వచ్చి ఆమెను కొడుతున్నాడు. పెద్ద మనుషులు సర్ది చెప్పినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. విసిగి వేసారి పోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త పెడుతున్న బాధలను ఫిర్యాదు రూపంలో పోలీసులకు అందజేసింది. ఆ సమయంలో అక్కడే…
హైదరాబాద్, మార్చి 26 దూరపు కొండలు నునుపు అంటారు.. దగ్గరికి వెళ్తే కానీ అసలు విషయం అర్థం కాదు. ఆ యువతీకి కూడా అలాంటి అనుభవమే ఎదురయింది. ఇప్పుడు జరిగింది తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది. హైదరాబాదులోని మదీనాగూడకు చెందిన ఓ యువతి (30) స్థానికంగా ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇంట్లోవాళ్లు పోరు పెడుతుండడంతో తన ప్రొఫైల్ ను ఓ మ్యాట్రిమోనీ సంస్థలో నమోదు చేసింది. ఆమె ప్రొఫైల్ చూసిన విజయవాడకు చెందిన శ్రీ బాల వంశీకృష్ణ (37) కాంటాక్ట్ అయ్యాడు. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారు. అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘‘నేను ఎప్పటినుంచో అమెరికాలో ఉంటున్నా. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి తీసుకొస్తానని’’ వంశీకృష్ణ చెప్పడంతో ఆ యువతి నమ్మింది. అయితే ఇక్కడే వంశీకృష్ణ తన అసలు సిసలైన చీటింగ్ ప్రణాళిక అమలు చేయడం మొదలు పెట్టాడు.ఇందులో భాగంగా ఆమె సిబిల్ స్కోర్ తెలుసుకున్నాడు. అయితే…
హైదరాబాద్, మార్చి 26 తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం చల్లబడిన వాతావరణం ఇప్పుడు రోజురోజుకూ వేడి పెరిగిపోతుంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే 41 డిగ్రీలు దాటాయి. ఇక రాత్రి పూట పలు ప్రాంతాల్లో 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామంలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం మధ్యాహ్నం వరకు అక్కాపూర్‌లో దాదాపు 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.ఆ తర్వాత 41 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిజామాబాద్ మోర్తాడ్ రెండో స్థానంలో నిలిచింది. కుమ్రంభీంలోని ఆసిఫాబాద్‌లో 40.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌లోని చాప్రాలాలో 40.8 డిగ్రీలు, సూర్యాపేటలోని రైనిగూడెంలో 40.7 డిగ్రీలు, నిజామాబాద్‌లోని కోరట్‌పల్లిలో 40.7, మహబూబ్‌నగర్‌లోని వడ్డేమాన్‌లో 40.6 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్‌లో 40.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 40.5 డిగ్రీలు, సిరికొండలో 40.5 డిగ్రీల చొప్పున…
సైబర్ మోసాలపై అవేర్‌నెస్ ఎంత పెరుగుతున్నా మోసాల సంఖ్య మాత్రం తగ్గట్లేదని రిపోర్ట్‌లను బట్టి తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మూడేళ్లలో సుమారు 12 వేల సైబర్ మోసాలు జరిగాయట. దాదాపు రూ.461 కోట్ల డబ్బు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లింది. ముఖ్యంగా ఎలాంటి సైబర్ మోసాలు కామన్‌గా జరుగుతున్నాయంటే.. దేశంలో జరుగుతున్న సైబర్ మోసాల్లో క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్‌ల ద్వారా జరుగుతున్న మోసాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సరైన సెక్యూరిటీ, పాస్‌వర్డ్‌లు మెయింటెయిన్ చేయకపోవడం వల్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. దీంతోపాటు మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఏఐ టూల్స్ ద్వారా కూడా పలు రకాల మోసాలు అమలుచేస్తున్నారు సైబర్ నేరగాళ్లురీసెంట్‌గా జరిగిన పలు సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా జరిగిన మోసాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ నిర్వహించిన ‘ది ఆర్టిఫిషియల్ ఇంపోస్టర్’ సర్వేలో సుమారు 47 మంది భారతీయులు ఏఐ వాయిస్…
కరీంనగర్, మార్చి 26 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ కాంగి‘రేస్’ టికెట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ స్థానానికి ముగ్గురు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. కరీనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కొడుకు రాజేందర్‌రావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి బలమైన అభ్యర్థులు ఉండడంతో వారిని ఎదుర్కొనేలా కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్)ను తెరపైకి తెచ్చింది.అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పలు నియోజకవర్గాలో?ల ప్రచారం చేశారు. ఎమ్మెల్యేల ఎన్నికకు సహకరించారు. కొంతమందికి ఆర్థిక సాయం కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎంపీ టికెట్ ఇస్తే ఖర్చుపెట్టడానికి మల్లన్న సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో కరీంనగర్ నుంచి బరిలో దించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీకి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఏఐసీసీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీన్మార్…
హైదరాబాద్, మార్చి 26 పేరుకు గ్రేటర్ హైదరాబాద్.. కానీ కదిలిస్తే ఎన్నో సమస్యలు కళ్ల ముందుంటాయి. ఏ సిటీకైనా కనీస వసతులతో పాటు మంచినీటి సౌకర్యం ముఖ్యం. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని చోట్లా ఇప్పటికే జనాలు కలుషిత నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ముఖ్యంగా రెండో వార్డులో తాగునీరు కలుషితమవుతుండటంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కాలనీవాసులకు బురద నీరే తాగునీరుగా మారింది. అయితే గత కొన్ని రోజులుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతుంది, దీంతో నీటి ద్వారా వచ్చే వ్యాధులు అనేకం నమోదవుతున్నాయని స్థానికులు చెబుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.నీటి నాణ్యత సరిగా లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని, క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ (క్యూఏఅండ్టీ) విభాగం లేకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు వాపోతున్నారు. ఎస్…
మహబూబ్ నగర్, మార్చి 26 నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి పోటీకి అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక ప్రచారాన్ని హోరెత్తించనున్నారు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ ప్రచారాన్ని ప్రారంభిచారు. తాజాగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు సైతం ఖరారు కావడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. కందనూలులో పార్లమెంట్ ఎన్నికల హడవిడి హోరెత్తనుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల ముఖచిత్రం సరికొత్తగా రూపుదిద్దుకుంది. బీజేపీ నుంచి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీఆర్‌ఎస్ నుంచి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయా పార్టీల్లో టికెట్ కోసం ఫైట్ జరగగా ఇప్పుడు అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో పోరు తారాస్థాయికి చేరింది. అందరికంటే ముందుగానే కమలం పార్టీ నాగర్ కర్నూల్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్…
కరీంనగర్, మార్చి 26 (న్యూస్ పల్స్) ఈ వేసవిలో కరీంనగర్ లో తాగునీటి కష్టాలు తప్పలే కనిపించడంలేదు. లోయర్ మానేర్ డ్యామ్ లో నీళ్లు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాగునీటిని ఆపి ముందు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. కరీంనగర్ కు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. వేసవి ఆరంభంలోనే నగర సవిూపంలోని లోయర్ మానేర్ డ్యామ్(ఎల్‌ఎండీ))లో నీళ్లు అడుగంటాయి. డెడ్ స్టోరేజ్ కి వాటర్ చేరడంతో అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. నీటి నిలువలు పడిపోవడంతో నగరంలో బోర్ వెల్స్ కూడా సరిగా పనిచేయడం లేదు. కరీంనగర్ తోపాటు పలు గ్రామాలకు తాగునీటి సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడిరది. 24 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం గల లోయర్ మానేర్ డ్యామ్ లో ప్రస్తుతం 5.3 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అందులో కొంత సాగునీటికి మరికొంత ఆవిరై పోతుంది. వారం పదిరోజులైతే మూడు…
