Author: Swara

హైదరాబాద్‌, మార్చి 26 (న్యూస్‌ పల్స్‌) తెలంగాణలో టెట్‌ పరీక్ష ఫీజులు భారీగా పెంచడంపై నిరుద్యోగులు, వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం దిగినట్లు తెలుస్తోంది. గతంలో టెట్‌ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా… దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గూబ గుయ్యిమనిపించింది.. గతంలో రూ.300 గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచేసింది.ఈ నేపథ్యంలో ఫీజులను ఈ స్థాయిలో పెంచడంపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్‌, శిక్షణ, హాస్టల్‌ ఫీజులకే వేల రూపాయలు ఖర్చుపెడుతున్న తమకు పెరిగిన పరీక్ష ఫీజలు చెల్లించడం మరింత భారంగా మారిందని, ఇలా చేయడం తగదని.. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని కోరుతున్నారు. ఫీజుల వ్యవహారం సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఫీజుల పెంపు అధికారుల స్థాయిలోనే జరిగిందని సీఎంవో వర్గాలు సీఎంకి వెల్లడిరచినట్లు తెలిసింది. దీంతో సమస్య తీవ్రతరం…

Read More

ఖమ్మం, మార్చి 26 భద్రాచలం సీతారాముల కల్యాణం పట్టాభిషేకం వేడుకల్లో నేరుగా పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లను నేటి నుంచి విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడిరచారు. ఏప్రిల్‌ 17న సీతారాముల వారి కల్యాణం, 18న మహా పట్టాభిషేకం వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల కోసం మార్చి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని భావించే భక్తులు ఆన్‌లైన్‌లో ముందే టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ప్రత్యక్షంగా కళ్యాణం, పట్టాభిషేక కార్యక్రమాలను వీక్షించేందుకు సెక్టార్‌ టికెట్లను సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించారు.శ్రీరామనవమి రోజు ఉభయ దాతల సేవా టికెట్‌ రుసుము రూ.7,500గా నిర్ణయించారు. ఈ టిక్కెట్‌పై ఇద్దరికి ప్రవేశం…

Read More

హైదరాబాద్‌, మార్చి 26 ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ఈసారి కాస్త ముందుగానే స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో ఇప్పటికే ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. ఏపీలో ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 13 వరకు దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులుప్రకటించే అవకాశం ఉంది. టెన్త్‌ విద్యార్థులకు ఇంకాస్త ముందుగానే సెలవులు ప్రకటిస్తారు. తెలంగాణలో ఇంచుమించూ ఇదే తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి టూర్లకు, దేవాలయాలకు వెళ్తుంటారు. దీంతో పాటు విద్యార్థులు అమ్మమ్మ, నాయనమ్మ గారి ఇళ్లకు వెళ్తుంటారు. సమ్మర్‌ లో తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. సమ్మర్‌ లో రైళ్లలోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఇంకా సమ్మర్‌ హాలీడేస్‌ ప్రకటించకుండానే ట్రైన్‌ టికెట్లు బుక్‌ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల…

Read More

హైదరాబాద్‌, మార్చి 26 తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక సూత్రధారి స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్రాంచ్‌ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌ రావు అని పోలీసులు నిర్థారించారు. ఎస్‌ఐబీని రాజకీయ ప్రయోజనకాల కోసం దుర్వినియోగం చేసినందుకు కీలక బీఆర్‌ఎస్‌ నేతపై చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారని సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌ రావు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధా కిషన్‌ రావుపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. అలాగే ఓ ప్రాంతీయ విూడియా ఛానెల్‌కు చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌పై కూడా లుక్‌ అవుట్‌ నోటీస్‌ జారీ చేశారు.ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ముగ్గురినీ ప్రశ్నించాలని పోలీసులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, సన్నిహితులపై…

Read More

మంచిర్యాల,మార్చి 26 బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు వెల్గటూర్‌ మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జ్‌ దీప్‌ దాస్‌ మున్షి,.ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు,ధర్మపురి ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.జగిత్యాల జిల్లాలో ప్రజాబలం కలిగి ఉన్న శ్రీనివాసరావు కాంగ్రెస్‌ పార్టీలో చేయడంతో టిఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది.ధర్మపురి నియోజకవర్గ ప్రజలతో చర్చించి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు అప్పటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కు శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడుగా ముద్ర ఉంది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయంలో? శ్రీనివాసరావుకు రాష్ట్రనామినేటెడ్‌ పదవి ఇస్తారని కూడా వార్తలు వినిపించాయి. పెద్ద పెళ్లి పార్లమెంటు నుండి ఎంపీగా పోటీ చేసే కొప్పుల ఈశ్వర్‌ కు శ్రీనివాసరావు కాంగ్రెస్‌ పార్టీలో చేయడంతో షాక్‌ తగిలినట్టు అయింది.ధర్మపురి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో శ్రీనివాసరావు వర్గీయులు కూడా…

Read More

ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ వారిచే ప్రారంభించబడిరది. నాటకం సర్వజననీయం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా ఎదిగింది. దాదాపుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటకం రూపం మారుతుందేగానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల ప్రక్రియగావిరసిల్లుతుంది. ప్రస్తుతమున్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యింది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల దినోత్సవం పుట్టింది. 1961లో వియన్నాలో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు ‘ఆర్వికివియా’ ప్రపంచ రంగస్థల…

Read More

తిరుపతి, మార్చి 25 తిరుపతి లోక్‌సభ స్థానాన్ని పార్టీలు మారి వచ్చిన వారికి టిక్కెట్‌ ఇవ్వడం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. మూడు పార్టీలు మారి బీజేపీలో చేరి టిక్కెట్‌ ను తెచ్చుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఏ మేరకు సహకరిస్తాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు సీటు మాజీ ఐఏఎస్‌ అధికారి వరప్రసాదరావుకు బీజేపీ సీటు కేటాయించింది. అయితే ఆయనకు ఏ విధంగా టిక్కెట్‌ ఇస్తారని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నరసాపురంలో గెలిచే రఘురామ కృష్ణరాజుకు కాదని పార్టీ నేతకు టిక్కెట్‌ ఇచ్చినప్పుడు తిరుపతిలోనూ అదే ఫార్ములా ఎందుకు పనిచేయదని కమలం పార్టీలో కొందరు నిలదీస్తున్నారు.ఇంటి పేరునే బ్రాండ్‌ గా మార్చుకున్న లీడర్‌ను జనం ఆదరిస్తారా? ట్రాక్‌ రికార్డు మాత్రం… తిరుపతి పార్లమెంటు స్థానం ఎప్పుడూ కాంగ్రెస్‌ ఆ తర్వాత వైసీపీలదే. చివరిసారి 1999లో తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటస్వామి గెలుపొందారు. అదే ఆఖరు.…

Read More

విజయవాడ, మార్చి 26 సుజనా చౌదరి పేరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఆయనకు బిజెపి ఎంపీ టికెట్‌ ఎందుకు ప్రకటించలేదు? పొలిటికల్‌ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో సుజనా చౌదరి తప్పకుండా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఒకానొక దశలో ఆయన విజయవాడ నుంచి పోటీ చేస్తారని కూడా టాక్‌ నడిచింది. విజయవాడ సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నాని వైసీపీ లోకి వెళ్లడంతో.. తప్పకుండా సుజనా చౌదరి బలమైన అభ్యర్థి అవుతారని అంతా భావించారు. ఆయన బిజెపి అభ్యర్థి అయితే చంద్రబాబు సైతం అభ్యంతరం చెప్పరని కూడా అనుకున్నారు. తరువాత గుంటూరు లోక్సభ స్థానం నుంచి సుజనా చౌదరి బరిలో దిగుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇటువంటి తరుణంలో బిజెపి ఎంపీ అభ్యర్థుల జాబితాలో సుజనా చౌదరికి చోటు దక్కకపోవడం విశేషం.సుజనా చౌదరి సీనియర్‌ నాయకుడు.2014 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు.ఆ ఎన్నికల్లో పార్టీ…

Read More

విజయవాడ, మార్చి 26 ఎపీలో మరోసారి అధికారంలోకి రావాలని జగన్‌ భావిస్తున్నారు. వై నాట్‌ 175 అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు. అటు విపక్షాలు కూటమి కట్టాయి. బలమైన అభ్యర్థులను బరిలో దించుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రాయలసీమలో ఎట్టి పరిస్థితుల్లో పట్టు తగ్గకూడదని భావిస్తున్నారు. కోస్తా తో పాటు ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. ముఖ్యంగా 68 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. ఏకపక్షంగా విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 23స్థానాలకు పరిమితమైంది.జనసేన ఒకచోట విజయం సాధించింది. అంటే ఆ 24 స్థానాలతో పాటు పదివేల కంటే తక్కువ మెజారిటీ ఉన్న స్థానాలు 44 వరకు ఉన్నాయి. అటు విపక్షాలు గెలిచిన సీట్లతో పాటు తక్కువ మెజారిటీ దక్కిన స్థానాలను కలుపుకుంటే.. 68 అసెంబ్లీ సీట్లు…

Read More

కాకినాడ, మార్చి 26 ఏపీలో ఎన్నికల సవిూపిస్తున్న కొలది ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాపుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కాపు ఓట్లను తమ వైపు తిప్పుకుంటే గెలుపు ఖాయమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపు ఫ్యాక్టర్‌ బలంగా వినిపిస్తోంది. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. పవన్‌ కళ్యాణ్‌ వైపు కాపులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ బరిలో నిలిచినా.. రకరకాల కారణాలతో కాపులు జగన్‌ వైపు ఆసక్తి చూపారు. వారిని తన వైపు తిప్పుకోవడంలో జగన్‌ కూడా సక్సెస్‌ అయ్యారు. ఇందుకు ముద్రగడ కూడా పరోక్షంగా కారణమయ్యారు. చంద్రబాబు పై ఉన్న కోపంతో ముద్రగడ కాపులను తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేశారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ జనసేన వైపు వారిని మరల్చలేదు. జగన్‌ వైపు వెళ్లేలా తెర వెనుక ప్రోత్సాహం అందించారన్న అపవాదు ముద్రగడ పై ఉంది.…

Read More