Author: Swara

అనంతపురం, మార్చి 26 శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ టికెట్‌ విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. నియోజకవర్గంలోని కూటమి నేతలు ఎవరికి వారు తమకే టికెట్‌ అంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే టికెట్‌ ఎవరికీ అన్నదానిపైన స్పష్టత రాకపోవడం ఒకటైతే రోజుకొక పేరు తెరపైకి వస్తుండడంతో నియోజకవర్గంలోని కూటమి పార్టీలు నేతలు అయోమయ పరిస్థితిలో పడ్డారు. మొన్నటి వరకు ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జిగా టిడిపి నేత పరిటాల శ్రీరామ్‌ కొనసాగుతూ వచ్చారు. నియోజకవర్గంలో బలమైన నేతగా పరిటాల శ్రీరామ్‌ టీడీపీని నడిపించారు.మొదట టిడిపి, జనసేన కూటమిగా ఏర్పడిన అనంతరం ధర్మవరం అసెంబ్లీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ధర్మవరంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి పొత్తుల భాగంగా టికెట్‌ తనకే కేటాయిస్తారని జనసేన నేతలతో చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన, టిడిపి, బిజెపితో జత కట్టడంతో నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాలు ఒక్కసారిగా మారిపోయాయి. అదే నియోజకవర్గంలో బిజెపి…

Read More

గుంటూరు, మార్చి 26 రాజకీయంగానూ, వాణిజ్య పరంగానూ ముందంజలో ఉండే గుంటూరు జిల్లాలో ఎన్నికలంటేనే కోట్లతో వ్యవహారం ముడిపడి ఉంటుంది. ప్రధాన పార్టీ నుంచి టిక్కెట్‌ దక్కాలే గానీ… కోట్లు ఖర్చుపెట్టేందుకు క్యూలో ఉంటారు. అలాంటిది వరుసగా టిక్కెట్లు దక్కించుకుని పోటీలో ఉన్న నేతల ఆస్తుల వివరాలు ఒకసారి చూసేద్దామా…గుంటూరు జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితం ఏదైనా ఉందంటే అది మంగళగిరి నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడి నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన ఈసారి గెలుపై ధీమాగా ఉన్నారు. ఆర్థికంగా ఆయన్ను ఢీకొట్టే అభ్యర్థి జిల్లాలోనే లేడని చెప్పాలి. ఒకసారి లోకేశ్‌ ఆస్తులు వివరాలు చూద్దాం. మార్కెట్‌ విలువ ప్రకారం ఆయన ఆస్తులు 373 కోట్లు కాగా…. అప్పులు 10 కోట్లు వరకు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో బాండ్ల…

Read More

కడప, మార్చి 26 ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు విస్తృతంగా చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఏప్రిల్‌ 17 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 22న సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 17 నుంచి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఏప్రిల్‌ 22వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశిల్‌ జిల్లా యంత్రాంగంతో సోమవారం ఒంటిమిట్టలో జేఈవో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమష్టి కృషి చేసి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని సీతారాముల కల్యాణాన్ని(అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. అన్ని…

Read More

విశాఖపట్టణం, మార్చి 26 విశాఖ డ్రగ్స్‌ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న కొందరిని సీబీఐ అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ నెల 16న బ్రెజిల్‌ దేశం నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీగా డ్రగ్స్‌ ఉన్నట్లు ఇంటర్‌ పోల్‌ సమాచారం సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగుల డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో డ్రగ్స్‌ ప్యాక్‌ చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఈ డ్రగ్స్‌ కంటెయినర్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు…అది ఎవరి పేరు బుక్‌ అయ్యిందో, ఎక్కడికి వెళ్తుందో ఆరా తీస్తున్నారు.సీబీఐ దర్యాప్తులో సంధ్య ఆక్వా పేరు బయటపడిరది. డ్రగ్స్‌ తో వచ్చిన కంటెయినర్‌ సంధ్య ఆక్వా పేరిట బుక్‌ అయ్యింది. దీంతో సీబీఐ సంధ్య ఆక్వా కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు విశాఖ పోర్టులో కస్టమ్స్‌ కార్యకలాపాలపై దృష్టి సారించారు.…

Read More

భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ఇప్పుడు ఐర్లాండ్ దేశానికి ప్రధానిగా(Prime Minister) ఎంపికయ్యారు. ఇప్పటికే బ్రిటన్ సహా పలు దేశాల్లో కీలక పదవుల్లో ఉన్న భారతీయులు ఇప్పుడు ఐర్లాండ్‌(Ireland)లో కూడా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సైమన్ హారిస్(Simon Harris) ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. లియో వరద్కర్ రాజీనామా తర్వాత, 37 ఏళ్ల యువ నేతకు బాధ్యతలు అప్పగించారు. పాలించే ఫైన్ గేల్ పార్టీకి కొత్త నాయకుడిగా ఎన్నికైన తర్వాత హారిస్ ఇప్పుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా అవతరించారు. 37 ఏళ్ల సైమన్ హారిస్(Simon Harris), లియో వరద్కర్(Leo Varadkar) స్థానంలో ఆదివారం పార్టీ నాయకుడిగా నియమితులవడం తన జీవితంలో గొప్ప గౌరవమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తనను ఎన్నుకున్న వారికి హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. మీ నమ్మకాన్ని తిరిగి చెల్లిస్తానని అన్నారు. నిజానికి లియో వరద్కర్ అనూహ్యంగా బుధవారం రాజీనామా చేశారు, పార్టీ మరొక…

Read More

నిఫ్టీ గత వారం కీలక స్థాయి 22,000 వద్ద ప్రారంభమై కరెక్షన్‌లో పడి 21,700 వరకు దిగజారినా రికవరీ సాధించి వారంలో 70 పాయింట్ల మేరకు లాభపడి చివరికి ఆ కీలక స్థాయి కన్నా పైనే ముగిసింది. సానుకూల సంకేతం కోసం వరుసగా రెండో వారంలో కూడా 22,000 వద్ద మరింత కన్నాలిడేషన్‌ సాధించడం అవసరం. అలాగే ఈ వారంలో మూడు ట్రేడింగ్‌ దినాలు మాత్రమే ఉన్నందు వల్ల మరింత కన్సాలిడేషన్‌కే అవకాశాలున్నాయి. నిఫ్టీ గత రెండు నెలల కాలంలో 22,000 వద్ద సైడ్‌వేస్‌లో కదలాడుతూ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. గత వారం మిడ్‌క్యాప్‌ 100 సూచీ 600 పాయింట్లు, స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 200 పాయింట్ల లాభంతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల తీరు ఆధారంగా ఇప్పుడు మార్కెట్‌ అప్రమత్త ధోరణిని కొనసాగించవచ్చు. అందువల్ల ప్రధాన మానసిక అవధి 22,000 వద్ద పరీక్ష ఎదురుకావచ్చు. బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ రికవరీ బాట…

Read More

చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ కార్ SU7 మోడల్ ధరలను గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతోపాటు కొనుగోళ్ల కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే కార్ ధర 5 లక్షల యువాన్ల (దాదాపు రూ. 58 లక్షలు) లోపే ఉంటుందని కంపెనీ సీఈఓ లీ జున్(CEO Lei Jun) తెలిపారు. ఇది చాలా అందంగా కనిపించడంతోపాటు డ్రైవింగ్ చేయడానికి సులభంగా, స్మార్ట్‌గా ఉంటుందని ఆయన తెలిపారు. ఇది టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంటే ఎక్కువ యాక్సిలరేషన్ ఇస్తుందని లీ చెప్పారు. అయితే డిసెంబర్‌లో ఈ కారును ప్రకటించినప్పటి నుంచి దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ఇది ప్రపంచంలోని టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులలో ఒకటిగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. చైనా(china)లోని షియోమీ షోరూమ్‌లో ఈ కారు ప్రదర్శన కూడా ప్రారంభమైంది.

Read More

ఇంద్రగంటి మోహన్ కృష్ణ తనకంటూ దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ‘గ్రహణం’ అనే ఒక సినిమా తీసినప్పుడే అతని అభిరుచి, అతనికి సినిమా పట్ల వున్న మక్కువ, అతని సాహిత్య నేపధ్యం ఇవ్వన్నీ అర్థం అవుతాయి. నానిని నటుడిగా పరిచయం చేస్తూ ఇంద్రగంటి 2006లో తీసిన ‘అష్ట చెమ్మ’ మొదటి ఘన విజయం దర్శకుడిగా. ఆ తరువాత తీసిన ‘గోల్కొండ హై స్కూల్’, ‘అంతకు మించి ఆ తరువాత’ సినిమాలో విజయం సాధించటమే కాకుండా, ఇంద్రగంటిని ఒక ప్రత్యేక దర్శకుడిగా పేరు తీసుకొచ్చాయి. ఇంద్రగంటి ఏ సినిమా చేసినా అది చాలా క్లీన్ గా వుంది సకుటుంబంగా చూసే విధంగా ఉంటుంది. ‘అమీ తుమీ’, ‘సమ్మోహనం’ కూడా విజయం సాధించి ఇంద్రగంటి మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే ఇంద్రగంటి చివరి రెండు సినిమాలు ‘వి’ (2020), ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (2022)…

Read More

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. పరశురామ్ దర్శకుడు, కాగా గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. విజయ్, పరశురామ్, గోపి సుందర్ ఇంతకు ముందు ‘గీత గోవిందం’ సినిమాకి పని చేశారు, ఇప్పుడు మళ్ళీ ఆ ముగ్గురూ ఈ ‘ఫ్యామిలీ స్టార్’ కి చేతులు కలిపారు. ఇంతకు ముందు సినిమా సంగీతపరంగా పెద్ద విజయం సాధించటమే కాకుండా, సినిమా కూడా విజయ్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా సాధించింది, ఇప్పుడు ఈ ‘ఫ్యామిలీ స్టార్’ కూడా అంతకన్నా పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు. ఈరోజు ‘మధురం కదా’ అనే ఒక లిరికల్ పాటని విడుదల చేశారు. శ్రీమణి రచించిన ఈ పాటని శ్రేయ ఘోషల్ పాడారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రచారాలు మొదలెట్టారు, అందులో భాగంగానే ఇంతకుముందు రెండు పాటలను విడుదల…

Read More

ఐపీఎల్ 2024(ipl 2024)లో ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఈరోజు నెక్ట్స్ మ్యాచుకు సిద్ధమైంది. ఈ ఆరో మ్యాచ్ తమ సొంత స్టేడియం బెంగళూరు(Bengaluru) చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)తో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే పంజాబ్, బెంగళూరు రెండు జట్లు కూడా స్టార్ ప్లేయర్‌లతో నిండి ఉండటం విశేషం. ఇక ఈ రెండు జట్ల ఆటగాళ్లు హోలీ(holi) రోజున తమ జట్టును గెలిపించేందుకు ప్రయత్నించనున్నారు. టోర్నీలో తొలి మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్ రెండో మ్యాచ్‌లోనూ గెలవాలని చూస్తోంది. మరోవైపు సొంత మైదానంలో మొదటి విజయాన్ని రుచి చూడాలని ఆర్సీబీ(RCB) భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో ఫీల్డ్ ఉంటే బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ(virat kohli), ఫాఫ్ డు ప్లెసిస్‌లు(Faf du Plessis) ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ మైదానంలో వీరిద్దరి గత రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. దీంతో పాటు శిఖర్ ధావన్, జానీ…

Read More